
నిజాంపేట్: కారు రూపంలో ఓ చిన్నారిని మృత్యువు కబళించింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..మెదక్‌జిల్లా పాపన్నపేట్‌కు చెందిన నరేష్, జ్యోతి దంపతులు నిజాంపేట్ కమ్మరి బస్తీలో నివాసముంటున్నారు. వీరికి హర్షవర్ధన్ (18 నెలల) బాబు ఉన్నాడు. శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయ పూజారి సత్యనారాయణమూర్తి కుమారుడు వీర అశ్విత్ (20) కారును నిర్లక్ష్యంగా నడిపి ఆలయం సమీపంలో ఉన్న చిన్నారి హర్షవర్దన్‌ను ఢీకొట్టాడు.
కారు ముందు టైరు బాలుడి తల మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చిన్నారిని కేపీహెచ్‌బీలోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. చిన్నారి తండ్రి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనుక్కోండి!)
Comments
Please login to add a commentAdd a comment