ప్రమాదంలో నుజ్జయిన కారు
సాక్షి, ఉండి(పశ్చిమ గోదావరి) : కలసిపూడిలో గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆకివీడు మాదివాడ ప్రాం తానికి చెందిన బొల్లం సాంబమూర్తి (32) అనే వ్యక్తి భీమవరంలో ప్రైవేట్ హెల్త్‌కేర్ సెం టర్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం డ్యూటీ ముగిసిన అనంతరం ఓ ఫం క్షన్‌కు హాజరై వేకువజామున సుమారుగా 2:45 నిముషాల సమయంలో కారులో భీమవరం నుంచి ఆకివీడు బయలుదేరాడు. మార్గమధ్యలో కలసిపూడి వద్ద కాలువ పక్కను ఉన్న చెట్లను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. సాంబమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతుని తండ్రి లింగతాతకు సమాచారం అందించడంతో వారు వచ్చి పోలీసుల సహాయంతో మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.సంతోష్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment