kalla
-
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు..
సాక్షి, ఉండి: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న వైఎస్సార్సీపీ పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో ఉండి ఇన్‌ఛార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో నాలుగువేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ మంత్రి శ్రీరంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరావు, కొట్ట సత్యనారాయణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి 150 కుటుంబాలు చేరిక తణుకు 11వ వార్డులో టీడీపీకి చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుని వార్డు ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదాద్రి భువనగిరి : భువనగిరి రైల్వేస్టేషన్లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంట పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమికులు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లికి చెందిన ధనుంజయ్(20), కోమలి(17)గా గుర్తించారు. ప్రేమికులిద్దరూ సోమవారం రాత్రి పశ్చిమగోదావరి నుంచి హైదరాబాద్ వెళ్లే రైలులో వచ్చినట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు భువనగిరిలో దిగారు. అనంతరం వాళ్ల బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో బంధువులు బీబీనగర్ మండలం రాఘవాపురంలో తెలిసిన వాళ్లకు ఫోన్ చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రేమికులు పురుగుల మందు తాగారు. స్పృహలో ఉండటంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ధనుంజయ్ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రజనీ 'కాలా' వర్కింగ్ స్టిల్స్
-
ఏసీబీ కోర్టుకు చిరుద్యోగి ఆస్తుల నివేదిక
భీమవరం టౌన్: కాళ్ల మండలం కోపల్లె ప్రాథమిక సహకార పరపతి సంఘం మాజీ కార్యదర్శి ఎం.సూర్యనారాయణరాజు ఆస్తులకు సంబంధించిన నివేదికను విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించామని ఏసీబీ డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఎం.సూర్యనారాయణరాజు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాళ్ల మండలం జక్కరం గ్రామంలోని ఆయన నివాసంలో, భీమవరం పట్టణంలోని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆస్తుల విలువ మొత్తం రూ.80 కోట్లు ఉంటుందని డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన అదనపు వివరాల సమాచారాన్ని బుధవారం ఫోన్లో డీఎస్పీ ప్రసాదరావును కోరగా ఆస్తుల నివేదికను విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించామని చెప్పారు. 500 గ్రాముల బంగారం తొలుత గుర్తించామని అయితే లాకర్లు తనిఖీ చేయగా మరికొంత బంగారం ఉందని, మొత్తం 800 గ్రాముల బంగారంగా నివేదికలో పొందుపరచామని పేర్కొన్నారు. నగదు, వెండి, భూములు తొలుత ప్రకటించిన దానిలో ఏవిధమైన మార్పు లేదని చెప్పారు. సూర్యనారాయణరాజు రిటైర్డ్ ఉద్యోగి కావడం వల్ల అరెస్ట్ లేదని పేర్కొన్నారు. -
వసతి గృహాలకు పెద్దపీట
కాళ్ల, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యతోపాటు వసతిగృహాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. శిథిలావస్థకు చేరిక హాస్టళ్ల స్థానంలో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించారు. ఈ కోవకు చెందుతుంది కాళ్లలోని బాలికల సమీకృత వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్). కాళ్ల మండలంలో కాళ్ల, బొండాడలో బాలికల వసతి గృహాలు ఉండేవి. వీటిలో ఈ ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లాలోని శివారు గ్రామాలకు చెందిన బాలికలు వసతి పొందేవారు. అయితే ఇక్కడ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడేవారు. 2007లో అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఈ విషయాన్ని మహానేత వైఎస్సార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మహానేత కాళ్లలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి రూ.1.68 కోట్ల నిధులు మంజూరుచేశారు. 2008 జనవరిలో ఈ హాస్టల్ నిర్మాణ ప్రారంభమైంది. ఎనిమిది విశాలమైన గదులు, డైనింగ్‌హాల్, కిచెన్ హాల్, వెయిటింగ్ రూమ్, ఆఫీస్ రూమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో హాస్టల్ రూపుదిద్దుకుంది. ఇది గ్రామంలో వైఎస్ ముద్రగా నిలిచిపోయింది.