
జార్ఖండ్: దసరా వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బోగ్గుతో కూడిన ట్రక్ ప్రజలపైకి దూసుకురావడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఈ ట్రక్ అతి వేగంగా వస్తూ ఇద్దరు వాహనదారులను ఢీ కొట్టి మరికొంతమంది ప్రజలపైకి దూసుకొచ్చిందని తెలిపారు.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా, మరికొంతమందికి తీవ్ర గాయలపాలైనట్లు తెలిపారు. దసరా సందర్భండా ఆ కుటుంబం హాయిగా గడిపేందుకు బయటకు రావడంతో ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు సదరు ట్రక్‌ని సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment