యాదాద్రి భువనగిరి : భువనగిరి రైల్వేస్టేషన్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంట పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమికులు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లికి చెందిన ధనుంజయ్(20), కోమలి(17)గా గుర్తించారు. ప్రేమికులిద్దరూ సోమవారం రాత్రి పశ్చిమగోదావరి నుంచి హైదరాబాద్ వెళ్లే రైలులో వచ్చినట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు భువనగిరిలో దిగారు. అనంతరం వాళ్ల బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు.
దీంతో బంధువులు బీబీనగర్ మండలం రాఘవాపురంలో తెలిసిన వాళ్లకు ఫోన్ చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రేమికులు పురుగుల మందు తాగారు. స్పృహలో ఉండటంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ధనుంజయ్ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment