West godavari District
-
ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో దళిత యువకుణ్ణి అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించిన కేసులో డీజీపీతోపాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ అమానవీయమైన ఘటనపై ఆ ప్రాంతంతో లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. ఆ అధికారి నాలుగు వారాల్లోగా నిష్పాక్షికంగా విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది.వరద సమయంలో తమ కాలనీలో సమస్యపై పులిసాగర్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీంతో విద్యావంతుడైన ఆ దళిత యువకుడిని దారుణంగా వేధించి, పోలీస్ స్టేషన్ లాకప్‌లో అర్ధ్ధనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ల ముందు నిలబెట్టారు. చంపేస్తానని ఇన్స్పెక్టర్ బాజీలాల్ బెదిరించాడు. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీలు పిల్లి గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని, బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని పులి సాగర్‌కు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి కమిషన్ ఈ నోటీసులిచ్చిoది. పులి కృపానంద సాగర్ అనే దళిత యువకుడిపై అక్కడి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కులవివక్ష చూపించడంతోపాటు కస్టోడియల్ హింసకు గురి చేశారని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక బ్రెత్రెన్ చర్చి వద్ద నీరు నిలిచిపోయిందని ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు హింసించారని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించినందుకు ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఐ బాజీలాల్ అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి అవమానించడంతోపాటు అత్యంత అమానవీయంగా చొక్కా విప్పి కొట్టారని, కులం పేరుతో అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో తెలిపారు. లాకప్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ ఎదుట ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని గంటలపాటు నిలబెట్టారని తెలిపారు. ఆ తర్వాత అతన్ని ఒక బండరాయికి కట్టి గోదావరిలో పడేశారని పేర్కొన్నారు. ఈ దారుణ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఊచల మధ్య ఒక మహిళా పోలీసు దగ్గర నిలబడి ఉన్న దృశ్యాలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను కూడా ఆయన ఫిర్యాదుకు జత చేశారు. దీని ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీకి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఆన్లైన్లో నోటీసులిచ్చిoది. ఈ అమానవీయ ఘటనపై రాజమండ్రికి సంబంధం లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 4 వారాల్లోగా నిష్పాక్షికంగా నివేదిక తమకు పంపాలని స్పష్టం చేసింది. బాధితుడు లేవనెత్తిన సమస్యలు, పారిశుద్ధ్య లోపంపై జిల్లా కలెక్టర్ ఏం చర్య తీసుకున్నారో తెలపాలంటూ మరో నోటీసు ఇచ్చారు. -
ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లు.. పోలిస్ స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వీరబాత్తుల చంద్ర శేఖర్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్ట్‌తో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు , గ్రామస్తులు పోలీసులుతో సంప్రదింపులు జరిపారు. అయితే చంద్రశేఖర్ గురించి తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కోపోద్రికులైన గ్రామ ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఏడీబీ రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలతో దిగివచ్చిన పోలీసులు చంద్రశేఖర్ గురించి విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
తూర్పుగోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు
-
దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదు: కలెక్టర్ కార్తికేయమిశ్రా
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆశ్రమ్ ఆస్పత్రిలో ఘటనపై కమిటీ నిజనిర్ధారణ చేసిందని కలెక్టర్ కార్తికేయమిశ్రా అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. డయాబెటిక్ పేషెంట్ దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదన్నారు. ఆ సమయంలో విద్యుత్, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కోలుకున్నాక గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
ఉరి తాడుగా మారిన ఉయ్యాల
సాక్షి, అశ్వరావుపేట: అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ, తమ్ముడిని నవ్విస్తూ ఉన్న ఆ చిన్నారి.. తల్లి కాసేపు ఇంట్లోకి వెళ్లొచ్చేసరికే ఉయ్యాల చీర మెడకు చుట్టుకుని ఊపిరాడక మృత్యువాతకు గురైన విషాదకర సంఘటన అశ్వారావుపేటలో మంగళవారం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన రవికుమార్ కొంతకాలంగా అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో నివాసం ఉంటూ, స్థానిక యూనియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇతడికి భార్య నందిని, ఇద్దరు మగ సంతానం ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం తల్లి నందిని చిన్నారులకు అన్నం తినిపిస్తుండగా, అదే సమయంలో పెద్ద కుమారుడు సాహెత్ (6) చీరతో కట్టిన ఉయ్యాలతో ఆడుకుంటున్నాడు. మంచినీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్లిన సమయంలో ఆడుకుంటున్న సాహెత్ మెడకు చీర బిగుసుకుపోయి ఊపిరి ఆడలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చే సరికి కొన ఊపిరితో వేలాడుతున్న సాహెత్‌ను చూసి మెడకు బిగుసుకుపోయిన చీరను తొలగించి, స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అంతసేపు ఆడుకుంటున్న బిడ్డ అంతలోనే కన్నుమూశాడనే చేదు నిజాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ( చదవండి: ఉద్యోగం పోతుందనే భయంతో.. ) -
పెనుగొండ మరోసారి లాక్డౌన్
సాక్షి, పెనుగొండ (పశ్చిమగోదావరి జిల్లా): కోవిడ్–19 విజృంభణ అధికం కావటంతో అధికారులు, ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల్లో 20 మందికి పైగా కరోనా సోకడంతో ఉలిక్కిపడుతున్నారు. అదుపులోకి వచ్చిందనుకున్న పరిస్థితి తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 19న కంటైన్మెంట్ జోన్ ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఒకేసారి అధిక సంఖ్యలో కోవిడ్–19 కేసులు నమోదు కావడంతో పెనుగొండను మరోసారి లాక్డౌన్ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆచంట మండలంలోనూ కేసులు పెరగడంతో అధికారులు కట్టుదిట్టం చేయడం ప్రారంభించారు. పెనుగొండలో గురువారం రాత్రి 12 మందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హుటాహుటిన తాడేపల్లిగూడెం కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఆచంట మండలంలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వల్లూరులో నలుగురికి కరోనా సోకింది. అయోధ్యలంకలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. (విషాదం: కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో..) పెనుగొండలో కట్టుదిట్టం పెనుగొండలో మరోసారి కరోనా విలయతాండవం చేయడంతో లాక్‌డౌన్‌కు అధికారులు సన్నాహాలు చేశారు. ఇప్పటివరకూ ఉదయం 11 గంటల వరకూ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఒకేసారి 12 కేసులు నమోదు కావడంతో దుకాణాలు పూర్తిగా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లుపైకి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పెనుగొండలో ఆదివారం కర్ఫ్యూ స్థాయిలో కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రతి బుధవారం కర్ఫ్యూ విధించటానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఉదయం 10 గంటల వరకూ ఇళ్లకే పంపిస్తామని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం సీఐ పి.సునిల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, తహసీల్దారు వై.రవికుమార్, ఎంపీడీఓ కె.పురుషోత్తమరావు పెనుగొండ ప్రధాన విధుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. (కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..) -
దీక్ష దేనికోసమో పవన్ కల్యాణ్ చెప్పాలి
సాక్షి, దెందులూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతు దీక్ష దేనికోసం చేశారో అందరికీ తెలిసిందేనని, కేవలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి ఆయన తన అక్కసు వెళ్లగక్కుక్కునే వేదికగా రైతు సౌభాగ్య దీక్ష చేశారని, దీక్ష దేనికోసమో పవన్ కల్యాణ్ చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు సృష్టించటం ద్వారా తెరవెనుక ఒప్పందం చేసుకున్న రాజకీయ నాయకులకు సహాయ పడదామన్న అత్యాసతో ఉన్నట్లు పవన్ కల్యాణ్ తీరు కనబడుతోందన్నారు. రైతుల గురించి నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, జనహృదయ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయటంలో పవన్ కల్యాణ్ లక్ష్యం ఏమిటనేది నేరుగా ప్రకటించాలని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. పరిష్కారమైన సమస్యలపై ప్రశ్నలు వేస్తే ప్రజలకు జనసేన దేనికోసం పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం సమయంలో కాలువలు ఆధురికీకరణ చేయకపోయినా, గత ఐదేళ్లూ పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము టీడీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించకపోయినా ఎందుకు పన్నెత్తి మాట అనలేదన్నారు. ప్రజల్లో పరువు తీసుకోవద్దని పవన్ కల్యాణ్‌కు అబ్బయ్య చౌదరి హితవు పలికారు. -
భీమవరంలో ఎం.ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, భీమవరం: ఎం.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అలేఖ్య..కాలేజీ సమీపంలోనే ఫ్రెండ్స్‌తో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది. శని, ఆదివారాలు కళాశాలకు సెలవు కావడంతో స్నేహితులంతా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఉరేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. -
‘డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి’
సాక్షి, పాలకొల్లు: డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ కుమార్ రాజును సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకొల్లు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ వాహనాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో పూడికతీత పూర్తి చేయాలన్నారు. పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల విష జ్వరాల బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం అందేలా చేస్తామని తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ తదితరులు ఉన్నారు. -
ఆటో కారు ఢీ,ఇద్దరు మృతి
-
అప్ర‘మట్టం’
సాక్షి, నిడదవోలు/పోలవరం రూరల్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉప నదులు ప్రాణ హిత, ఇంద్రావతి పొంగిపొర్లుతున్నాయి. వీటికి కొండ కోనల్లో కురుస్తున్న వర్షం నీరు తోడవడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శనివారం అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ప్రవాహం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నదిలోకి ప్రస్తుతం సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం 36 అడుగుల నీటిమట్టం ఉండగా క్రమంగా పెరుగుతూ శనివారం సాయంత్రం 6 గంటలకు 42.20 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద రాత్రి 10 గం టలకు 42.70 అడుగుల నీటి మట్టం చేరింది. 43 అ డుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.60 గోదావరి నీటి మట్టం న మోదయ్యింది. గోదావరి విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 175 గేట్లను ఎత్తి 8,84,930 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ధవళేశ్వరం బ్యారేజీలో 70 గేట్లు, ర్యాలీ వద్ద 43 గేట్లు, మద్దూరు వద్ద 23 గేట్లు, విజ్జేశ్వరం వద్ద 39 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి వరద నీటికి సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని, రెండు రో జుల్లో సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేసే అవకాశం ఉందని ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహన్‌రావు తెలిపారు. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం వద్ద 10.50 మీటర్లు, పేరూరు వద్ద 13.50 మీటర్లు, దుమ్మగూడెం వద్ద 12.25 మీటర్లు, కుంట వద్ద 10.24 మీటర్లు, కొయిదా వద్ద 21.26 మీటర్లు, కూనవరం వద్ద 16.48 మీటర్లు, పోలవరం వద్ద 12.32 మీటర్లు, రాజమండ్రి బ్రిడ్జి వద్ద 15.82 మీటర్ల నీటి మట్టాలు నమోదయ్యాయి. డెల్టాలకు నీటి విడుదల క్రమబద్ధీకరణ.. ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు రైతుల వ్యవసాయ అవసరాల మేరకు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. జిల్లాల్లో వర్షాలు కురవడంతో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమ డెల్టాకు 6,000, మధ్య డెల్టాకు 1,700, తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఏలూరు కాలువకు 1,447, తణుకు కాలువకు 364, నరసాపురం కాలువకు 1,888, అత్తిలి కాలువకు 299 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయగా ఉండి కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. జలదిగ్బంధంలో నిర్వాసిత గ్రామాలు పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలోని 19 గ్రామాల నిర్వాసితులు జలది గ్బంధంలో చిక్కుకున్నారు. వీరు పోలవరం చేరుకునే పరిస్థితి లేదు. లాంచీల సదుపాయం కూడా లేదు. రోడ్డు మార్గం మొత్తం వరద నీరు చేరడంతో రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. వరద పూర్తిగా తగ్గితే తప్ప పోలవరం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. పోలవరం వద్ద 12.32 మీటర్ల నీటిమట్టానికి వరద చేరింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే పై నుంచి కూడా వరద నీరు దిగువకు చేరుతోంది. అన్ని చర్యలు చేపడుతున్నాం.. వరదలు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని పోలవరం తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి తెలిపారు. కొత్తూరు కాజ్వే వద్ద ఇంజిన్ పడవను ఏర్పాటు చేశామన్నారు. వరద తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వీఆర్వోలు ఆయా గ్రామాల్లో ఉన్నారని, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు. పాత పోలవరంలో భయం భయం.. గోదావరి వరద మరోసారి పెరుగుతుండటంతో పాత పోలవరం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం శివారు పాత పోలవరం ప్రాంతంలో నెక్లెస్‌బండ్ లంక గట్టు సుమారు 600 మీటర్ల వరకు కోతకు గురైంది. వరద ఉధృతికి ఇప్పటికే లంక గట్టు మొత్తం అండలు అండలుగా జారిపోయి నదిలో కలిసిపోయింది. 6 మీటర్లు వెడల్పు ఉండాల్సిన గట్టు క్రమేపీ కోతకు గురై మీటరు పరిణామంలోకి చేరింది. గట్టు జారిపోయిన ప్రదేశంలో నది వైపు ప్రాజెక్టు ప్రాంతం నుంచి బండరాళ్లను తెచ్చి వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 100 మీటర్లలోపు మాత్రమే ఈ రాయిని వేయడం జరిగింది. అయితే అసలు పూర్తిగా గట్టు కోతకు గురైన ప్రదేశంలో ఏ మాత్రం పట్టిష్ట పనులు జరగలేదు. మరలా వరదలు వస్తే ఆ ప్రాంతంలో గండిపడుతుందేమోననే ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వరద పెరుగుతున్నందున రాళ్లు వేసే పనులు కూడా నిలిపివేశారు. వరద పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయం పాతపోలవరం వాసులను వెంటాడుతోంది. -
అర్ధరాత్రి పీడీయస్ బియ్యం అక్రమ రవాణా
సాక్షి, నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పిడియస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు లిక్కర్ ఫ్యాక్టరీకి రేషన్ బియ్యం వస్తుందనే పక్కా ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పదహారు లారీల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. -
ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. వరద ముంపుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత తాడేపల్లి బయల్దేరి వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దమ్ము రేపుతున్న పవర్ టిల్లర్
పాలకొల్లు సెంట్రల్: జిల్లాలో సార్వా పంట దమ్ము పనులు జోరుగా సాగుతున్నాయి. అడపాదడపా వర్షాలు, కాల్వల నుంచి వదులుతున్న నీటితో డెల్టాలో పనులు జోరందుకున్నాయి. రైతులు దమ్ము పనులు వేగవంతం చేశారు. గతంలో నాగళ్లకు ఎడ్లను కట్టి దమ్ము పనులు చేసేవారు. ఆ తరువాత ట్రాక్టర్లు రావడంతో పని సులవైంది. అయితే ఇప్పుడు రైతులు పవర్ టిల్లర్‌తో దమ్ము పనులు చేస్తున్నాడు. వరి సాగు అనగానే దమ్ము పనులు ఎంతో కీలకం. గతంలో ఇంత ఆయకట్టుకు ఒక ట్రాక్టర్‌ను మాట్లాడుకుని దమ్ము పనులు చేసేవారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ట్రాక్టర్లు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు వెళ్లి సుమారు నెల రోజులు అక్కడే ఉండి పనులు చేసుకునేవారు. నేడు వ్యవసాయ శాఖ సబ్సిడీపై ఇచ్చే పవర్ టిల్లర్లతో రైతులు సొంతంగానే దమ్ము పనులు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పవర్ టిల్లర్ ప్రయోజనాలపై రైతులకు అవగాహన పెరగడంతో వాటి వైపు మొగ్గుచూపుతున్నారు. ఎకరాకు ఐదారు లీటర్ల ఆయిల్ ఖర్చు పవర్ టిల్లర్‌తో దమ్ము చేస్తే ఎకరాకు సుమారు ఐదు లేక ఆరు లీటర్లు ఆయిల్ ఖర్చవుతుంది. ఇలా రోజుకు దాదాపుగా ఐదారు ఎకరాల్లో దమ్ము చేయవచ్చని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రంతో దమ్ము చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ట్రాక్టర్లతో చేస్తే సుమారు రెండు అడుగులు లోతు వరకూ దిగిపోతుంది. దీనివల్ల పంట దిగుబడుల్లో ఇబ్భందులు ఎదురవుతున్నాయి. అదీ కాక ట్రాక్టర్లతో దమ్ము చేసే సమయంలో ఒక్కోసారి ట్రాక్టర్లు పైకి లేచిపోవడం తిరగబడడంతో ట్రాక్టర్ డ్రైవర్లుకు ప్రాణనష్టం జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పవర్‌టిల్లర్‌తో అలాంటి ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చు. మరో మనిషి అవసరం లేకుండా దమ్ము చేసుకునే వెసులుబాటు ఉంది. పొలం పనులకు కావలసిన సామగ్రిని దీనిపై తీసుకెళ్లిపోవచ్చు. ఈ పవర్టిల్లర్పై కూర్చుని చేయడానికి సీటు కూడా ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంటుంది. పవర్‌టిల్లర్‌తో ప్రయోజనాలు పవర్‌టిల్లర్‌తో దమ్ము 15 అంగుళాల లోతు వరకే జరగడంతో వరినాట్లు పైపైన వేయడానికి అనుకూలంగా ఉంటుంది. వరిపంట వేర్ల వ్యవస్థ ఆరు అంగుళాలు ఉంటుంది. పవర్‌టిల్లర్ దమ్ముతో వరి మొక్క వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు కూడా బాగా అందుతాయి. పవర్‌టిల్లర్ దమ్ము చేయడానికే కాకుండా బావులు, కాలువల నుండి పొలాలకు నీరు తోడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి పంకాలు ఏర్పాటుచేసి ధాన్యం ఎగరబోతకు ఉపయోగించుకోవచ్చు. 1.5 టన్నుల వరకూ బరువును తీసుకువెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పవర్‌టిల్లర్‌కు 13 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. -
కొల్లేరు ప్రక్షాళనకు రెడీ
ఏలూరు రూరల్ : టీడీపీ నేతల కబంధ హస్తాల నుంచి కొల్లేరు మరోసారి విముక్తి కానుంది. కొద్దిరోజుల్లో అటవీశాఖ అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టబోతున్నారు. ఇందుకోసం అభయారణ్యంలో 8,800 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ చెరువులు గుర్తించారు. ఉన్నతధికారులు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇన్చార్జి డీఎఫ్ఓ అనంత్‌శంకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ చెరువులను గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేల అనుచరుల పేదల పేరుతో అభయారణ్యంలో పెద్ద ఎత్తున అక్రమ చెరువులు తవ్వారు. చేపలు, రొయ్యల సాగు చేసే బినామీలకు లీజుకు కట్టబెట్టారు. ఐదేళ్లలో కోట్ల రూపాయలు దండుకున్నారు. అడ్డుచెప్పిన అటవీశాఖ అధికారులను దూషించారు. ప్రశ్నించిన అటవీశాఖ అధికారులను బదిలీ చేశారు. యథేచ్ఛగా సాగిన అక్రమాలతో టీడీపీ నాయకులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలంతా తమ అక్రమ సంపాదనకు గండి పడుతుందని భయపడుతున్నారు. 10 గ్రామాల పరిధిలో భారీగా అక్రమ చెరువులు కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఏలూరు, పెదపాడు, నిడమర్రు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని సుమారు 10 గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు వెలసినట్టు అ«టవీశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 4,403 ఎకరాలు అభయారణ్యంలో తవ్వగా మరో 4,396 ఎకరాల చెరువులు జిరాయితీ భూముల్లో తవ్వినట్టు అధికారులు గుర్తించారు. ఆక్రమణల ఇలా.. మొండికోడు డ్రెయిన్ పరిసరాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా పెద్ద ఎత్తున చెరువులు తవ్వారు. ఈ చెరువులను మాజీ సర్పంచ్‌లతో పాటు గ్రామ టీడీపీ నాయకులు వంతులు వేసుకుని చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏలూరు మండలం కలకుర్రు గ్రామంలో 100 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు తవ్వకాలు జరిగాయి. కొట్టేసిన వందలాది ఎకరాలు చేపల చెరువులు నేడు మళ్లీ పూర్వస్థితికి చేరుకున్నారు. కాంటూరు దిగువన కొల్లేరులో వెలసిన ఈ గ్రామానికి చుట్టుపక్కల ఒక్క సెంటు రెవెన్యూ భూమి లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున అక్రమ చెరువులు వెలిశాయి. జాలిపూడి, మాదవాపురం రెవెన్యూ ప్రాంతాల మధ్య గతంలో కొట్టేసిన 200 ఎకరాలల్లో సొసైటీ చెరువును టీడీపీ నాయకులు తవ్వారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మిన్నకుండిపోయారు. ఈ ప్రాంతానికి పొక్లెయిన్లు, బుల్డోజర్లు తరలించేందుకు ఇప్పటికే రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. గండ్లను పూడ్చేసి సాగు శ్రీపర్రు ఊరు వెనుక అభయారణ్యంలో గతంలో అధికారులు కొట్టేసిన చెరువుల గండ్లను కొందరు వ్యక్తులు పూడ్చేశారు. వందల ఎకరాల విస్త్రీర్ణంలో ఉన్న ఈ చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే చేపలు, రొయ్యలను టీడీపీ అనుయాయులు ఎగుమతి చేస్తున్నారు. జైపురం శివారున అభయారణ్య పరిధిలో 50 ఎకరాల విస్తీర్ణంలో పాత చెరువులకు గట్లు వేసి సాగు చేస్తున్నారు. ప్రత్తికోళ్లలంక, పెదయాగనమిల్లి, కోమటిలంక, కలకుర్రు, పైడిచింతపాడు తదితర గ్రామాల సమీపంలో సైతం కొల్లేరులో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువులు వెలిశాయి. ఈ చెరువులకు వేలం పాట నిర్వహించి టీడీపీ నాయకులు ఏటా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 8 వేల ఎకరాల్లో అక్రమ చెరువులు అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. కొల్లేరు పరిధిలో అక్రమ చెరువులపై నివేదికను తయారు చేశాం. వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు గుర్తించాం. గత మూడేళ్ల నుంచి వీటిలో చేపలు, రొయ్య ల సాగు జరుగుతోంది. సుమారు 8,000 వేలకు పైగా జిరాయితీ, అభయారణ్యంలో చెరువులు తవ్వినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – బి.రమణప్రసాద్, ఏలూరు రేంజర్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సాక్షి, ఉండి(పశ్చిమ గోదావరి) : కలసిపూడిలో గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆకివీడు మాదివాడ ప్రాం తానికి చెందిన బొల్లం సాంబమూర్తి (32) అనే వ్యక్తి భీమవరంలో ప్రైవేట్ హెల్త్‌కేర్ సెం టర్లో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. గురువారం డ్యూటీ ముగిసిన అనంతరం ఓ ఫం క్షన్కు హాజరై వేకువజామున సుమారుగా 2:45 నిముషాల సమయంలో కారులో భీమవరం నుంచి ఆకివీడు బయలుదేరాడు. మార్గమధ్యలో కలసిపూడి వద్ద కాలువ పక్కను ఉన్న చెట్లను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. సాంబమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతుని తండ్రి లింగతాతకు సమాచారం అందించడంతో వారు వచ్చి పోలీసుల సహాయంతో మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.సంతోష్‌కుమార్ చెప్పారు. -
ఆత్మస్థైర్యం ఆయుధం కావాలి
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఇందుకోసం అవసరమైన సహాయాన్ని, సహాకారాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర స్త్రీ,శిశు, వయోవృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా స్థానిక గిరిజనభవన్‌లో గురువారం విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను మంత్రి అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల పట్ల దయ చూపించాలని జాలి చూపిస్తే వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించి వారిలో ప్రతిభను వెలికి తీసి వారి భవిష్యత్ బాగుండేందుకు సమాజంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక ఆందోళనకు గురికాకూడదని పట్టుదల, కృషితో సకలాంగులతో సమానంగా అభివృద్ధి చెందేలా ఉండాలని కోరారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన విషయాలు తన దృష్టికి తీసుకురావాలని, కమ్యూనిటీ హాలు ఇతర మౌలిక వసతులు కలుగచేసే విషయంలో తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలి విభిన్న ప్రతిభావంతుల జేఏసీ చైర్మన్ అల్లాడి నటరాజు మాట్లాడుతూ వికలాంగుల హక్కుల రక్షణ చట్టం–2016ను అమలుచేయాలని, గ్రామ వలంటీర్ల నియామకంలో వికలాంగులకు అవకాశం ఇవ్వడంతో పాటు విద్యార్హత, వయోపరిమితుల్లో సడలింపు ఇవ్వాలని కోరారు. జిల్లాలో రెండో విడత మూడు చక్రాల మోటారు సైకిళ్లను త్వరితగతిన అందజేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్, వైసీపీ నాయకులు బండారు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కొంతమంది కోసమే పనిచేసిందని, ప్రస్తుతం అందరి ప్రభుత్వం వచ్చిందని సమస్య ఏదైనా, ఎవరిదైనా దాని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏలూరులో విభిన్న ప్రతిభావంతుల కోసం కమ్యూనిటీ హాలును నిర్మించాలని, అంధ నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం ఒకేషనల్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలని, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సదరం సర్టిఫికెట్ల జారీ చేసేటప్పుడు, మార్పులు, చేర్పులూ చేసే సమయంలో ఎక్కువ రోజులు పడుతోందని త్వరితగతిన సదరం సర్టిఫికెట్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతరం ఎన్జీఓలు, వివిధ సంఘాల నాయకులు మంత్రి తానేటి వనితను సన్మానించారు. విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు వీరభద్రరావు, ఉమ్మా వెంకటేశ్వరరావు, రఫీ, ఎస్ వాసు, ఆర్ రాము, వి.శ్రీను, మనోజ్ కుమార్, దుర్గయ్య, సునీత, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. 138 మందికి కృత్రిమ అవయవాలు జిల్లాలోని 138 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.7.40 లక్షల విలువైన కృత్రిమ అవయవాలను మంత్రి తానేటి వనిత అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వి.ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ఆర్థిక సంవత్సరం 2 వేల మందికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మేలు చేశామన్నారు. దాదాపు వెయ్యి మందికిపైగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. -
టీడీపీ నేతల గుండెల్లో భూకంపం
ఆక్రమించిన ప్రభుత్వ భూములను ఎలాగో అమ్మేశాం, ఇక మనల్ని అడిగేదెవరూ.. అని కొందరు టీడీపీ నేతలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. ఆ భూములను అమ్మిపెట్టిన దళారులైతే మన కమీషన్ మనకొచ్చేసింది.. మనల్ని అడిగేదెవరు అనుకున్నారు. అయితే ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపుపై కలెక్టర్ రేవు ముత్యాలరాజు పట్టుదలగా ఉండడంతో పచ్చ నేతల్లో గుబులు నెలకొంది. సాక్షి, ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి) : భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అనేక సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయి. టీడీపీ ప్రజాప్రతినిధులే రాబందుల్లా వాటిని కాజేశారు. వాటిలో ఒకటి ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీ. ఇక్కడ గత టీడీపీ ఎమ్మెల్యే పేరుతో జరిగిన భూవిక్రయాల బాగోతం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. గుండెల్లో ‘భూ’కంపం రేగినట్టు బాధను మింగలేక, బయటకు కక్కలేక సతమతమవుతున్నారు. జిల్లా యంత్రాంగం తాడేపల్లిగూడెంలోని దేవదాయ శాఖ భూముల్లో ఆక్రమణల తొలగింపు చేపడుతున్న నేపథ్యంలో ద్వారకాతిరుమల టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. అసలేం జరిగిందంటే.. ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీ వద్ద ఆర్ఎస్ నంబర్ 11, 1/2లోని ఎంతో విలువైన ప్రభుత్వ కొండ పోరంబోకు భూమిని టీడీపీ నేతలు కొందరు దళారుల చేత విక్రయించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు సంబంధించిందంటూ అప్పట్లో దాదాపు 26 సెంట్లు భూమిని కొందరు ధనికులకు, లక్షలాది రూపాయలకు అమ్మేశారు. ఈ భూబాగోతాలపై ‘సాక్షి’ గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో భూమిని విక్రయించిన టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇక కొనుగోలు చేసిన వారికైతే ముచ్చెమటలు పట్టాయి. ఈ క్రమంలోనే ‘సాక్షి’ కథనాలపై స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావును విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన గతేడాది సెప్టెంబరు 20న స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను, వివాదాస్పద భూమిని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. అలాగే భూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అప్పట్లో పార్టీ నేతలతో కలిసి, వివాదాస్పద ప్రభుత్వ భూమిని పేదలకు అందేలా చూడాలని ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. దీంతో విక్రయానికి గురైన భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ చక్రధరరావు తహసీల్దార్‌ను ఆదేశించారు. కానీ ఆదేశాలు భేఖాతరవడంతో కొనుగోలుదారులు ప్రభుత్వ భూమిలో బేస్ మెంట్లు వేసి, దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. ఈ భూబాగోతాలపై స్థానికులు కొందరు గత జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు దృష్టిపెట్టేనా! విక్రయాలకు గురైన ప్రభుత్వ భూమి పేదలకు చెందాలని పోరాడిన వైఎస్సార్ సీపీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో పాటు, జిల్లా అధికారులు భూ ఆక్రమణలపై దూకుడు పెంచడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తొమ్మిది నెలలుగా విచారణ పేరుతో మూలనపడి ఉన్న ఫైల్ బయటకు వస్తుందేమోనని బిక్కుబిక్కు మంటున్నారు. ఒకవేళ ఆక్రమణలను తొలగించే పరిస్థితే గనుక ఎదురైతే తమ పరిస్థితి ఏమిటా అని వారు తర్జనభర్జన పడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి, వాటిని నిరుపేదలకు అందించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
పోలీసులకు వీక్లీ ఆఫ్...
విధుల్లో నిత్యం విపరీతమైన ఒత్తిడి.. శారీరకంగానూ.. మానసికంగానూ క్షణం తీరికలేక నిరంతరం పనిభారంతోనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి.. కుటుంబంతో సరదాగా గడిపే కనీస హక్కూ లేకుండా ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించటంలోనే నిమగ్నం.. ఇదీ ప్రస్తుత పోలీసుల పరిస్థితి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్ర కీలకం.. వీరు విశ్రాంతి తీసుకుంటే అశాంతి చెలరేగే ప్రమాదం ఉన్నందున వీక్లీ ఆఫ్ వీరికి ఎండమావైంది. సాక్షి, ఏలూరు టౌన్: ఆకస్మికంగా ఏ సమస్య వస్తుందో.. ఏ సమయంలో ఎక్కడ గొడవలు జరుగుతాయో తెలియదు. వీఐపీలకు ప్రొటోకాల్, శాంతిభద్రతల పరిరిక్షణ పని ఒత్తిడి. ఎక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుందో తెలియదు. ఏ అధికారి చీవాట్లు పెడతారో, ఏ ప్రజాప్రతినిధి మండిపడతారో అని నిత్యం టెన్షన్.. టెన్షన్.. ఈ ఒక్క కారణంతోనే ఇప్పటివరకూ పోలీసులు వీక్లీ ఆఫ్‌కు దూరంగా ఉన్నారు. నిరంతరం రక్షణ బాధ్యతలు మోస్తూ నీరసించిపోతున్నారు. వారానికి ఒక్కరోజు సెలవు కరువై అల్లాడుతున్నారు. అందుకే ఏళ్ల తరబడి వారాంతపు సెలవు కోసం పోలీసులు పోరాడుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రభుత్వాలు వీరి గురించి ఆలోచించిన దాఖాలాలు లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు వీక్లి ఆఫ్ ఇచ్చే అంశంపై దృష్టిసారించారు. దీనిపై కమిటీని నియమించారు. ఫలితంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పక్కాగా ప్రణాళికలు సాధారణంగా ఎన్నికలప్పుడు నాయకులు రావటం ఎన్నో హామీలు గుప్పించటం.. అధికార పీఠంపై కూర్చోగానే అవన్నీ మర్చిపోవడం మామూలే. కానీ తాను ఇచ్చిన హామీలను పక్కాగా నూరు శాతం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామంటూ హమీ ఇచ్చిన ఆయన ప్రభుత్వం ఏర్పాటుకాగానే ఆ హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. 24 గంటలూ పని ఒత్తిడితో కుటుంబాలకు దూరంగా ఉంటూ పోలీసులు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించారు. వీక్లీ ఆఫ్ అమలుకు ఎదురయ్యే సమస్యలు, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకూ అందరికీ స్థానం కల్పించారు. ఉదాహరణకు పరిస్థితి ఇలా : ⇔ ఏలూరు నగరంలో పరిస్థితి చూస్తే ఏలూరు జనాభా సుమారు 3.20 లక్షలు. మూడు పట్టణ పోలీస్స్టేషన్లతోపాటు, సీపీఎస్, మహిళా, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ⇔ 1టౌన్ పోలీస్ స్టేషన్లో 55మంది, 2టౌన్ పోలీస్ స్టేషన్లో 60మంది, 3టౌన్ పోలీస్ స్టేషన్లో 26మంది, ⇔ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 20మంది, మహిళా పోలీస్ స్టేషన్లో 28మంది, రూరల్ పోలీస్ స్టేషన్లో 30మంది, ⇔ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 36మంది, ఎస్సీ, ఎస్టీ విభాగంలో 8మంది, పీసీఆర్ విభాగంలో 15మంది పోలీసులు పనిచేస్తున్నారు. ఈ స్టేషన్లు, విభాగాల పరిధిలో మొత్తం సుమారుగా 278మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు సమాచారం. కానీ వీరిలో 80మందికి పైగా సిబ్బంది పోలీస్ శాఖలోని ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏలూరు నగరంలో కనీసం 350మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, సిబ్బంది కొరత ఉంది. ఇప్పుడు వీక్లి ఆఫ్‌లు అమలు చేస్తే అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీనిపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. వీక్లీఆఫ్ హర్షణీయం పోలీసు శాఖలో పోలీసులకు వారాంతపు విరామం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవటం హర్షణీయం. వీక్లీ ఆఫ్ అమలుపై రాష్ట్రస్థాయిలోనూ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. వీక్లీ ఆఫ్ అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. వీక్లీ ఆఫ్ ఇవ్వడంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా.. వాటిని ఏవిధంగా అధిగమించాలనే అంశాలపై చర్చిస్తున్నారు. కానీ పోలీసులు ఒత్తిడిని జయించాలంటే ఖచ్చితంగా విశ్రాంతి అవసరం. – ఆర్.నాగేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశలు ఫలిస్తున్నాయి పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లకు కృతజ్ఞతలు. వీక్లీ ఆఫ్ అమలు కార్యరూపానికి వస్తుండడం శుభపరిణామం. ఎన్నో ఏళ్ళుగా నెరవేరని పోలీసుల ఆశ ఫలిస్తుంది. పోలీసులు వారి కుటుంబాలతో ఒకరోజైనా సంతోషంగా గడిపే అవకాశం రావటం సంతోషం. జిల్లాలోనూ త్వరలోనే ఎస్పీ నవదీప్‌సింగ్ పర్యవేక్షణలో పక్కాగా అమలు అవుతుందనే నమ్మకం ఉంది. – కె.నాగరాజు, పోలీసు అధికారుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు పక్కాగా అమలు చేస్తాం పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను పక్కాగా అమలు చేస్తాం. డీజీజీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం మంగళవారం ఉంది. ఈ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తూ ఒకరోజైనా విశ్రాంతి దొరికేలా చర్యలు చేపడతాం. – నవదీప్‌సింగ్ గ్రేవల్, ఎస్పీ -
ఆంధ్ర అబ్బాయి..శ్రీలంక అమ్మాయి..చూపులు కలిసిన వేళ!
సాక్షి, కొవ్వూరు రూరల్: మనం పుట్టినపుడే మనతో ఎవరు ఏడడుగులు వేస్తారో అనేది దేవుడు రాసి పెడతాడని పెద్దలు చెబుతారు. ఈ సంఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో దేశం. ఉపాధి కోసం మరో దేశానికి వెళ్లిన వారి మనసులు కలిశాయి. రెండున్నరేళ్ల ప్రేమ తరువాత పెళ్లితో ఒక్కటవుదామనుకున్న వారికి జిల్లాలోని కొవ్వూరులో బసివిరెడ్డి పేటలో ఉన్న సత్యన్నారాయణ స్వామి దేవాలయం వేదికగా మారింది. ఆదివారం బంధువుల సమక్షంలో వారు సంప్రదాయం బద్ధంగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన మావుడూరి ఉమామహేష్ ఉపాధి కోసం మస్కట్ వెళ్లాడు. ఓ హోటల్లో సూపర్వైజర్గా చేరారు, అదే హోటల్లో ఉద్యోగంలో చేరిన శ్రీలంకకు చెందిన రువీని హెమలీని మొదటిసారి చూసినపుడే ప్రేమలో పడ్డారు. ఈ విధంగా రెండున్నరేళ్లపాటు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. రువీని హెమలీకి తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ విషయాన్ని ఉమామహేష్ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలియజేసి ఒప్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు లేని లోటు అత్తమామల ద్వారా తీరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. నూతన వధూవరులకు మంత్రి వనిత దీవెనలు నూతన వధూవరులు ఉమామహేష్, రువిని హేమలీకి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి మండపంలో వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత కుల, మతాల పట్టింపులనే∙కాదు దేశ సరిహద్దులను తమ ప్రేమతో చెరిపేస్తున్నారని అన్నారు, నూతన వధూవరుల దాంపత్య జీవితం సుఖఃశాంతులతో సాగాలని అభిలషించారు. కంఠమణి రమేష్‌బాబు, పరిమి సోమరాజు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
దళితులకు సీఎం జగన్ పెద్దపీట
సాక్షి, పెదవేగి రూరల్: దేశం అంతా రాష్ట్రం వైపు తొంగి చూసే విధంగా దళితులకు సీఎం పెద్ద పీట వేశారని వైసీపీ నియోజకవర్గ ఎస్సీసెల్ ఇన్చార్జ్ మెండెం ఆనంద్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లో దళితజాతి ముద్దుబిడ్డ, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం దుగ్గిరాల తన నివాసంలో గ్రామ ఎస్సీసెల్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజకీయ చరిత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చరిత్ర సృష్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విప్లవం సృష్టిస్తూ నవయుగానికి నాంది పలికారని, ఎస్సీలకు రాజకీయంగా అత్యున్నత గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం, అంతేకాకుండా ఏకంగా ఐదు మంత్రి పదవులను కేటాయించడం ద్వారా ఎస్సీ వర్గాలకు తాను ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో చేతల్లోనే చూపించారని తెలిపారు. సమావేశంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు దాసరి తంబి, పెదవర్తి చిన్న, పులవర్తి యాకోబు, సంజీవరావు, కొత్తపల్లి బాబి, తలారి దాసు, మెండెం జోసఫ్ పాల్గొన్నారు. -
దెందులూరు: పార్టీలో ఉండాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలా?
సాక్షి, దెందులూరు: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావస్తున్నా ఆ పార్టీ శ్రేణులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయం నమోదు కావటం నియోజకవర్గంలో ఏ ఒక్క పంచాయతీలోనూ టీడీపీ అలికిడి కానరావటం లేదు. ఫలితాల్లో సైతం ప్రతి పంచాయతీలోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యతతో పాటు విజయ కేతనం ఎగురవేయటంతో భవిష్యత్తు కార్యక్రమంపై టీడీపీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. తాము ఇప్పుడేం చేయాలో తెలియక పగలు, రాత్రి తేడాలేకుండా చర్చలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. మరికొందరైతే ఏం చేస్తే బాగుంటుంది? పార్టీలో ఉండాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలా? మౌనంగా ఉండటమా? పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందా? ప్రత్యామ్నాయం చూసుకుంటే వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు రాజకీయంగానైనా పరిస్థితి మారుతుందని సమీకరణాల రూపంలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అన్ని శాఖల వారీగా ఫిర్యాదులు, నాణ్యత, నిధులు దుర్వినియోగం, ఇతర అంశాలు విచారణ విధిగా జరుగుతుందని ప్రకటించటంతో నియోజకవర్గంలో అన్ని శాఖల వారీగా కాంట్రాక్టులు, అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేసినవారు అవాక్కయ్యారు. దెందులూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు, పోలవరం కుడికాలువ గట్లు కొల్లగొట్టడం, మట్టి అక్రమ రవాణా, నాణ్యతలేని రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, ఉపాధి ఇతర పనులపై వేల కోట్లలో అవినీతి జరిగిందని గతేడాదే వైఎస్సార్సీపీ నేతలు అప్పటి జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. దీనికి తోడు ఐదేళ్లలో పెట్టిన అక్రమ కేసులు, వేధింపులు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో వివక్షతతో పాటు ప్రస్తుతం వైఎస్సార్సీపీ పూర్తి ఆధిక్యత సాధించటంతో వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ విషయాన్ని చర్చించటానికి సైతం టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి కనిపించటం లేదు. కలవరపాటులో టీడీపీ నేతలు ఒక్కో పంచాయతీకి లక్షలు ఖర్చు పెట్టగల స్తోమత, వెసులుబాటు టీడీపీ నేతలకు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి మించి ఉండటంతో వారంతా తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ అన్ని స్థాయిల్లోనూ విజయం సాధించటం స్పష్టమని తేటతెల్లం కావటంతో ఇంత వ్యతిరేకతలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సముద్రానికి ఎదురీదటమేనని టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అన్ని చోట్ల టీడీపీ అపజయానికి కారణాలు వేరు వేరు అయినప్పటికీ దెందులూరు నియోజకవర్గంలో సొంతింటిలోనే అసమ్మతి, అసంతృప్తి, పార్టీ ధిక్కారం తారాస్థాయికి చేరటంతో 17 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీ పరాజయం పాలైంది. ఇన్ని మైనస్‌లు పార్టీలో ఉండటం వైఎస్సార్సీపీ భారీ మెజారిటీకి కారణం. కొందరి చూపు వైఎస్సార్సీపీ వైపు మళ్లింది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు ఇన్ని ప్రతికూల పరిస్థితులు టీడీపీలో ఉంటే ఎలా పోటీ చేస్తాం, చేయటం కరక్టేనా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ విజయ బావుటా!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ శరవేగంగా దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ జోరుకు టీడీపీ కొట్టుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు, ఈవీఎంల లెక్కింపులో మొదటి దశలో విజయం దిశగా పయనిస్తోంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, కడప, విజయనగరం, వైజాగ్ తదితర జిల్లాల్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బోణీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం, పాలకొల్లు చింతలపూడి తదితర 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం తదితర 10 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయ బావుటా ఎగురవేసేందుకు సన్నద్ధమవుతోంది. -
బుజ్జి నామినేషన్‌కు రండి.. 1000 పట్టుకెళ్లండి
సాక్షి, ఏలూరు : ఏలూరు అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి నామినేషన్ కార్యక్రమానికి రండి రూ.1000 పట్టుకెళ్లండి అంటూ కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగరంలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ పిలుస్తున్నారు, వెళ్లకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందకుండా చేస్తారేమోనని వెళ్తున్న మహిళలకు కార్పొరేటర్లు ఈ ఆఫర్లు ఇస్తున్నారు. బుజ్జి నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వస్తే కార్పొరేటర్లు రూ.500, బుజ్జి మరో రూ.500 ఇస్తారని చెబుతున్నారు. అలాగే బుజ్జిని రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత డ్వాక్రా మహిళలపై ఉందని, ఇప్పటివరకూ వారికి ప్రభుత్వం నుంచి వివిధ విధాలుగా అందిన రుణాలు, రుణమాఫీ వంటివన్నీ బుజ్జి చలువే అన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల్లో బుజ్జికి ఓటు వేసేందుకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారని(ఎంత ఇస్తారో ప్రకటించడం లేదు) చెబుతున్నారు. బుజ్జి అత్యధిక మెజార్టీతో గెలిస్తే ప్రతి డ్వాక్రా మహిళకూ ఖరీదైన చీర బహూకరిస్తారని ప్రలోభ పెట్టారని ఈయా సమావేశాలకు హాజరైన మహిళల్లో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. -
గిరమ్మ ఆత్మఘోష
సాక్షి, ద్వారకాతిరుమల : గిరమ్మ ఎత్తిపోతల పథకం ఆత్మ ఘోషిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు చుక్క నీరందించలేకపోయానని ఆవేదన చెందుతోంది. ఆ పాపం పాలకులదేనని గిరమ్మ చెప్పలేకపోయినా, బాధిత రైతులు మాత్రం గొంతెత్తి చాటుతున్నారు. పాలకుల నిర్లక్ష్యమే పథకానికి శాపమని అంటున్నారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలోని గిరమ్మ చెరువు నీటిని ఎత్తిపోతల ద్వారా 7 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2003 నవంబర్ 12న అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంకుస్థాపన చేసింది చంద్రబాబే అయినా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పంప్ హౌస్, పైప్‌లైన్, కాలువ నిర్మాణ పనులన్నీ జరిగాయి. 2010 ఆగస్టులో పథకానికి ట్రైల్ రన్ కూడా వేశారు. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో పథకం పనులు అటకెక్కాయి. ఇదిలా ఉంటే కాలువ నిర్మాణానికి భూములు ఇవ్వమంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకంపై నిర్లక్ష్యం వహించడంతో దాదాపు రూ.8 కోట్లు ఖర్చుతో చేసిన పనులు నిరుపయోగంగా మారాయి. ఇదిలా ఉంటే కోర్టును ఆశ్రయించిన రైతులు ఇటీవల భూములివ్వడంతో కాలువ తవ్వకం పనులు పూర్తిచేసిన అధికారులు ట్రైల్‌రన్ కూడా వేశారు. అయితే ఈస్టు యడవల్లి–దొరసానిపాడు గ్రామాల మధ్య సుమారు 3 కిలోమీటర్లు మేర కాలువకు బదులు నిర్మించిన అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ నీటి ఒత్తిడి తట్టుకోలేక, ధ్వంసం కావడంతో పథకం మళ్లీ మూలకు చేరింది. 7 వేల ఎకరాలకు.. ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న దాదాపు 7 వేల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందించవచ్చు. ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లి, మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, దొరసానిపాడు, కామవరపుకోట మండలంలోని ఈస్టు యడవల్లి, వెంకటాపురం, తాడిచర్ల తదితర ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే పథకం శంకుస్థాపన జరిగి 15 ఏళ్లు గడిచినా వినియోగంలోకి రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పథకం : గిరమ్మ ఎత్తిపోతల పథకం ప్రాంతం : సీహెచ్ పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం శంకుస్థాపన : 2003 నవంబర్ 12 వ్యయం : రూ.8 కోట్లు సాగు లక్ష్యం : 7 వేల ఎకరాలు పూడుకుపోతున్న కాలువ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు 2003లో టీడీపీ హయాంలో ప్రారంభమైన గిరమ్మ ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు రైతులకు అక్కరకు రాలేదు. పథకాన్ని దాదాపుగా పూర్తిచేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కింది. కొద్దిపాటి పనులు పూర్తిచేస్తే పథకం పూర్తవుతుంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నేతలు దీనిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. ఇటీవల ద్వారకాతిరుమల మండలంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో గిరమ్మ పథకం గురించి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించాం – యాచమనేని నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్, సీహెచ్ పోతేపల్లి కాలువలు పూడుకుపోతున్నాయ్ గిరమ్మ ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్విన కాలువలు పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. మరికొంత మేర పూడుకుపోయి కాలువ వెడల్పు తగ్గిపోయాయి. ఇంకా ఆలస్యమైతే కాలువ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 2003లో పథకానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ప్రస్తుతం అధికారంలో ఉన్నా దీనిపై దృష్టి సారించలేదు. కాలువలు, పంప్‌హౌస్ యంత్రాలు నిరుపయోగంగా మారాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. – బసివిరెడ్డి వెంకటరామయ్య, రైతు -
అలా... ‘పేరు’ గాంచారు
సాక్షి, కొవ్వూరు : జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన నేతలకు, పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులుగా చలామణిలో ఉన్న వారికి అసలు పేరు కంటే నిక్ నేమ్స్, ముద్దుపేర్లే బాగా ప్రాచూర్యం పొందాయి. నాని.. బాబు.. బుజ్జి వంటి పేర్లు కలిగిన నాయకులు ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్నారు. కొందరు పొడవాటి పేర్లు కలిగిన నాయకులను చిన్నపేర్లు పెట్టి పిలవడం పరిపాటి. ఇలా ఆ పేర్లే ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. కొందరికైతే అసలు పేరు కంటే ముద్దుపేర్లు చెబితే గాని తెలియని పరిస్ధితి ఉంది. ఏలూరుకి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పూర్తి పేరు కాళీకృష్ణ శ్రీనివాస్. అయినా జిల్లా వాసులకు ఆయన నానిగానే సుపరిచితులు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు వెంకటేశ్వరరావు. జిల్లా నాయకులతోపాటు రాష్ట్ర పార్టీ నాయకులంతా ఆయన్ను బాబుగానే పిలుస్తుంటారు. పూర్తి పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు. నాని అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉంది. మాజీ రాజ్యసభ సభ్యుడు యర్రా నారాయణస్వామి జిల్లావాసులకు సుపరితులు. ఆయన్ను బెనర్జీగా పిలుస్తుంటారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆచంట వైఎస్సాఆర్ సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగరాజు పూర్తిపేరు శ్రీరంగనాథరాజు. సన్నిహితులు రంగరాజుగా పిలుస్తుంటారు. ఉండి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును ఎక్కువ మంది అబ్బాయిరాజుగా పిలుస్తుంటారు. వైఎస్సార్ సీపీ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును ఈ ప్రాంత వాసులు కృష్ణబాబుగా పిలుస్తుంటారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన పూర్తి పేరు మాత్రం గెడ్డం సూర్యారావు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును సన్నిహితులంతా రామంగా పిలుస్తుంటారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజును సన్నిహితులు మీసాల బాపిరాజుగా పిలుస్తారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు. ఉంగుటూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వుప్పాల శ్రీనివాసరావుని వాసుబాబుగా పిలుస్తారు. జిల్లా వాసులందరికీ వాసుబాబుగానే సుపరిచితులు. -
ఎన్నికలకు సర్వసన్నద్ధం
సాక్షి, ఏలూరు : సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉం దని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాగూర్ అన్ని జిల్లాల పోలీసు అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్ని కల నిర్వహణ సిబ్బంది నియామకాలు, ఏర్పాట్లపై పోలీసు అధికారుల నుంచి డీజీపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటివరకూ రూ.1.50 కోట్ల నగదు, 30.134 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. 1,761 మద్యం బాటిల్స్, 33 లీటర్ల సారా, 206 కిలోల నల్ల బెల్లం పట్టుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 2,007 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు 25 లైసెన్స్‌లు లేని ఆయుధాలను, 366 లైసెన్స్ ఉన్న ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దుల్లో 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను ని యమించామన్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణా ళికతో పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అన్ని భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కడైనా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. -
టీడీపీలో సీటు.. మస్తు హీటు
సాక్షి , ఏలూరు : జిల్లాలో 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మిగిలిన నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్రమైన టెన్షన్ నెలకొంది. నరసాపురంలో మాధవనాయుడు, ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులును తొలుత ఖరారు చేశారు. అయితే చివరి నిమిషంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు కోసం ఆ సీట్లు ఆపడం వివాదంగా మారింది. పోలవరం, నిడదవోలులో అసమ్మతి తలనొప్పిలతో నిలిపివేశారు. నరసాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు ముందు ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టిక్కెట్ తనకే వస్తుందని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి మంత్రాంగం ఫలించిందన్న వాదన వినిపిస్తోంది. దీంతో మాధవనాయుడు వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే సీటు ఖరారు అయ్యిందన్న భావనతో ప్రచారం మొదలుపెట్టిన మాధవనాయుడికి సీటు పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్ మొదలైంది. శుక్రవారం మాధవనాయుడు కుటుంబం అంతా ప్రచారంలో పాల్గొంది. ఉంగుటూరు సీటు గన్ని వీరాంజనేయులకే ఖరారు అయ్యిందని, అయితే బాపిరాజును బుజ్జగించేందుకు, ఈ సీటు ఇస్తారన్న ఆశ కల్పించేందుకు మొదటిలిస్ట్లో ఈ పేరు ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సీటు ప్రకటించకపోవడంతో గన్ని వర్గం ఆందోళన చెందుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి మరోవైపు చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు సీటు ఇవ్వకపోవడంపై ఆ వర్గం మండిపడుతోంది. కష్టపడి పనిచేసిన పీతల సుజాతకు అన్యాయం జరిగిందంటూ ఏలూరు క్యాంప్ ఆఫీస్‌లో సుజాత వర్గం నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీటు ఆశించి భంగపడిన సొంగ రోషన్‌కుమార్ కూడా హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రమే చంద్రబాబునాయుడు వారిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి చేశారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, తొందరపడవద్దని పీతల సుజాత నచ్చచెప్పినట్లు సమాచారం. ఇప్పటికే సీటు ఖరారు అయిన భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంజిబాబు గెలిచిన తర్వాత పార్టీ సీనియర్లను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయని, మళ్లీ ఆయనకే సీటు ఇవ్వడంతో పలువురు పార్టీని వీడేందుకు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు పీతల సుజాతకు సీటు రాకపోవడం వల్ల ఆ ప్రభావం భీమవరంపై పడే అవకాశం కనపడుతోంది. పీతలది వీరవాసరం మండలం కావడం, సుజాతను ఒక సామాజికవర్గం నేతలు కుల రాజకీయాలతో ఇబ్బంది పెట్టారన్న భావనతో ఇక్కడి దళితులు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు సీటు వస్తుందన్న ఆశతో బీజేపీ నుంచి జనసేనలోకి చేరిన మొడియం శ్రీనివాస్ మళ్లీ తిరుగుటపాలో బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్లపాటు భారతీయ జనతాపార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్‌గా పనిచేసిన మొడియం శ్రీనివాసరావు సీటు ఇస్తామన్న హామీతో జనసేనలో చేరారు. అయితే అక్కడ డబ్బులు ఎంత ఖర్చు పెడతారంటూ డిమాండ్లు పెట్టడంతో వెనక్కి వచ్చేశారు. ఇప్పటికే జిల్లాలో జనసేనకు యర్రా నవీన్ రాజీనామా చేయగా పలువురు నేతలు జనసేనను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
టీడీపీ పాలనలోనే హత్యా రాజకీయాలు
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : టీడీపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పెచ్చుమీరుతాయని, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు పెరిగిపోయాయని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన నేపథ్యంలో స్థానిక కార్యాలయంలో పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాజకీయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేని ప్రత్యర్థులు ఈ విధంగా హత్యకు పాల్పడ్డారని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప ప్రజల మానప్రాణాలకు రక్షణ ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మంచెం మైబాబు, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నాయకులు గుడిదేశి శ్రీనివాస్, బాలిన ధనలక్ష్మి, మున్నుల జాన్‌గురునాధ్, కిలాడి దుర్గారావు, మోటమర్రి సదానందకుమార్, ప్రముఖ న్యాయవాదులు కృష్ణారెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, ఎస్ఎంఆర్ పెదబాబు, కోలా భాస్కరరావు, నూకపెయ్యి సుధీర్‌బాబు తదితరులున్నారు. -
ఓటు నమోదుకు ఇక నాలుగు రోజులే...
సాక్షి, ఏలూరు : ఓటు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా నాలుగురోజులు మాత్రమే గడువు ఉంది. పరిశీలనకు పది రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నెల 15 వరకూ మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంటే సరిపోదు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ సర్వేలు చేసి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో అందరూ తమ ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓటు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు ఓటర్ ఐడీ కార్డు మీద ఎపిక్ నంబర్‌ను 1950కు ఎస్ఎంఎస్ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుంది. ఓటు లేని వాళ్లు ఆన్లైన్లో ఫామ్–6 నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం తహసీల్దార్ ఆఫీసులో గానీ, బూత్‌లెవల్ అధికారిని గానీ సంప్రదించాలి. అధికార పార్టీ దురాగతాలను ఎదుర్కొవాలంటే ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో ఓటును అందరూ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫారం–7 ద్వారా జిల్లాలో 38,145 బోగస్ దరఖాస్తులు దాఖలు కాగా, వాటిని పరిశీలించి ఇప్పటికే 32 కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా ఇకపై ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటును కూడా తొలగించే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 9 వేల ఓట్లు రెండు ప్రాంతాల్లో నమోదైనట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 1,700 ఓట్లను తొలగించామని తెలిపారు. మండల కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ ఎన్నికల సమయానికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఓటు దరఖాస్తు కోసం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో వాటిని నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఓటు హక్కు నమోదు చేసుకునేలా ఓటర్ హెల్ప్‌లైన్ పోర్టల్ యాప్‌ను ఎన్నికల సంఘం రూపొందించింది. ఈ పోర్టల్‌లో మన దరఖాస్తు ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అధికారులు దరఖాస్తులు పరిశీలించి ఆమోదిస్తే ఓటరు గుర్తింపు కార్డును సర్వీస్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానంతో కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు ఇచ్చే అవసరం పూర్తిగా తీరనుంది. ఓటు నమోదుకు ప్రత్యేకంగా ఫారమ్–6ను నింపి ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. ఫారమ్–6 ప్రతి ఈ సేవా కేంద్రాల్లో, తహసీల్దార్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగంలోనూ లభిస్తుంది. ఆన్లైన్లో www.coeandhra.nic.in, www.nvsp.in అనే వెబ్సైట్ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
కొలిక్కిరాని కుస్తీ...
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : తెలుగుదేశం పార్టీలో సీట్ల ఎంపిక ఇంకా కొనసా..గుతూనే ఉంది. చింతలపూడి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం సీట్లకు సంబంధించి వివాదాల కారణంగా అభ్యర్థుల ఎంపిక ముందుకు సాగడం లేదు. సమన్వయ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి సంబం ధించి మూడు, నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించినా ఏకాభిప్రాయం రాలేదు. సోమవారం కూడా నిడదవోలు, కొవ్వూరు నాయకులను అమరావతి పిలిపించి సమన్వయ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. అయితే అక్కడ ఏకాభిప్రాయం రాలేదు. సగంమంది కొవ్వూరులో మంత్రి జవహర్‌కు ఇవ్వడానికి ససేమిరా అనగా మిగిలిన వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం. అదే సందర్భంలో నిడదవోలుపై కూడా పీటముడి వీడలేదు. ఒక వర్గం కుందుల సత్యనారాయణకు సీటు ఇవ్వాలని కోరగా, మరికొంతమంది శేషారావుకు మద్దతు పలికారు. దీంతో ఈ అంశాన్ని మరో రెండురోజులు వాయిదా వేశారు. ఘంటా మురళి చేరికను పురస్కరించుకుని చింతలపూడి నేతలు కూడా తమ నాయకుడి దృష్టిలో పడేందుకు అమరావతి వెళ్లారు. స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయని విషయం తెలిసిందే. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న స్థానాలు, సీట్లు కేటాయించిన స్థానాల విషయంలో ముఖ్యమంత్రి అసంతృప్తులను బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. వాటిలో భాగంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి నేతలందరితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. అసంతృప్తులు ఉన్న చోట్ల ఆయా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అనుకూల, వ్యతిరేక వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఎక్కడెక్కడ అసమ్మతి రగులుకుంటుందో ఆయా అసమ్మతి నేతలతో మాట్లాడి నామినేషన్లకు ముందుగానే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడం, మార్పులు చేర్పులు చేయడం లాంటి అంశాలపై చంద్రబాబు కుస్తీ పడుతున్నారు. అయితే ఇరువర్గాలు తగ్గకపోవడంతో మళ్లీ నిడదవోలు, కొవ్వూరుపై రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పంపించారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఈలి నానికి టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. సీటు ఆశించిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఈ అసమ్మతి సద్దుమణిగేలా చేసేందుకు బాపిరాజుకు ఉంగుటూరు సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మంత్రి జవహర్‌కు మళ్లీ చుక్కెదురు కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ఖరారు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్‌కి మరోసారి చుక్కెదురైంది. సోమవారం నియోజకవర్గ నాయకులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అభ్యర్థి ఎంపిక అంశాన్ని మరో రెండు రోజులు పాటు వాయిదా వేశారు. జవహర్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారుపై అధిష్టానం సుముఖంగా లేనట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు సాగదీత ధోరణి అవలంభిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. జవహర్‌కి టిక్కెట్టు కేటాయిస్తే తాము సహకరించబోమని వ్యతిరేక వర్గీయులు పార్టీ అధినేత చంద్రబాబు ముందు తెగేసి చెబుతున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో మరో రెండు రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు మంత్రి జవహర్‌కి దాదాపుగా ఈసారి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుండడంతో ఇక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరుపక్షాల నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తనకు గానీ తన కుమార్తె దివ్యరాణికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. రిటైర్డు ఉద్యోగులు రాపాక సుబ్బారావు, అయినపర్తి రాజేంద్రప్రసాద్, పెనుమాక జయరాజుతో పాటు వేమగిరి వెంకటరావు, బచ్చు శ్రీనుబాబు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. -
‘ఓటు’ దూరం..!
ఏలూరు రూరల్: ఎన్నికల అధికారులు టీడీపీ నేతల గుప్పెట్లో బందీలయ్యారు. వారు చెప్పింది, చెప్పినట్టుగా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, ఎస్సీ వర్గానికి చెందిన వారి ఓట్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరపు పోలింగ్‌బూత్‌ల పరిధిలో చేర్చుతున్నారు. ఫలితంగా పోలింగ్ బూత్ దూరమైతే అంతదూరం వెళ్లి ఓటు వేయరనే కుయుక్తితోనే ఇలా చేస్తున్నారనే వాదన వ్యక్తమవుతోంది. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ బూరాయిగూడెంకు చెందిన కాకి రత్నప్రత్యూష ఇటీవల ఓటు కోసం ఆన్లైన్లో దరకాస్తు చేసుకున్నారు. ఈమెకు వెంకటాపురం పంచాయతీ సుంకరవారిగూడెం చిరునామాతో ఓటు మంజూరైంది. ఆన్లైన్లో పరిశీలించుకున్న ప్రత్యూష మరోసారి చిరునామా మార్పునకు దరఖాస్తు చేశారు. ఈసారి ఏకంగా తంగెళ్లమూడి పంచాయతీ బీడీకాలనీని చిరునామాగా పేర్కొంటూ అధికారులు ఓటు మంజూరు చేశారు. దీనిపై అనుమానం వచ్చి పలువురు బూరాయిగూడెం వాసులు ఓటర్ల జాబితా పరిశీలించగా, చాలా చిరునామాలు తారుమారైనట్టు గుర్తించారు. మరిన్ని ఆధారాలు ఇవిగో.. గత 30 ఏళ్ళుగా బూరాయిగూడెంలో నివాసం ఉంటూ ఓటు వేస్తున్న కొట్టె అవ్వమ్మ ఓటు ఈ సారి ఏలూరు నగరం సెయింట్ గ్జెవియర్ స్కూల్ బూత్‌కు బదిలీ అయ్యింది. - వాసే వెంకటేశ్వరరావు ఓటు సైతం తారుమారైంది. - నాలుగు నెలల క్రితం దాకారపు మాణెమ్మ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. వీటిపై వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులు, స్థానిక యువకులు విచారణ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. టీడీపీ నేతల ఇళ్ల వద్దే పరిశీలన వాస్తవానికి ప్రజలు ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల అధికారి ద్వారా ఏరియా సూపర్వైజర్కు అది చేరుతుంది. సూపర్వైజర్తో పాటు బూత్‌లెవెల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుడు చిరునామా నిర్ధారించుకుని ఓటు మంజూరుకు ఉన్నతధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ క్షేత్రస్దాయి పరిశీలనకు వెళుతున్న సూపర్వైజర్లు, బీఎల్ఓలు స్థానిక టీడీపీ నాయకుల ఇళ్లకు చేరుకుంటున్నారు. వారికి దరఖాస్తుదారుడు వివరాలు చెబుతున్నారు. దీన్ని గ్రహించిన టీడీపీ నేతలు దరఖాస్తుదారుడు తమ పార్టీకి వ్యతిరేకమా, అనూకూలమా గుర్తించి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. దీన్ని తీసుకుంటున్న ఎన్నికల అ«ధికారులు అదే సమాచారం ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. ఇలా టీడీపీ నాయకులు తమకు వ్యతిరేకమైన ఓటర్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరాన ఉన్న బూత్‌లకు బదిలి అయ్యేలా కుట్రలు చేస్తున్నారు. ఫలితంగా ఓటరు విసిగి చెంది ఓటు వేయకుండా ఉంటాడని భావిస్తున్నారు. మరోపక్క మండలంలో కొందరు ఎన్నికల అధికారులు ఫారం–6లను తీసుకుని పంచాయతీ, వీఆర్వో కార్యాలయాల వద్ద కూర్చుని దరఖాస్తుదారుడుకు ఫోన్ చేసి నిర్ధారించుకుంటున్నారు. దరఖాస్తుదారుడు ఫోన్‌కు స్పందించకపోతే అధికారులు తమ ఇస్టానుసారం మార్చేస్తున్నారు. ఫలితంగా మండలంలో వెంకటాపురం, తంగెళ్లమూడి, శనివారపుపేట తదితర గ్రామాల్లో ఓటర్ల చిరునామాలు పెద్ద సంఖ్యలో తారుమారయ్యాయి. మూడుసార్లు చిరునామా మార్చుకున్నా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏ «అధికారీ మా ఇంటికి వచ్చి పరిశీలన చేయలేదు. నా వివరాలు సేకరించలేదు. మరి నాకు ఓటు ఎలా మంజూరు చేశారో తెలియడం లేదు. ఓటర్ ఐడీలో చిరునామా మార్పు కోసం ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాను. మొదటసారి సుంకరవారిగూడెం అడ్రస్‌తో ఓటు వచ్చింది. తర్వాత బీడీకాలనీలో వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో నా ఓటు పరిశీలిస్తే రెండు చిరునామాల్లో ఓటు ఉన్నట్టుగా కనిపిస్తోంది. నేను ఓటు ఎక్కడ వేయాలి. – కాకి రత్నప్రత్యూష, బూరాయిగూడెం నేను ఉంటున్న చోటే ఓటు కావాలి కొన్నేళ్ళుగా నేను, నా భర్త బూరాయిగూడెంలో ఉంటున్నాం. ఎంతోకాలంగా సాయినగర్ బూత్ నెంబర్ 184లో ఓటు వేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మా ఓట్లు ఏలూరు సెయింట్ గ్జేవియర్లో బూత్‌నెంబర్ 48లో ఉన్నట్లు చూపుతున్నారు. ఓటు కోసం అంతదూరం ఎలా వెళ్లగలం. ఉన్న చోటే మాకు ఓటు కావాలి. దరఖాస్తు చేసుకోవడం మాకు తెలియదు. ఏం చేయాలి. – వాసా ఏడుకొండలు, స్థానికురాలు -
‘బాబు’ మార్కు రాజకీయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యవహారశైలి ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అసమ్మతులను ప్రోత్సహిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అభ్యర్ధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చింతలపూడిలో పీతల సుజాతకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రోత్సహించి వారిని అమరావతి సీఎం వద్దకు పంపి సీటు రాకుండా చక్రం తిప్పుతున్నారు. మరోవైపు పోలవరం అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్న వారిని తనవద్దకు పిలిపించుకుని మరీ వినతిపత్రాలు తీసుకుంటున్నారు. నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా మాగంటి బాబు వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారు. అసలు తనకు సీటు వస్తుందో లేదో తెలియకుండానే తమ నియోజకవర్గాల్లో చెయ్యి పెడుతున్నాడంటూ వారు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మొదటి నుంచి ఆ నియోజకవర్గంలో తన మాటే నెగ్గాలనే వైఖరితో నాలుగున్నరేళ్లపాటు ఏఎంసీ ఛైర్మన్‌ను నియమించకుండా మాగంటి బాబు అడ్డం పడ్డారు. ఆ నియోజకవర్గంలో అసమ్మతిని పెంచి పోషించారు. దీనికి పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ ఛైర్మన్ కూడా ఆజ్యం పోశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుజాతకు టిక్కెట్ ఇస్తే ఎంపీ వర్గం ఆమెకు వ్యతిరేకంగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం సీఎం చంద్రబాబు కు కూడా స్పష్టం చేశారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వకుండా మాగంటి బాబు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌తో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని అతని వ్యతిరేక వర్గానికి బాబు అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆ నియోజకవర్గంలోని అసమ్మతి వర్గానికి అపాయింట్మెంట్ ఇచ్చి పెద్ద ఎత్తున కార్లలో ఏలూరు, అక్కడి నుంచి అమరావతి తరలించారు. మొదటి నుంచి తమ సామాజికవర్గం పెత్తనమే సాగాలనే వైఖరితో రిజర్వు నియోజకవర్గాల్లో పెత్తనం కోసం ప్రయత్నాలు చేశారు. అక్కడ తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ముందు పెట్టి అసమ్మతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నూజివీడులో తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా అక్కడ కూడా రెండు వర్గాలను ఎంపీ ప్రోత్సహిస్తూ వచ్చారు. గత ఎన్నికల నుంచి రంగంలో ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును కాదని అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన అట్లూరి రమేష్‌తో పాటు ఇతరులను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో మాగంటి బాబు వైఖరితో విసిగిపోయిన వీరంతా తమకు మాగంటి బాబు మరోసారి ఎంపీగా వద్దంటూ తెలుగుదేశం ముఖ్య నేతలకు మొరపెట్టుకుంటున్నారు. అలిగిన బాపిరాజు .. నేడు కార్యకర్తలతో సమావేశం తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం టికెట్‌ను అధిష్ఠానం ఈలి నానికి కేటాయించింది. నానీని గెలిపించే బాధ్యతను జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుపై ఉంచింది. చివరి వరకు సీటు కోసం ఆశించి భంగపడ్డ బాపిరాజు సీఎం వైఖరిపై గుర్రుగా ఉన్నారు. సీఎంను టికెట్ కోసం కలిసేందుకు బాపిరాజు, ఈలి నాని, బొలిశెట్టి శ్రీనివాసులు బుధవారం అమరావతి బయలుదేరి వెళ్లారు. సీఎంతో ఒక్కొక్కరిగా మాట్లాడిన అనంతరం సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో టికెట్‌ను నానీకి ఇస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం. బాపిరాజుకు సీటిస్తే హార్ట్‌ఫుల్‌గా చేస్తానని బొలిశెట్టి హామీ ఇచ్చినట్టు, బొలిశెట్టికి సీటిచ్చినా తాను గెలుపునకు కృషి చేస్తానని బాపిరాజు సీఎం పంచాయితీలో హామీలు ఇచ్చినా కూడా బాబు నానీ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపడంతో బాపిరాజు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. అయినా ఈలి నానీని గెలిపించే బాధ్యత నీదేనని సీఎం చంద్రబాబు బాపిరాజుకు చెప్పినట్లు తెలిసింది. దీంతో బాపిరాజు అలక బూనారని తెలుస్తోంది. గురువారం సాయంత్రం సమావేశం తాడేపల్లిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ చైర్మన్ క్యాంపు కార్యాలయం వద్ద బాపిరాజు అభిమానులు, పార్టీ క్యాడర్ శుక్రవారం సమావేశం కానున్నారు. బాపిరాజు కూడా సమావేశానికి హాజరై అధిష్ఠానం చేసిన అన్యాయాన్ని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు వివరించనున్నారని సమాచారం. టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బాపిరాజును బరిలోకి దింపాలనే యోచనలో ఆయన వర్గం ఉంది. -
పశ్చిమ గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతిధాం 102 రుషీగోత్ర స్తంభ మందిరంలో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా జరిగింది. జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు దంపతులు అమ్మవారి విగ్రహావిష్కరణ చేసి తొలి అభిషేకం చేశారు. వాసవీ శాంతి ధాంలో 700 రోజుల పాటు శ్రమించి 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు 42 టన్నుల రాగి, 20 టన్నుల జింకు, 1.3 టన్నుల తగరం, 600 కేజీల వెండి, 40 కేజీల బంగారం కలిపి 65 టన్నుల విగ్రహాన్ని తయారు చేశారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11 నుంచి హోమ క్రతువులు, నిత్య కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం 102 ఆర్యవైశ్యుల గోత్రీకులకు చిహ్నంగా 102 స్తంభాల రుషీగోత్ర మందిరాన్ని ప్రారంభించారు. అరుదైన మరకత శిలతో చెక్కించిన 3 అడుగుల మరకత శిలా విగ్రహాన్ని ప్రతిష్టించి అభిషేకాలు నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలి వచ్చారు. -
మూటగట్టుకున్నారు..పరిహారాన్నీ!
పెదవేగి రూరల్: మద్దతు ధర లేక విలవిల్లాడిన రైతుకు దక్కాల్సిన పరిహారాన్ని అక్రమార్కులు మెక్కేశారు. రూ.కోట్లు పక్కదారి పట్టించారు. అధికారులు వంతపాడడంతో చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ఒక్కరూపాయి పరిహారం అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన మొక్కజొన్న ధర వ్యత్యాస పథకం అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పెదవేగి, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఇతర మండలాల్లో ఈ సాగు ఎక్కువగా జరుగుతోంది. ఆయా మండలాల్లో సాగుద్వారా 30,80,870 క్వింటాళ్లు మొక్కజొన్న ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సాగులో నాలుగోవంతు జిల్లాలోనే జరుగుతోంది. ఇతర పంటల్లో ఎదురవుతున్న ఒడిదుడుకుల నేపథ్యంలో రైతులు ఈ సాగుపై మక్కువ చూపడంతో ఒక్కసారిగా సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడీ బాగా వచ్చింది. 37లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. అసలేం జరిగిందంటే.. గతేడాది రబీ సీజన్లో అంచనాలకు మించి రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఫలితంగా ఉత్పత్తి భారీగా వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ ధర లభించింది. క్వింటాకు ప్రభుత్వం రూ. 1,425గా ప్రకటించినా గతేడాది రైతులకు దక్కింది మాత్రం రూ.1,000 నుంచి రూ.1100 మాత్రమే. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం రైతుల కోరిక మేరకు ధర వ్యత్యాస పథకం ద్వారా క్వింటాకు రూ.200 వంతున సొమ్ము మంజూరు చేసింది. ఈ విధంగా జిల్లాలోని రైతులకు రూ.61.61 కోట్లు మంజూరయ్యాయి. దీనిని అక్రమార్కులు అవకాశంగా మలుచుకున్నారు. పరిహారం పంపిణీలో జోక్యం చేసుకున్నారు. మొక్కజొన్న సాగు చేయని వారూ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అధికారులు వంతపాడటంతో అనర్హుల ఖాతాల్లోకి సొమ్ములు చేరాయి. అర్హులకు అన్యాయం జరిగింది. బయటపడింది ఇలా.. పెదవేగి మండలంలోని కొప్పాక, అంకన్నగూడెం, పెదకడిమి, అమ్మపాలెం పరిధిలో రైతులకు రూ. కోటి 36 లక్షల 49 వేలు మంజూరు కాగా అందులో 50 శాతం అనర్హులే సొమ్ము చేసుకున్నారు. అసలు సాగు చేసిన వారికి పరిహారం రాకపోగా ఇతర పంటలు వేసి పక్క రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ కావడంతో కడుపుమండిన పలువురు రైతులు మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సొమ్ము పక్కదారి పట్టిన పెదకడిమి గ్రామంలో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవాలు తెలుసుకున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే అక్రమాలు జరిగినట్టు సమాచారం. అనర్హులకు ఇచ్చేశారు గతేడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా ధర లేకపోవడంతో వ్యత్యాస పథకంలో డబ్బులు ఇస్తున్నారంటే అందరితోపాటు కాగితాలను వ్యవసాయశాఖ సిబ్బందికి ఇచ్చాను. ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున రావాల్సి ఉండగా, నాకు డబ్బు రానివ్వకుండా అనర్హులైన ఆయిల్‌పామ్, జామ పంటలు సాగు చేసిన రైతులకు డబ్బు రావడం దారుణం. – బాల నాగవరప్రసాద్, రైతు, పెదకడిమి అన్యాయంగా దోచేశారు ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.200 చెల్లిస్తామని ప్రకటించింది. గ్రామ నాయకులు, అగ్రికల్చర్ అధికారులు 60–70 పేర్లు అన్యాయంగా తిసేశారు. మొత్తం సొమ్మును గ్రామంలో కొందరు నాయకులు తినేశారు. ఆయిల్‌పామ్, జామ పంట పేరుతో మాకు 5 ఎకరాల పొలం ఉంటే.. మేం దరఖాస్తు చేయకపోయినా.. మా పొలాల సర్వేనంబర్లతో గ్రామానికి చెందిన మండవ ప్రసాద్, చళ్ళగొళ్ల గోపాలస్వామి మాకు తెలియకుండా సొమ్ము తీసుకున్నారు. – పర్వతనేని నాగయ్య, రైతు, పెదకడిమి -
బాబు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. బినామీలతో అక్రమ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అవినీతి సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుని పోతుందని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్‌తోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అవినీతి కంపని విమర్శించారు. రూ.13వేల కోట్లు చెరువల్లో మట్టి తవ్వటానికి ఖర్చు పేరిట దోపిడీ చేశారని ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి అయిన ఖర్చు రూ.6500 కోట్లుగానే చూపుతున్నారని అన్నారు. సీవీపీతో విచారణ జరిగితే కొందరు మంత్రులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. -
మహిళ ప్రాణాన్ని బలిగొన్న ఎలక్ట్రికల్ హీటర్
ద్వారకాతిరుమల: ఎలక్ట్రికల్ హీటర్‌తో వేడినీటిని కాస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని సీహెచ్.పోతేపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తుపాకుల వెంకటలక్ష్మి (39), భర్త వెంకన్నబాబు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇదిలా ఉంటే వెంకటలక్ష్మి రోజులానే ఇంట్లో ఎలక్ట్రికల్ హీటర్‌తో ఒక స్టీలు బిందెలో నీటిని కాస్తోంది. అయితే ప్రమాదవశాత్తు ఆమె కాలు బిందెకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానిక వైద్యులతో పరీక్ష చేయించగా, ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని భీమడోలు సీఐ బి.నాగేశ్వర్‌నాయక్, దెందులూరు ఎస్సై శంకర్లు పరిశీలించారు. దీనిపై కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : తంగెళ్ళమూడి పంట కాలువ సమీపంలో పేకాట యథేచ్చగా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 29060 నగదుతో పాటు 3 సెల్ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. డీఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్సై రామారావు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
బుట్టాయగూడెం: ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కృష్ణాపురంలో బుధవారం చోటు చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియకరాకపోవడంతో స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుట్టాయగూడెం మండలం కృష్ణాపురానికి చెందిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు, విజయ దంపతుల కుమార్తె రామలక్ష్మికి రెండేళ్ల క్రితం జంగారెడ్డిగూడేనికి చెందిన ఓలేటి ప్రదీప్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి రేవంత్ అనే ఆరు నెలల బాబు ఉన్నాడు. 15 రోజుల క్రితం పుట్టింటి నుంచి కూతురు రామలక్ష్మిని తండ్రి శ్రీనివాసరావు అత్తవారింట్లో దించాడు. ఈ నెల 4వ తేదీన రామలక్ష్మి, ప్రదీప్‌ల పెళ్లిరోజు. అదే రోజు బిడ్డ రేవంత్ అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. ఈ రెండు వేడుకలను జంగారెడ్డిగూడెంలోనే జరుపుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం రామలక్ష్మి కుమారుడికి వ్యాక్సిన్ వేయించేందుకు కృష్ణాపురంలో పుట్టింటికి వచ్చింది. బుధవారం ఉదయం తండ్రి శ్రీనివాసరావు, తల్లి విజయ రేవంత్‌కు వ్యాక్సిన్ వేయించేందుకు బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని గమనించి చుట్టుపక్కల వారిని పిలిచారు. వారు తలుపులు పగలకొట్టి చూడగా రామలక్ష్మి కాలిపోయి మృతదేహంగా పడి ఉంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ బి.ఉదయ్‌భాస్కర్, ఏఎస్సై ఐ.భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. పోలవరం సీఐ రమేష్ బాబు రామలక్ష్మి కుటుంబ సభ్యులను, అటు అత్తమామలను ప్రశ్నించారు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు ఆత్మహత్యకు పాల్పడిన రామలక్ష్మి ఒక లెటర్ కూడా రాయడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె మృతి అనంతరం పరిసర ప్రాంతాన్ని పరిశీలించగా బీరువా సమీపంలో ఒక లెటర్ ఉందని దానిని పోలీసులకు ఇచ్చారు. దానిలో ‘నాన్న నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నువ్వు ఎవరినీ ఏమీ అనకు. నా చావుకు నేనే బాధ్యురాలిని. దయచేసి నా అత్తింటి వారికి ఎటువంటి సంబం«ధం లేదు. నేను చనిపోయిన విషయం ఎవరికీ చెప్పకు. ఇదే నా చివరి కోరిక’ అంటూ తనను ముద్దుగా పిలుచుకునే అమ్ములు పేరుమీద ఒక లెటర్‌ను రాసిపెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
రెప్పపాటులో మాయం
తణుకు: సార్.. నేను షాపింగ్‌మాల్‌కు వెళ్లి వచ్చేసరికి నా బైక్ మాయమైంది.. పార్కింగ్ ప్రాంతంలో ఉంచిన మోటారుసైకిల్ లోనికి వెళ్లి వచ్చేంతలోనే కనపడకుండా పోయింది.. బ్యాంకులోకి అలా వెళ్లి వచ్చేసరికి ఎవరో నా మోటారుసైకిల్ ఎత్తుకెళ్లారు.. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఆయా పోలీస్స్టేషన్లలో పెరిగిపోయాయి. తణుకు సర్కిల్ పరిధి లో నెలకు 10 నుంచి 15 మోటారు సైకిళ్లు చోరీకు గురవుతున్నట్టు అంచనా. పోలీసు సిబ్బంది సైతం వాహనాల చోరీ ఉదంతాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. దీం తో మోటారుసైకిళ్లు చోరీ చేసే అగంతకులు రెచ్చిపోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో వాహనాలను అగంతకులు దొంగిలించుకుపోతున్నారు. అసలేమవుతున్నాయ్..? తణుకు సర్కిల్ పరిధిలో అపహరణకు గురవుతున్న వాహనాల్లో 30 శాతం వ రకు పోలీసులు రికవరీ చేస్తున్నారు. మో టారు సైకిళ్లను అపహరించే వ్యక్తులు వా టిని లభించిన ధరకు తెగనమ్మేస్తున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలు స్తోంది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలను పట్టణంలోని కొందరు సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేస్తున్న వారు కొనుగోలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి జిల్లాలు దాటిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని వాహనాలను పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తులు కొనుగోలు చేసి ఆయా భాగాలను విడదీసి మరమ్మతులు చేసే షాపుల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. పార్కింగ్ ప్రదేశాల్లో రక్షణ ఏదీ..? కార్యాలయాలకు, షాపింగ్‌కు వచ్చే వినియోగదారులే తమ వాహనాలపై నిఘా ఉంచాల్సిన పరిస్థితి. పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో రుసుం తీసుకుని వాహనాలకు భద్రత కల్పిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో అం టే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక మా ర్కెట్, హోటళ్లు వంటి ప్రాంతాల్లో ఇలాం టి ఏర్పాట్లు లేవు. ముఖ్యంగా కల్యాణ మండపాలు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ఇక్కడ మోటారుసైకిళ్లు తరచూ చోరీకు గురవుతున్నాయి. అపార్టుమెం ట్లలో కార్యాలయాల నుంచి రూ.వేలు ని ర్వహణ ఖర్చులను వసూలు చేస్తున్నారు. అయినా కాపలా సిబ్బందిని మాత్రం అన్నిచోట్ల నియమించడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన వాహనాలు చోరీకు గురికావడం, వాటి యాజమానులు పో లీసులకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యా పారాలు చేసే కొన్ని మద్యం దుకాణాలు, బార్లు ముందు వాహనాల రక్షణకు సిబ్బందిని నియమించకపోవడంతో తర చూ వాహనాల చోరీ ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. చాలా సందర్భాల్లో కేసులు నమోదు చేయడానికి నిరాకరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇలా చేయాలి.. అనివార్య పరిస్థితుల్లో ఆరుబయట, రోడ్ల వెంబడి, వ్యాపార ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనానికి అందించే తాళాలు కొన్నాళ్లకు అరిగిపోతాయి. ఆటో మొబైల్ షాపుల్లో రూ.150 నుంచి రూ.300 వెచ్చిస్తే వెనుక చక్రానికి తాళం వేయడానికి వీలుగా ప్రత్యేక తాళం ఇస్తారని, వీటిని వేస్తే కొంత మేర భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఇళ్ల బయట పార్కింగ్ చేసేవారు కిటికీలకు గట్టి ఇనుప గొలుసుతో వాహనానికి లాక్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. వాహనాలకు బీమా ఉండటం వల్ల ఫిర్యాదు చేసిన మూడు నెలల వరకు వాహనం దొరక్కపోతే ఆయా సం స్థల నుంచి బీమాను పొందవచ్చని, ఇందుకు సంబంధిత పోలీసుస్టేషన్ల నుంచి చివరి నివేదిక తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా ఉంచాం ఇటీవల కాలంలో మోటారుసైకిళ్లు చోరీకు గురవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాం. వాహనదారులు సైతం వాహనంతోపాటు వచ్చే తాళంతోపాటు మరొకటి కూ డా బైకులకు తప్పకుండా వేసుకో వాలి. అపార్టుమెంట్ నిర్వాహకులు విధిగా కాపలా సిబ్బందిని నియమించుకోవాలి. వాహనదారులు సైతం స్వయంగా ప్రత్యేక నిఘా ఉంచుకోవాలి. – కేఏ స్వామి, సీఐ తణుకు -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదాద్రి భువనగిరి : భువనగిరి రైల్వేస్టేషన్లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంట పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమికులు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లికి చెందిన ధనుంజయ్(20), కోమలి(17)గా గుర్తించారు. ప్రేమికులిద్దరూ సోమవారం రాత్రి పశ్చిమగోదావరి నుంచి హైదరాబాద్ వెళ్లే రైలులో వచ్చినట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు భువనగిరిలో దిగారు. అనంతరం వాళ్ల బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో బంధువులు బీబీనగర్ మండలం రాఘవాపురంలో తెలిసిన వాళ్లకు ఫోన్ చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రేమికులు పురుగుల మందు తాగారు. స్పృహలో ఉండటంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ధనుంజయ్ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోళ్లమేత వేద్దామని వెళ్లి కానరాని లోకాలకు..
పశ్చిమగోదావరి, పోడూరు: కోళ్లకు మేత వేద్దామని వెళ్లిన వ్యక్తి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పెనుమదం శివారు తెలు గుపాలెంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో అదే ప్రాంతానికి చెందిన కవురు నాగరాజు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు కుటుంబసభ్యులతో కలిసి గ్రా మంలోని ఓ తాటాకింట్లో నివాసముంటున్నాడు. ఇటీవల ఈ ఇల్లు పాడవడంతో సమీపంలోని మరో ఇంట్లోకి మారాడు. పాత ఇంటి వద్ద కోళ్లు మేపుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జోరుగా వర్షం కురుస్తుండగా కోళ్లకు మేత వేసేందుకు పాత ఇంటికి వెళ్లాడు. ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు కింద నిలబడి ఉండగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. భారీ శబ్దంతో పిడుగు పడటంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన కొబ్బరిచెట్టు మా ను సగభాగం నుంచి కిందకు నాలుగు అంగుళాల లోతున చీరుకుపోయింది. ఇప్పుడే వస్తానని వెళ్లి.. నాగరాజు కోళ్లకు మేత వేయడానికి వెళ్లే ముందు అదే ప్రాంతంలో ఉంటున్న తల్లి నాగరత్నం ఇంటికి వెళ్లాడు. నాగరాజు బయటకు వెళుతుండగా టీ తాగి వెళుదువు.. కొద్దిసేపు ఆగమని తల్లి చెప్పినా వినకుండా ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లాడు. తనమాట విని ఆగిఉంటే ప్రమా దం తప్పేదని తల్లి నాగరత్నం బోరుమంది. విషాదఛాయలు ఊహించని రీతిలో పిడుగుపాటుకు నాగరాజు బలికావడంతో తెలుగుపాలెంలో విషాదం నెలకొంది. నాగరాజుది పేద కుటుంబం. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మి, 11, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతదేహం వద్ద భార్య, తల్లి, కుమార్తెల రోదనలు మిన్నంటాయి. తహసీల్దార్ కె.శ్రీరమ ణి, ఎస్సై కె.రామకృష్ణ సంఘటనా స్థలా నికి వచ్చి నాగరాజు మృతి చెందిన తీ రును పరిశీలించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహానికి పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తప్పిన పెనుప్రమాదం తెలుగుపాలెంలో రామాలయం వద్ద ఇటీవల దేవీ నవరాత్రుల వేడుకలు ముగిశాయి. మృతుడు నాగరాజు పాత ఇల్లు రామాలయం ఎదురుగానే ఉంది. బుధవారం ఉదయం ఇక్కడ టెంట్లు, కుర్చీలు, బల్లలు తొలగిస్తున్నారు. పిడుగుపడిన కొబ్బరిచెట్టు కిందే కొన్ని బల్లలు ఉన్నాయి. అయితే పిడుగు పడటానికి కొద్ది నిమిషాల ముందే ఆరుగురు కూలీలు అక్కడున్న బల్లలను, కుర్చీలను వ్యానులో ఎక్కించి తరలించారు. కూలీలు అక్కడే ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. -
పాఠశాలలకు బాసుల్లేరు
పశ్చిమగోదావరి, నిడదవోలురూరల్ : విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ఉన్నత విద్యకు గ్రహణం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో సుమారు రెండు నెలలపాటు పాఠశాలల్లో సక్రమంగా బోధన జరగలేదు. టీచర్లంతా బదిలీలపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లింది. చివరకు ఎన్నో అవాంతరాల మధ్య ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను నియమించకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలో 356 జెడ్పీ, 16 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 19 పాఠశాలలకు రెగ్యులర్ హెచ్ఎంలు లేరు. మరో 21 పాఠశాలకు ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులను నియమిస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు ఇచ్చినా అవి ఇంకా అమలు కాలేదు. కొత్త డీఎస్సీలో సుమారు 240 స్కూలు అసిస్టెంట్ నియమకాలు చేపట్టాల్సి ఉంది. ఈ పరిణామాలు ఆయా పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. సీనియర్ ఉపాధ్యాయులే బాస్‌లు ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. పది ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలంటే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు సక్రమంగా ఉండాలి. కానీ కొన్ని పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ సబ్జెక్టుల సీనియర్ టీచర్లను పాఠశాలకు ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులుగా నియమించడంతో పూర్తిస్థాయిలో బోధన సాగడం లేదు. దీంతో ఉపాధ్యాయులు జోడు పదవులపై స్వారీ చేస్తూ దేనికీ సరైన న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. కొరవడిన పర్యవేక్షణ ఉపాధ్యాయుల పనితీరు, బోధనను పర్యవేక్షిస్తూ వారికి వేతనాల చెల్లింపులు, సెలవుల మంజూరు, మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు, కాంప్లెక్స్ సమావేశాలు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలు.. తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాల్సి ఉంది. రెగ్యులర్ హెచ్ఎంలు లేకపోవడంతో ప్రతి నెలా సుమారు 450 మంది ఉపాధ్యాయులు వేతనాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. గత విద్యా సంవత్సరంలో కూడా ఈ సమస్య వేధించడంతో పది ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 12వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలకు రెగ్యూలర్ హెచ్ఎం లేకపోవడంతో పది పరీక్షలకు 97 మంది విద్యార్థులు హాజరు కాగా 17 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆప్‌గ్రేడ్ పాఠశాలల్లోనూ సమస్యలు జిల్లాలోని 13 ప్రాథమికోన్నత పాఠశాలలను దశలవారీగా ఉన్నత పాఠశాలలుగా ఆప్‌గ్రేడ్ చేశారు. అయితే ఈ పాఠశాలల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో టీసీలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు బాధ్యతలతో అవస్థలు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అదనంగా హెచ్ఎం బాధ్యతలు అప్పగించడంతో పాలనాపరంగా అవస్థలు తప్పడం లేదు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు బోధించలేని దుస్థితి నెలకొంది. సీనియర్ ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహణపై దృష్టి పెట్టడంతో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నారు. పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలంటే హెచ్ఎం ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. –పి.జయకర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, నిడదవోలు -
రాట్నాలమ్మ సన్నిధిలో సింధు
పశ్చిమగోదావరి , పెదవేగి రూరల్: రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మను బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సింధుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థాన చైర్మన్ రాయల విజయభాస్కరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సింధును సత్కరించారు. అనంతరం సింధు మాట్లాడుతూ రాట్నాలమ్మ దయ వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్ సుబ్రహ్మణ్యం, పి.వి.సింధు తండ్రి రమణ, ఆమె కుటుంబ సభ్యులు, కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కన్నతండ్రే కాలయముడై..
పెరవలి : మద్యం మత్తులో ఘర్షణ పడి కన్న కొడుకునే తండ్రి హతమార్చిన ఘటన పెరవలి మండలం అన్నవరప్పాడు సెంటర్లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. అన్నవరప్పాడు గ్రామానికి చెం దిన వసంతాడ కాశీ, చంద్రయ్య (35) తండ్రీకొడుకులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అన్నవరప్పాడు సెంటర్ నుంచి ఇంటికి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం తాగి ఉండటంతో ఘర్షణ పెరిగింది. చంద్రయ్య తం డ్రి గొంతు పట్టుకోవడంతో కాశీ కొడవలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాశీ భుజంపై ఉన్న రుమాలు తీసుకుని చంద్రయ్య గొంతునులిమి హత్యచేశాడు. చంద్రయ్య శరీరంపై ఉన్న లుంగీ, చొక్కా తీసి మృతదేహంపై చెత్త వేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి సెంటరులోకి వచ్చి తన కొడుకుని తానే చంపానని చెప్పడంతో స్థానికులు భయపడ్డారు. పెరవలి పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహా లు ఉండటంతో వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కూలీ పనులు చేసుకునే కాశీకి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పోలవరం కాలువలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి
పోలీవరం కాలువలో పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పులవారి గూడెం వద్ద గురువారం చోటుచేసుకుంది. పెదవేగికి చెందిన అర్చన(17) ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ప్రమాదవ శాత్తు పోలవరం కుడి కాలువలో పడి మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో మృతదేహాన్ని వెలికితిశారు. -
మాజీమంత్రికి మాతృవియోగం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టివసంత్ కుమార్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వాసుకి(70) అనారోగ్యంతో స్వగ్రామం ఎంఎంపురంలో మరణించారు. వాసుకి స్వగ్రామం భీమడోలు మండలం కోళ్ల పంచాయతీలోని ఎంఎంపురం. కొంతకాలంగా అనారోగ్యంతో మంచం మీదే ఉన్నారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని దగ్గరిబంధువులు తెలిపారు.