సాక్షి, సికింద్రాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ప్లాట్‌ఫ్లామ్-1పైకి ఫలక్‌నుమా రైలు చేరుకుంది. అగ్నిప్రమాదం అనంతరం.. 11 బోగీలతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు చేరుకుంది. అనంతరం, రైల్వే అధికారులు ప్రయాణీకులు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇక, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగింది. అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. రైలులో సిగరెట్లను స్నాక్స్ అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నా టీటీ సహా ఎవరూ పట్టించుకోలేదు. సిగరెట్లు, గుట్కాలను రైలు అమ్ముతున్నారు.
ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగింది. ముందుగా ఎస్4 బోగీలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రైలు నుంచి పరుగులు తీశాం. మా లగేజీ మొత్తం కాలిబూడిదైపోయింది. వస్తువులు, బ్యాగులు, డబ్బులన్నీ కాలిపోయాయి. పగలు ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో అయితే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు.
ఇదిలా ఉండగా.. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఒక బోగిలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఓ ప్రయాణీకుడు వెంటనే చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో, ఆ బోగిలో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. మిగతా బోగీల ప్రయాణికులను సైతం కిందకు దింపారు. చూస్తుండగానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. చైన్ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, చైన్‌లాగిన వ్యక్తి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మంటలు అంటుకున్నపుడు భయపడి ఆందోళనకు గురయ్యాడో ఏమో మొత్తం మీద అతన్ని రైల్వే సిబ్బంది ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని తెలుస్తున్నది.
ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
Comments
Please login to add a commentAdd a comment