ఆలస్యంగా నడుస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్
గుంటూరు : సికింద్రాబాద్ నుంచి కోల్కత్తా మధ్య నడిచే ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఇంజిన్ నుండి రెండు బోగీలు విడిపోయాయి. విజయవాడ నుంచి ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు బయల్దేరిన రైలు మంగళగిరి సమీపంలోకి రాగానే బోగీలకు, ఇంజిన్కు మధ్య లింక్ తెగిపోవటంతో ఈ ఘటన జరిగింది.
అయితే రైలు నెమ్మదిగా నడుస్తుండటంతో ప్రమాదం తప్పింది.సకాలంలో గుర్తించిన సిబ్బంది రైలును నిలిపివేశారు. అనంతరం రైలును కృష్ణా కెనాల్ జంక్షన్కు తీసుకువెళ్లి మరమ్మతులు నిర్వహించారు.ఆ తర్వాత రైలు సికింద్రాబాద్ బలయద్ఏరింది. దీంతో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది.