
సాక్షి, ఉండి: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న వైఎస్సార్‌సీపీ పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో ఉండి ఇన్‌ఛార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో నాలుగువేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ మంత్రి శ్రీరంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరావు, కొట్ట సత్యనారాయణ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి 150 కుటుంబాలు చేరిక
తణుకు 11వ వార్డులో టీడీపీకి చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుని వార్డు ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment