భర్త ప్రదీప్‌తో రామలక్ష్మి (ఫైల్) , కుమారుడు రేవంత్, రామలక్ష్మి రాసిన లెటర్
బుట్టాయగూడెం: ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కృష్ణాపురంలో బుధవారం చోటు చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియకరాకపోవడంతో స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
బుట్టాయగూడెం మండలం కృష్ణాపురానికి చెందిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు, విజయ దంపతుల కుమార్తె రామలక్ష్మికి రెండేళ్ల క్రితం జంగారెడ్డిగూడేనికి చెందిన ఓలేటి ప్రదీప్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి రేవంత్ అనే ఆరు నెలల బాబు ఉన్నాడు. 15 రోజుల క్రితం పుట్టింటి నుంచి కూతురు రామలక్ష్మిని తండ్రి శ్రీనివాసరావు అత్తవారింట్లో దించాడు. ఈ నెల 4వ తేదీన రామలక్ష్మి, ప్రదీప్‌ల పెళ్లిరోజు. అదే రోజు బిడ్డ రేవంత్ అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. ఈ రెండు వేడుకలను జంగారెడ్డిగూడెంలోనే జరుపుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం రామలక్ష్మి కుమారుడికి వ్యాక్సిన్ వేయించేందుకు కృష్ణాపురంలో పుట్టింటికి వచ్చింది. బుధవారం ఉదయం తండ్రి శ్రీనివాసరావు, తల్లి విజయ రేవంత్‌కు వ్యాక్సిన్ వేయించేందుకు బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని గమనించి చుట్టుపక్కల వారిని పిలిచారు. వారు తలుపులు పగలకొట్టి చూడగా రామలక్ష్మి కాలిపోయి మృతదేహంగా పడి ఉంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ బి.ఉదయ్‌భాస్కర్, ఏఎస్సై ఐ.భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. పోలవరం సీఐ రమేష్ బాబు రామలక్ష్మి కుటుంబ సభ్యులను, అటు అత్తమామలను ప్రశ్నించారు.
నా చావుకు ఎవరూ బాధ్యులు కారు
ఆత్మహత్యకు పాల్పడిన రామలక్ష్మి ఒక లెటర్ కూడా రాయడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె మృతి అనంతరం పరిసర ప్రాంతాన్ని పరిశీలించగా బీరువా సమీపంలో ఒక లెటర్ ఉందని దానిని పోలీసులకు ఇచ్చారు. దానిలో ‘నాన్న నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నువ్వు ఎవరినీ ఏమీ అనకు. నా చావుకు నేనే బాధ్యురాలిని. దయచేసి నా అత్తింటి వారికి ఎటువంటి సంబం«ధం లేదు. నేను చనిపోయిన విషయం ఎవరికీ చెప్పకు. ఇదే నా చివరి కోరిక’ అంటూ తనను ముద్దుగా పిలుచుకునే అమ్ములు పేరుమీద ఒక లెటర్‌ను రాసిపెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment