westgodavari
-
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు: 6 గురు అరెస్టు
పశ్చిమగోదావరి: బుట్టాయిగూడెంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా జంగారెడ్డి గూడెం, పోలవరం ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి దగ్గరి నుంచి రూ.12 లక్షల నకిలీ కరెన్సీ, 3 బైకులు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి -
మూడు రోజుల్లో అత్తింటికి రావాల్సి ఉండగా.. దారుణం
సాక్షి,పశ్చిమగోదావరి: మరికొద్ది నెలల్లో వారసుడి కేరింతలతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఐదో నెల గర్భిణి అయిన తమ కోడలు దారుణ హత్యకు గురైందని తెలిసిన అత్తమామలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పండంటి బిడ్డకోసం ఎదురుచూసిన భర్త గుండెలవిసేలా రోదించాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తల్లి, కుమార్తె దారుణహత్యకు గురైన వార్త గణపవరంలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన లక్ష్మీప్రత్యూష (31)ను గణపవరానికి చెందిన రిటైర్డ్ ఆడిటర్ మానాప్రగఢ రాంబాబు కుమారుడు సాయి తేజస్వికి ఇచ్చి ఈ ఏడాది జనవరిలో వివాహం చేశారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తేజస్వి కోవిడ్ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఇంటి వద్ద నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భార్య లక్ష్మీప్రత్యూషకు తొలి ఆషాఢమాసం కావడంతో గతనెల రెండో వారంలో సత్తెనపల్లి పుట్టింటికి వెళ్లింది. శ్రావణమాసం రావడంతో తేజస్వి వారం క్రితం సత్తెనపల్లి అత్తవారింటికి వెళ్లి సంప్రదాయ ప్రకారం కొబ్బరికాయలు కొట్టి రెండు రోజులు ఉండి వచ్చాడు. లక్ష్మీప్రత్యూషను వచ్చేనెల 1న గణపవరం తీసుకువెళతామని చెప్పాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. శనివారం వరుసకు అన్న అయిన వ్యక్తి లక్ష్మీప్రత్యూషను ఆమె తల్లి పద్మావతిని సత్తెనపల్లిలో కత్తితో పొడిచి హతమార్చాడు. మరో మూడు రోజుల్లో కోడలు వస్తుందన్న ఆనందంలో ఉన్న భర్త, అత్తమామలకు విషయం తెలిసి కుప్పకూలిపోయారు. హుటాహుటిన సత్తెనపల్లి బయలుదేరారు. దీంతో రాంబాబు బంధువులు, సన్నిహితులతో పాటు గణపవరంలో తీవ్ర విషాదం నెలకొంది. చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -
దివ్యాంగులకు వరం.. యూడీ కార్డ్
ఏలూరు (టూటౌన్): దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీ ఐడీ (యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డ్) వారికి వరంగా మారింది. ఏదోక వైకల్యం ఉన్న వారు ఎక్కడికైనా వెళ్లాలంటే తమ వద్ద ఉన్న అర్హత పత్రాలు అన్నింటినీ గతంలో వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పొరపాటున ఏదైనా పత్రం పోతే తిరిగి దాన్ని పొందేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యలు లేకుండా దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో యూడీ ఐడీ కార్డును ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అర్హులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 54,052 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ యూడీ కార్డులను జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ నుంచి జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖకు ఆదేశాలు అందాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిక్ గుర్తింపు కార్డులో దివ్యాంగుని పేరు, గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ, వైకల్య శాతం, జారీ చేసిన తేదీ, కార్డు ఎప్పటివరకూ పనిచేస్తుంది, కార్డు వెనుక వైపు సదరం గుర్తింపు ఐడీ నంబర్, క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దీనిని కోడింగ్ చేస్తే పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా తొలి, మలి విడతల్లో 9,984 గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం ఇలా.. https://www.swavlambancard.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లైఫర్ సర్టిఫికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత దివ్యాంగుడి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. రెండో కాలమ్‌లో చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు, శాశ్వత చిరునామా పొందుపర్చాలి. మూడో కాలమ్‌లో వైకల్య వివరాలు, నాలుగో కాలమ్‌లో ఎంప్లాయిమెంట్, దివ్యాంగుని గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. ఫొటో, వేలిముద్ర లేక సంతకం చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయిన తరువాత పరిశీలించి గుర్తింపు కార్డులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇప్పటివరకు 9,984 కార్డులు మంజూరు జిల్లాలో ఇప్పటివరకూ 9,984 యూడీ కార్డులు మంజూరు చేశాం. దివ్యాంగులకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో పొందుపర్చడం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్ కాంపౌండ్‌లో ఉన్న మా కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. – ఎం.ఝాన్సీరాణి, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ -
బాధితులను పరామర్శించిన ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థతకు గురై.. చికిత్స అనంతరం కొలుకున్న బాధితులను డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం పరామర్శించారు. ఏలూరు టూటౌన్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని తెలిపారు. ఈ ఘటనకు కారణాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. (చదవండి: ఏదీ తేలిగ్గా తీసుకోవద్దు) ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఉదయం నుండి రెండు అస్వస్థత కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 614 కేసులు నమోదయ్యాయి. 576 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. 35 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: టీడీపీ సెల్ఫ్‌గోల్: చీప్ ట్రిక్స్‌తో పోరాటం) -
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు..
సాక్షి, ఉండి: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న వైఎస్సార్సీపీ పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో ఉండి ఇన్‌ఛార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో నాలుగువేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ మంత్రి శ్రీరంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరావు, కొట్ట సత్యనారాయణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి 150 కుటుంబాలు చేరిక తణుకు 11వ వార్డులో టీడీపీకి చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుని వార్డు ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. -
గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : విదేశీ చదువుల కోసం లాత్వియా దేశం వెళ్లిన పాలకొల్లు మండలం గోరింటాడకు చెందిన వడల వివేక్ (19) శనివారం రాత్రి అక్కడ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడు అమ్మమ్మ సునీత పాలకొల్లులోని క్రిష్టియన్‌పేటలో ఉంటోంది. మనవడి మృతి వార్త తెలిసి కన్నీరుమున్నీరవుతోంది. వివేక్ తండ్రి శ్యాంబాబు గత 20 ఏళ్ల నుంచి కువైట్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి స్వర్ణలత కూడా అక్కడే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వివేక్ ఈ ఏడాది జనవరిలో బీఎస్సీ మెకానికల్ ఇంజినీరింగ్ చదివే నిమిత్తం లాత్వియా దేశంలోని రిగా యూనివర్సిటీలో చేరారు. మొదటి సెమిష్టర్ పరీక్షలు పూర్తి చేశారు. మరో వారంరోజుల్లో వివేక్ తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్న కువైట్ నగరానికి రానున్నారు. అయితే ఈ లోగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివేక్ కువైట్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ 8వ తరగతి వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటూ 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ వరకు చదివారు. అనంతరం ఒక ఏడాది ఖాళీగా ఉన్నారు. గతేడాది నవంబర్‌లో రిగా యూనివర్సిటీలో బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్ సీటు ఖరారయ్యింది. ఈ ఏడాది జనవరిలో యూనివర్శిటీలో చేరారు. యూనివర్సిటీ హాస్టల్లో సీటు లేకపోవడంతో మన రాష్ట్రానికి చెందిన మిత్రులతో కలిసి ప్రత్యేకంగా నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో బయటకు తీసుకెళ్లిన మిత్రుడు మృతుడు వివేక్ ఉంటున్న గదికి వేరొక మిత్రుడు వచ్చి బయటకు తీసుకువెళ్లినట్లు సమాచారం. వెంటనే తిరిగి వస్తాను, గదికి లోపల గడియ పెట్టవద్దు అని మిత్రులకు చెప్పి వివేక్ బయటకు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తనను తీసుకువెళ్లిన మిత్రుడు దగ్గరలోని నదికి తీసుకువెళ్లి స్నానం చేయడానికి నదిలో దిగినట్లు చెబుతున్నారు. వివేక్‌ను తీసుకువెళ్లిన మిత్రుడు మునిగిపోతూ కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న పోలీసులు అతడ్ని రక్షించారు. అయితే వివేక్ అప్పటికే నదిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. నీళ్లంటే భయపడే తన మేనల్లుడు వివేక్‌ను అతని స్నేహితుడు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అస్సాంలో ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్న వర్థనపు స్టీవెన్సన్ స్థానిక విలేకరులకు తెలిపారు. లాత్వియాలో వివేక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మంగళవారం సాయంత్రం బంధువులకు అప్పగిస్తారని సమాచారం. అక్కడ నుంచి విమానంలో ఉక్రెయిన్ నుంచి న్యూఢిల్లీ మీదుగా విజయవాడకు విమానంలో తీసుకువచ్చి అక్కడ నుంచి పాలకొల్లు మండలం గోరింటాడకు మృతదేహాన్ని తీసుకురానున్నట్లు స్టీవెన్సన్ తెలిపారు.కువైట్‌లో ఉన్న తల్లిదండ్రులు వర్థనపు శ్యాంబాబు–స్వర్ణలత కన్నకొడుకుని కడసారా చూసుకునేందుకు కువైట్ నుంచి నేరుగా గోరింటాడ వస్తున్నట్లు చెప్పారు. -
కరగని గుండె!
సాక్షి, ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి): తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. వారిలో ఒకరి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందగా.. మరో రెండు కుటుంబాల సభ్యులు ప్రజాప్రతినిధుల వద్దకు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కానరాలేదు. ఇంతకీ ఆ సొమ్ము ఎందుకు రాలేదంటే.. సదరు ప్రజాప్రతినిధికి అడిగినంత డబ్బులు ముట్టజెప్పలేదట. ఆ అక్కసుతో ఆ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం అందకుండా ఆ ఎమ్మెల్యే మోకాలడ్డినట్టు తెలుస్తోంది. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తే మూడేళ్లు గడిచినా నేటికీ ఆ సొమ్ము రాలేదంటూ రెండు కుటుంబాలు బావురుమంటున్నాయి. అసలేం జరిగిందంటే..! 2016 జూలైలో ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద అగి ఉన్న బస్సును తప్పించబోయి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాల్వలోకి పడిపోయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. వీరిలో ఒకరు తణుకు పట్టణానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు, పెదనిండ్రకొలనుకు చెందిన వారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అందులో తణుకుకు చెందిన విద్యార్థి కుటుంబానికి అక్కడి ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకుని డబ్బులు ఇప్పించారు. ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మిగిలిన ఇద్దరి కుటుంబ సభ్యులు మూడేళ్ల నుంచి ఎమ్మెల్యే, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే మాజీ అయ్యారు. డబ్బులు ఇవ్వలేదనే ! 2016 జూలైలో అంటే.. మూడేళ్ళ క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో ఉంగుటూరుకు చెందిన కొప్పుల వెంకట త్రినాథ దుర్గారావు మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవటంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఇక నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన వానపల్లి పెద్దిరాజు కూడా బస్సు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం చెల్లిస్తానన్న పరిహారం కోసం ఏళ్ళ తరబడి ఎమ్మెల్యే ఇంటిచుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇద్దరి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షలు రావాల్సి ఉంది. ఇంత మొత్తంలో డబ్బులు వస్తాయి గనుక.. తన వాటా ముందుగానే ఇవ్వాలని ఆ ప్రజాప్రతినిధి డిమాండ్ చేశారు. కానీ ఈ రెండు కుటుంబాలు తమకు నష్టపరిహారం ఇప్పిస్తే తప్పకుండా డబ్బులు ఇస్తామని, తమకు ప్రస్తుతం అంత డబ్బులు ఇచ్చే స్తోమత లేదని ప్రజాప్రతినిధిని అర్థించారు. కానీ ఆయన మనస్సు మాత్రం కరగలేదు. ముందుగానే చేయి తడపాలంటూ కచ్చితంగా తేల్చిచెప్పేశారు. అదేమంటే ఇదిగో వస్తుంది, కలెక్టర్ దగ్గర ఫైలు ఉందంటూ మభ్యపెడుతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌పైనే ఆశ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ఆ ఎమ్మెల్యే మాజీ అయిపోవడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు న్యాయం చేస్తారనే ఆశతో ఆ రెండు కుటుంబాలు ఉన్నాయి. -
ప్రజల కోసం 24/7
సాక్షి, ఏలూరు టౌన్ (పశ్చిమ గోదావరి): ప్రజలకు మెరుగైన ఉత్తమ సేవలు అందించేందుకు 24గంటలూ అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా బాధితులు తన వద్దకు రావచ్చని, తలుపులు తెరిచే ఉంటాయని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకున్న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట వేస్తామని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇక తన ప్రాధాన్య అంశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీల్లో భాగంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. జిల్లాలోని ఆయా సమస్యలపై సబ్ డివిజినల్ అధికారులతో సమీక్షించి, ముందుగా ఒక అవగాహన తెచ్చుకోవాలని, అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదు దారులతో స్నేహపూర్వకంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. మంచి వాతావరణంలో పోలీసులు, ప్రజలకు మధ్య సంబంధాలు ఉండేలా చూస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై ఎప్పుడైనా తనవద్దకు రావచ్చని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రతి సోమవారం ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని, సబ్ డివిజన్ పరిధిలోనూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నవదీప్‌సింగ్ చెప్పారు. జిల్లాలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజా జీవనానికి అవాంతరాలు కల్పిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. అధికారుల శుభాకాంక్షలు ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌ను జిల్లాలోని డీఎస్పీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్బీ డీఎస్పీ నున్న మురళీకృష్ణ, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ పీ.భాస్కరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం డీఎస్పీ రవికుమార్, నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు జిల్లా ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్రైం రేట్ పెరిగితే సహించను: ఎస్పీ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని, విధుల్లో జవాబుదారీతనం ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, క్రైం రేట్ పెరిగితే సహించేదిలేదని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ అధికారులను హెచ్చరించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన జిల్లాలోని సబ్ డివిజనల్ ఆఫీసర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా జిల్లాకు రావటంతో ఇక్కడ పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవటంతోపాటు, నేరాలపైనా ఆరా తీశారు. పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల విషయంలోనూ అత్యంత కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే అటువంటివారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ నేరసమీక్షలో జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ నున్న మురళీకృష్ణ, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం డీఎస్పీ రవికుమార్, నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు తదితరులు ఉన్నారు. -
ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త..
నిడమర్రు : వేసవి సెలవుల నేపథ్యంలో.. ఇళ్లకు తాళాలు వేసి కుటుంబంతో సహా బంధువుల ఊరు వెళుతున్నారా.. తీర్థ యాత్రలకు/విహార యాత్రలకు ప్రయాణం అవుతున్నారా.. అయితే మీ ఇంటిపై దొంగలు ఓ కన్నేస్తారు జర భద్రం. కనీస జాగ్రత్త చర్యలు తీసుకుని ఊరెళ్లడం మంచిదని నిడమర్రు ఎస్సై ఎం. వీరబాబు సూచిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరువెళ్లే వారి ఇళ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఊరెళెతే మరి మన వంతుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఊరెళితే.. చెప్పి వెళదాం... ఎక్కువ రోజులు ఊరెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లడం మంచిది.నివాస గృహాల ప్రధాన ద్వారాలే కాకుండా లోపల ద్వారాల తలుపులకు కూడా తాళం వేసుకోవాలి. గదుల లోపల ఉన్న కిటీకీలు ఇతర తలుపులకు గెడలు, గొళ్లాలు వేసి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఇంటి కాంపౌండ్/పోర్టికో/ముఖద్వారం బయట చీకటి పడితే విద్యుత్ దీపాలు వెలిగేలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. దీనికోసం ఇరుగు పొరుగు వారి సహాయం తీసుకోవచ్చు. అలానే తాళం వేసిన ద్వారాలకు పరదాలు, డోర్ కర్టెన్లు వేసి ఇంటికి తాళాలు వేసినట్టు కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్ట్మెంట్లలో ఉండేవారు ఊరు వెళుతున్నప్పుడు ప్లాట్ చుట్టుపక్కల ఉన్న వారికి మీ ఫోన్ నంబర్లు ఇచ్చి వెళ్లండి. అపార్ట్‌మెంట్స్‌లోనూ/ఆర్థిక స్తోమతగల వారు మీ ఇంటి వద్ద సీసీ కెమెరా నిఘా పెట్టుకోవడం మంచిది.విలువైన ఆభరణాలు, నగదు వెంట తీసుకు వెళ్లాలి/బ్యాంకు లాకర్ ఉంటే వాటిలో/మీ సన్నిహితుల వద్ద భద్రపర్చుకోవాలి. ఊరెళ్లే ముందు ద్విచక్ర వాహనాలు ఆరుబయట/ప్రహరీ లోపల వదిలేయకుండా ఏదైనా గదిలో వాహనాలను జాగ్రత్తగా తాళం వేసుకోవాలి/సుపరిచితుల ఇళ్లలో పెట్టి వెళ్లాలి. మీ ద్విచక్ర వాహనాల తాళాలు అరిగిపోతే వెంటనే మార్చుకోండి. మీ ఇంటికి సెంట్రల్ లాంకింగ్ సిస్టంగల తాళం పెట్టించుకోండి. పనిమనిషి ఉంటే రోజూ గుమ్మం ముందు ముగ్గు వేయించే ఏర్పాటు చేసుకోవాలి.బస్సులలో, ట్రైన్లలో అపరిచితులు ఏమైనా తినుబండారాలు ఇచ్చినా వాటిని మీరు తినవద్దు. వాటిలో మత్తు మందు కలిపే అవకాశం ఉంది. మరిన్ని జాగ్రత్తలు ఇలా వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఉన్నప్పుడు వారిని ఒంటరిగా ఇంటిలో ఉంచరాదు. అలాగే ఒంటరిగా బయటకు పంపరాదు.ఇంటి లోపల పడుకున్నప్పుడు లోపల నుంచి డోర్స్ లాక్ చేసుకోవటం మర్చి పోవద్దు. విద్యుత్ కోతల నేపథ్యంలో మహిళలు బంగారు నగలు ధరించి ఇంటి బయటగానీ, డాబా మీదగాని పడుకోవద్దు. ఆభరణాలకు మెరుగులు పెడతామని/ రంగులు అద్దుతాం అంటూ ఇళ్లకు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరుకూ వారి ప్రాంతం గుర్తింపు కార్డులు అడిగి వాటిని పరిశీలించాలి. అనుమానం ఉంటే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వండి. రాత్రిపూట ఒంటరిగా వెళ్లాల్సి వస్తే మహిళలు వీలైనంత తక్కువ విలువ గల ఆభరణాలు ధరించాలి. అవసరమైతే భుజం పైనుంచి కొంగు కప్పుకుని వెళ్లండి.! -
చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా..
నిడమర్రు : చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయుతనిచ్చేలా 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ(ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది. ఈ పథకం రూ.20 వేల కోట్ల కార్పస్ నిధి ఏర్పాటు చేసింది. బ్యాంకులకు గ్యారంటీగా ఉండటానికి ప్రభుత్వం ఈ మూలధనాన్ని కేటాయించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎలా ప్రయోజనం పొందాలో, అర్హతలు ఏమి ఉండాలో తెలుసుకుందాం. ముద్ర పథకంలో రుణాలు మైక్రో యూనిట్స్ అభివృద్ధి, రీఫైనాన్సింగ్ కార్యకలాపాల కోసం చిన్నతరహా వ్యాపారవేత్తలకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ ముద్ర రుణాలు ఇస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు 7 శాతం వడ్డీ రేటుపై రీఫైనాన్స్ సేవలను అందిస్తుంది. తయారీ, సర్వీసులు తదితర రంగాల్లోని చిన్న వ్యాపారులకు రుణాలు కల్పించే సంస్థల మార్గదర్శకాలు రూపొందించడం, ఎంఎఫ్‌ఐల రిజిస్ట్రేషన్, రేటింగ్ మొదలైన అంశాలను ముద్ర పర్యవేక్షిస్తుంది. ముద్ర నుంచి తీసుకునే మొత్తాన్ని రుణంగా ఇచ్చేటప్పుడు నిర్దిష్ట వడ్డీ రేటుకు మించి వసూలు చేయకుండా పరిమితి విధిస్తుంది. సూక్ష్మ రుణ సంస్థలు(ఎంఎఫ్ఐ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) కూడా ముద్ర నుంచి రుణాలు తీసుకోవచ్చని, తదుపరి ఆ మొత్తాన్ని ఇతరులకు రుణాలిచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. రుణ రకాలు : ఫండింగ్ దశను బట్టి ‘శిశు’, ‘కిశోర్’, ‘తరుణ్’ పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన నిధులు సమకూర్చుతుంది. శిశు: రూ. 50 వేల వరకు, కిశోర్: రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ, తరుణ్: రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలను వర్గీకరించారు. రుణం పొందుటకు అర్హతలు వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగా ఉండాలి. ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో రుణ అవసరం రూ.10 లక్షలలోపు ఉండాలి. పైన పేర్కొన్న అర్హతగల వారు దగ్గరలో ఉన్న బ్యాంక్, సూక్ష్మ రుణ సంస్థ(ఎంఎఫ్ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) అధికారులను సంప్రదించాలి. ఈ పథకం వర్తించే రంగాలు రవాణా/కార్యాచరణ –ఆటో రిక్షా, చిన్న వస్తువులు రవాణా వాహనం, త్రిచక్ర వాహనాలు, ఈ–రిక్షా, ప్యాసింజర్ కార్లు, టాక్సీలు మొదలైనవి, సరుకుల రవాణా, వ్యక్తిగత రవాణా కోసం వాహనాలు కొనుగోలు, కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు కార్యక్రమాలు–బ్యూటీ పార్లర్స్, వ్యాయామశాల, షాపులు, టైలరింగ్ దుకాణాలు, డ్రై క్లీనింగ్, మోటర్ సైకిల్ మరమ్మతు దుకాణం, డీటీపీ, ఫొటో సౌకర్యాలు, మెడిసిన్ దుకాణాలు, కొరియర్ ఏజెంట్లు మొదలైనవి. ఆహార ఉత్పత్తులు సెక్టార్ : అప్పడాలు/పచ్చళ్లు/జామ్/జెల్లీ తయారీ, వ్యవసాయ ఉత్పత్తుల పరిరక్షణకు గ్రామీణస్థాయి, మిఠాయి దుకాణాలు, ఆహారం స్టాళ్లు, రోజూ క్యాటరింగ్/ రోజువారీ క్యాటరింగ్ సేవలకు/కోల్డ్ స్టోరేజ్/ఐస్ అండ్ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్లు, బిస్కెట్స్, రొట్టె ల తయారీ మొదలైనవి. వస్త్ర ఉత్పత్తుల సెక్టార్ : చేనేత, జరీ మరియూ జర్దారీ పని, సంప్రదాయ ఎంబ్రాయిడరీ, చేతిపని, సంప్రదాయ అద్దకం, ప్రింటింగ్, దుస్తులు డిజైన్, అల్లడం, పత్తి జిన్నింగ్, కంప్యూటరీకరణ ఎంబ్రాయిడరీ, బ్యాగులు మొదలైనవి. రుణం పొందే విధానం ఈ ముద్ర పథకం కింద సహాయం పొందగోరేవారు వారి ప్రాంతాల్లో ఆర్థిక సంస్థల ఏ యొక్క స్థానిక శాఖ అధికారులనైనా సంప్రదించవచ్చును. పీఎస్‌యూ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు తదితర రుణ సంస్థలను సంప్రదించాలి. రుజువుల కోసం ఇలా.. గుర్తింపు రుజువు : ఓటరు ఐడీ కార్డు/డ్రైవింగ్/ఆధార్ కార్డు వంటి ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన గుర్తింపు కార్డు, నివాస రుజువు కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలు. రెండు ఫొటోలు, మెషినరీ/ఇతర వస్తువులను కొనుగోలు కొటేషన్, సరఫరాదారు పేరు/యంత్రాలు ధర కొనుగోలు వివరాలు, వ్యాపార సంస్థకు సంబంధించిన లైసెన్స్/నమోదు సర్టిఫికెట్లు, వ్యాపార యూనిట్ చిరునామా రుజువు, ఎస్టీ /ఎస్సీ/ఓబీసీ/మైనార్టీ ధ్రువీకరణ పత్రం. ఈ పథకం ప్రత్యేకతలు బ్యాంక్‌లు/ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలాగే అదనపు హామీ ఉండదు. రుణం తిరిగి చెల్లించే కాలం ఐదేళ్ల వరకు పొడిగించారు. అభ్యర్థి ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థకు డిపాల్టర్‌గా ఉండకూడదు. -
మైనర్‌ను గర్భవతిని చేసిన వ్యక్తిపై కేసు
పోడూరు : బాలికను గర్భవతిని చేసిన ఒక వివాహితుడిపై బుధవారం పోడూరులో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపారు. ఆయన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా తూర్పుపాలెం శివారు ఆనందరావుపేటకు చెందిన వివాహితుడు మూడే గోపాలం. అతడి భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలో గోపాలానికి చెల్లెలు వరుసైన ఒక బాలిక (17) తరచూ పిల్లవాడిని ఆడించేందుకు అతడి ఇంటికి వస్తుండేది. గోపాలం భార్య ఉపాధ్యాయురాలు కావడంతో పగటి సమయంలో స్కూల్‌కు వెళ్లిపోయేది. ఈ నేపథ్యంలో ఆ బాలికను గోపాలం మాయమాటలుతో శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం బాలిక తొమ్మిదో నెల గర్భిణి. ఈ విషయం గోపాలం భార్యకు తెలియడంతో ఆ బాలికకు అబార్షన్ చేయించేందుకు వారు ప్రయత్నించారు. చివరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రామకృష్ణ నిందితుడైన గోపాలంపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలియుగంలో కని.. విని ఎరుగని వివాహ వేడుక
-
ఇదేందిరబ్బీ!
► అన్నదాతకు అందని పంట డబ్బు ► ధాన్యం కొనుగోలులో సర్కారు చిత్రం ► ఖరీఫ్ వచ్చినా.. సొమ్ములివ్వని వైనం ► జిల్లా వ్యాప్తంగా రూ.7కోట్ల బకాయిలు ► రైతుల ఆందోళన ► పట్టించుకోని అధికారులు రబీ అయిపోయిది. ఖరీఫ్ ఆరంభమైంది. అన్నదాతలు నాట్ల దశకు చేరారు. అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఇంకా రబీ పంట డబ్బు అందలేదు. ఫలితంగా వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏలూరు (మెట్రో) : ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఖాతాల్లో 48 గంటల్లో సొమ్మును జమ చేస్తాం. మద్దతు ధర అందేలా చూస్తాం.’ ఇదీ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా చెప్పిన మాట. ఆయన చెప్పినట్టు 48 గంటల్లో కాదు కదా.. మూడు నెలలు పూర్తయిపోయినా.. ఖరీఫ్ సీజన్ వచ్చినా.. ఇంకా రబీ పంట డబ్బు మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇంకా సుమారు రూ.7కోట్ల 26 లక్షలు రైతులకు చెల్లించాలి. రబీలో కొనుగోలు ఇలా.. గత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 283 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొన్నారు. 85,284 మంది రైతుల వద్ద నుంచి 10,18,449.88 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. అన్నదాతలకు 1,523.41 కోట్లు నిధులు చెల్లించాల్సి ఉండగా.. రూ.1,516.14కోట్లు చెల్లించారు. ఈ నిధులనూ 48గంటల్లో కాకుండా ధాన్యం కొన్న 10, 15 రోజులకు, ఒక్కో రైతుకు 30 రోజులకూ చెల్లింపులు చేశారు. ఇంకా రూ.7.26 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. అన్నింటిలోనూ ముందు వరుసలోనే.. రబీ సీజన్లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. ఈ జిల్లాలన్నింటిలో పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక మంది రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. అధిక నిధులు కూడా చెల్లించింది. అదే స్థాయిలో రైతులకు ఆలస్యంగా నిధులు చెల్లించిన జిల్లాగానూ, ఇంకా అత్యధికంగా సొమ్ములు బకాయి పడిన జిల్లా కూడా మనదే. ఇబ్బందుల్లో రైతులు జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఖరీఫ్ సాగుకు పెట్టుబడి లేక సతమతమవుతున్నారు. రుణమాఫీ, ఇతరత్రా కారణాల వల్ల బ్యాంకులు అన్నదాతలకు రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రబీ పంట డబ్బులు వెంటనే చెల్లిస్తే తమకు కొంతలో కొంత ఉపశమనంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. తక్షణం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
విమర్శలతో సరి
కొవ్వూరు/కొవ్వూరు రూరల్ : తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నేతల ప్రసంగాలకే పరిమితమైంది. ప్రతిపక్షంపై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై ఏ విధమైన చర్చ చేపట్టలేదు. కొవ్వూరులో ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 1.55 గంటల వరకు సాగింది. నేతలు ముందు నుంచి ఇరవై ఐదు వేల మంది హాజరవుతున్నారని ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆశించినస్థాయిలో జనం హాజరు కాలేదు. పైగా సభ ప్రారంభమైన కొద్ది సేపటికే భోజనాలు ప్రారంభం కావడంతో జనం భోజనాలకు వెళ్లి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. దీంతో గంట ఆలస్యంగా ప్రారంభమైన సమావేశంను మూడు గంటల్లోనే ముగించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ ఎ¯ŒSటీఆర్ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ఈయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. జిల్లా ఇ¯ŒSచార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అధికారులు కార్డుదారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. క్యాష్‌లెస్ లావాదేవీలు ఇష్టమైన వాళ్లు చేతులెత్తండి... అనగానే ఒక్క చెయ్యి లేవకపోవడంతో మంత్రి విస్తుపోయారు. దీనిపై తక్షణమే కలెక్టర్, జేసీలతో మాట్లాడాతానన్నారు. అధికారులు ఈ వి«ధానంపై ఒత్తిడి చేస్తే సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడిపై ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైఎస్సార్ సీపీ సీబీఐ విచారణ కోరడంలో అర్థం లేదన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ కేవలం సమావేశానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రసంగం ముగించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ఐదు సార్లు తనకు జిల్లా సారథి పగ్గాలు అప్పగించడమే నిదర్శమని అన్నారు. ఎంపీ మాగంటి బాబు (వెంకటేశ్వరావు)మాట్లాడుతూ కొల్లేరు అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ అక్కడ ప్రజలకు తాము ఏం చేయగలుగుతున్నామంటే సమాధానం లేదన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు మనరాష్ట్రానికి వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక నేతలు అతిథులకు శాలువాలు కప్పి జ్జాపికలు అందజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకరరావు కేవలం పది నిమిషాలుండి ప్రసగించకుండానే వెళ్లిపోయారు. మాజీ మంత్రి పీతల సుజాత ఒక నిమిషం మాట్లాడి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నరసారపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జెడ్పీ చైర్మ¯ŒS ముళ్లపూడి బాపిరాజు, రాజమõßహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహ¯ŒSలు విదేశీ పర్యటనలో ఉండడంతో హాజరు కాలేదు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోదరుడు మృతి చెందారు. దీంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదు. పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, వేటుకూరి శివరామరాజు, నిమ్మల రామానాయుడు, బురుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, మొడియం శ్రీనివాసరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి ఆంజనేయులు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహ¯ŒSరావు, మంతెన సత్యనారాయణ రాజు, ఎంఏ షరీఫ్, పార్టీ నేతలు పెండ్యాల అచ్చిబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈలినాని, అంబికా కృష్ణ, పాలి ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్బ రాయ చౌదరి, మునిసిపల్ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధా రాణి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఐదు అంశాలపై తీర్మానం lవ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచి రైతులను బలోపేతం చేయాలి. lజిల్లాలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవన ప్రమాణాలు మొరుగుపర్చడం. lపర్యావరణానికి నష్టం కలగకుండా ఆక్వా కల్చర్‌ను అభివృద్ధి చేయడం, తద్వారా ఉపా«ధి అవకాశాలు మెరుగుపరచడం. lఅభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు బలహీన వర్గాలకు అందేలా చర్యలు తీసుకోవడం. lరాష్ట్రానికి వచ్చే జాతీయ సంస్థలను జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. -
బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి
కుక్కునూరు: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం కమ్మరిగూడెం సమీపంలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కమ్మరిగూడెం (ముంపుగ్రామం) వద్ద బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్ నడుపుతున్న కొత్తగూడెం వాసి అక్కడికక్కడే మృతిచెందగా.. వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దద్దరిల్లిన హోదా నినాదం
అత్తిలి (తణుకు) : ప్రత్యేక హోదా ఉద్యమం జిల్లాలో విస్తరిస్తోంది. సోమవారం అత్తిలి, చింతలపూడిలో ప్రత్యేక హోదా నినాదం దద్దరిల్లింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విద్యార్థులు అత్తిలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్వీఎస్ఎస్ డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు ర్యాలీగా గ్రామ పుర వీధుల్లో తిరిగి ప్రత్యేక హోదా ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బస్‌స్టేన్ సెంటర్లో మానవహారంగా నిలబడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. హోదాతో పరిశ్రమలు ఏర్పాటువుతాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తామంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదాయే కావాలని డిమాండ్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ముందస్తుగా పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని ఎస్సై వీఎస్ వీరభద్రరావు విద్యార్థులకు తెలిపారు. దీంతో కొద్దిసేపు ర్యాలీ నిలిచిపోయింది. వైఎస్సార్ సీపీ నాయకులు విద్యార్థులు చేస్తున్న ర్యాలీ వద్దకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు విద్యార్థులకు సంఘీభావం తెలిపి, ర్యాలీని కొనసాగించారు. దీంతో పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు మద్దాల నాగేశ్వరరావు, బుద్దరాతి భరణీప్రసాద్, ఆకుల చినబాబు, పైబోయిన సత్యనారాయణ, కంకటాల సతీష్, మద్దాల శ్రీనివాస్, గూనా మావుళ్లు, పైబోయిన శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. చింతలపూడిలో రాస్తారోకో, ధర్నా చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై సోమవారం «రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.ధామస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీలకు అలవాటు పడి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి జగపతిరావు అధ్యక్షతన జరిగిన గాంధీవర్ధంతి కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్నాలో కాంగ్రెస్ నాయకులు సంకు ప్రసాద్, నిరీక్షణ, వేట వెంకన్న, సుందరం, మూర్తు జాలి, సుబ్బారావు, సూర్యనారాయణ, వెంకన్నబాబు, పాండురంగారావు పాల్గొన్నారు. -
’ఆక్వా’రిష్టం
బరితెగిస్తున్న మాఫియా అన్నదాతకు తీరని నష్టం మామూళ్ల మత్తులో అధికారులు జిల్లాలోని అన్నదాతలకు ’ఆక్వా’రిష్టం దాపురించింది. పచ్చని చేలు అక్రమార్కుల ధన దాహానికి చెరువులుగా మారిపోతున్నాయి. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులూ వంతపాడుతున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆక్వా మాఫియా బరితెగిస్తోంది. అనుమతులు లేకుండానే వేలాది ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం సాగిస్తోంది. తర్వాత వాటిని రొయ్యల చెరువులుగా మార్చేస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వేలాది ఎకరాల్లో అక్రమంగా రొయ్యలసాగు జరుగుతోంది. వీటి నుంచి పంట కాలువల్లోకి విడుదలవుతున్న కాలుష్య నీరు పొలాలను ముంచెత్తుతోంది. తాజాగా నిడమర్రు మండలంలోని అడవికొలనుతోపాటు పలుగ్రామాల్లో వేలాది ఎకరాల్లో రబీ నారుమళ్లు, నాట్లు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారంతా కౌలురైతులే. నారుమళ్ల కోసం ఆ రైతులు రూ.ఐదువేల నుంచి రూ.పదివేల వరకూ ఖర్చుచేశారు. ఈ ఖర్చంతా నీటిపాలైంది. పంట కాలువలూ పచ్చగా మారాయి. దీనిపై రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మత్య్సశాఖ ఉన్నతాధికారులు వచ్చి చూసి వెళ్లారు. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు ఉండటం వల్లే అక్రమార్కులను అధికారులు ఏం చేయలేకపోతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నిడమర్రు మండలంలో ఉన్నన్ని అనధికారిక చెరువులు జిల్లాలో ఎక్కడా లేవు. ప్రభుత్వ అన్ సర్వే భూములనూ చెరువుల్లో అక్రమార్కులు కలిపేసుకున్నట్టు సమాచారం. అడవికొలనులో 85 సెంట్ల ప్రభుత్వ భూమినీ కలిపేసుకుని కొందరు చెరువులు తవ్వేసుకున్నారు. పెదనండ్రకొలను, అడవికొలను గ్రామాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేశారు. సాధారణంగా చేపల చెరువులకు రెండు అనుమతులు ఉంటాయి. తాత్కాలిక అనుమతితో చెరువు తవ్వుకోవచ్చుగానీ, నీరు నింపే అవకాశం లేదు. శాశ్వత అనుమతి వస్తేనే చేపల పెంపకానికి అనుమతి ఉంటుంది. అయితే తాత్కాలిక అనుమతులతోనే అక్రమార్కులు చేపల చెరువులు తవ్వేసి వాటిని తర్వాత రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అసలు రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రభుత్వ అనుమతులు లేవు. కానీ నిడమర్రు మండలంలో చేపల, రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతోంది. వీటిల్లో పట్టుబడి కోసం నీటిని వదిలివేయడంతో చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. నీళ్లు ఒక్కసారిగా వదలడంతో చాలాచోట్ల నారుమళ్లు నీట మునిగి కుళ్లిపోయాయి. అడవికొలను గ్రామం కలందకోడు పాయ, దొంగపర్రు, దాళ్వాపర్రిపాయల్లో నారుమళ్లు మొత్తం నాశనమైపోయాయి. దాదాపు రెండువేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశకు చేరుకున్న నారు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతోపాటు రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం వల్లే ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిడమర్రుతోపాటు అడవికొలను, పెదనిండ్రకొలనుల్లో చేపల చెరువులుగా మారిన అత్యధిక పొలాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధాన రహదారికి పక్కనే రొయ్యల సాగు జరుగుతున్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా.. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు. ప్రశ్నించిన రైతులకు ఆక్వా మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు పడతారంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నారుమళ్లు నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. నారుమళ్లు నష్టపోవడంతో ఇప్పుడు వేరే చోట నారు కొని తెచ్చి నాట్లు వేసినా ఆ తర్వాత చెరువుల నుంచి కలుషిత నీరు వదిలితే ఏం చేయాలోనని మధనపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. . -
మూడు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి
నరసాపురం : పట్టణంలోని పీచుపాలెం రోడ్డులో జరిగిన ప్రమాదంలో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామానికి చెందిన పాల వ్యాపారి చిమిలి సూర్యనారాయణ(45) మృతి చెందాడు. టౌ¯ŒS ఎస్సై కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. సూర్యనారాయణ ప్రతిరోజూ పాలను పట్టణానికి తీసుకొచ్చి అమ్ముతాడు. మంగళవారం తెల్లవారు జామునే పట్టణానికి వచ్చిన ఆయన, పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై పాల క్యాన్లు కట్టుకుని పంజాసెంటర్‌వైపు వెళ్తుండగా, చర్చి దాటగానే వెనుక నుంచి మేకల లోడుతో వచ్చిన వ్యా¯ŒS ఢీకొట్టింది. కిందపడిపోయిన సూర్యనారాయణ, తలమీద నుంచి వ్యా¯ŒS వెనుక చక్రం ఎక్కేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. సీఐ పి.రామచంద్రరావు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు. వ్యా¯ŒS డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుని బంధువులు కొద్దిసేపు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. వ్యా¯ŒS డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సూర్యనారాయణ మృతితో వారు దిక్కులేనివారయ్యారు. దూబచర్ల వద్ద ట్రాక్టర్ డ్రైవర్.. ఏలూరు అర్బ¯ŒS : దూబచర్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. గోపాలపురం మండలం చెరుకుమిల్లి గ్రామానికి చెందిన పి.కృష్ణ (40) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. భార్యాపిల్ల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను మంగళవారం గ్రామం నుంచి ట్రాక్టర్లో చెరుకు లోడు వేసుకుని భీమడోలు వెళ్తుండగా, దూబచర్ల సమీపంలో టైర్ పంక్చర్ కావడంతో కృష్ణ ట్రాక్టర్ దిగి చక్రాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ సమయంలో అటుగా వచ్చిన లారీ అతడిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బ ంది బాధితుని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. పరీక్షించిన వైద్యులు కృష్ణ అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. దొంగరావిపాలెం వద్ద మరొకరు.. దొంగరావిపాలెం(పెనుగొండ): దొంగరావిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందాడు. పెనుగొండ ఎస్సై బీవై కిరణ్ కుమార్ కథనం ప్రకారం దొంగరావిపాలెం శివారున జాతీయ రహదారిలో సోమవారం రాత్రి మోటార్ సైకిల్ ప్రక్కనే కొనఊపిరితో పడిఉన్న కోన శ్రీనివాస్(42)ను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచాడు. మోటా ర్‌సైకిల్ దెబ్బతినకపోవడం, మరో వాహ నం ఢీకొన్న ఆనవాలు లేకపోవడంతో, మృతుడు బైక్‌పై నుంచి జారి పడి గాయపడి మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
90 శాతం ఏటిఎంలు పని చేయట్లేదు
-
ఏలూరులో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
-
చెత్త కుప్పలో నవజాత శిశువు
ఉండి(పశ్చిమగోదావరి): మానవత్వాన్ని మరచిన మనుషులు అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్త కుప్పలో వదిలివెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాండువ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామంలోని క్రిస్టియన్ పేటలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును చెత్త కుప్పలో వదిలివెళ్లారు. చిన్నారి ఏడుపు వినిపిస్తుండటం గమనించిన స్థానికులు ఆ శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రూ.100 కోట్ల కోఢీ!
కోడిపందేల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున పందేలు నిర్వహించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని పలుప్రాంతాలలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. కోడిపందేలతోపాటు యాథావిధిగా గుండాట, పేకాట, కోత ఆటలను కూడా నిర్వహించేందుకు పందెగాళ్లు సిద్ధమవుతున్నారు. మొత్తంగా పందేలలో రూ.100కోట్లు చేతులు మారనున్నాయని అంటున్నారు. - పాలకొల్లు టౌన్ సిద్ధమవుతున్న బరులు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా ఐ.భీమవరం, వెంప, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పూలపల్లి, కలగంపూడి, కొప్పాక ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తారు. ఇక్కడేగాకుండా అనేక చిన్న గ్రామాల్లో సైతం పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. బరుల్లో కోడి పుంజు సామర్థ్యాన్ని బట్టి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఒక పందెం జరుగుతుంది. వీటితోపాటు పందేలు చూడడడానికి వెళ్లేవారు ఒక్కొక్క పందెంపై రూ.పది లక్షల వరకు పై పందేలు వేస్తుంటారు. కోడిపందేలపై ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు పండగ మూడురోజులు ప్రత్యేక ఏర్పా ట్లు చేసుకుని ఈ ప్రాంతాలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కోడిపందేల ముసుగులో నిర్వహించే గుండాట, కోత ఆటల్లో సామాన్య, మధ్యతరగతిప్రజలు పెద్ద ఎత్తున పందాలు కాస్తుంటారు. వీళ్లలో నష్టపోయేవారు అధికంగా ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాలోని కోడిపందేల బరులకు హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, బెంగళూరు, తమిళనాడు నుంచి అనేకమంది ప్రముఖులు వస్తుంటారు. ఇప్పటికే పండగ మూడురోజులు బస చేయడానికి పందేలు జరిగే ప్రాంతాల్లోని లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా పందేలకు కోళ్లను సిద్ధం చేసేవారు జిల్లాలో సుమారు 40 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. వీరు ప్రధానంగా ఢీకొట్టే నెమలి, డేగ, పచ్చకాకి, పింగళి, రసింగ్, కేతువ వంటి పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. కోడిపుంజు సామర్థ్యాన్ని బట్టి పందెంగాళ్లు వారి నుంచి కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన కోడిపందేల బరుల్లో దింపుతారు. కుక్కుటశాస్త్రం ప్రకారం కొనుగోళ్లు పందేల నిర్వాహకులు చాలామంది కుక్కుటశాస్త్రాన్ని అనుసరిస్తారని చెబుతున్నారు. పందెం జరిగే రోజు తిధిని బట్టి ఏ కోడిపుంజు గెలుస్తుందో అంచనా కట్టి రూ.లక్ష ల్లో కొనుగోలు చేసి మరీ పం దేలు కాస్తారని చెబుతున్నారు. జిల్లాలో కోడిపందేల నిర్వాహకులు రూ.లక్షలు ఖర్చుచేసి భారీ టెంట్లు, బరులు ఏర్పాటు చేస్తారు. సంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి కోడిపందేలు జరగాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు ఎంత అడ్డుకోవాలని చూసినా జిల్లాలో అన్నిప్రాంతాల్లో సంక్రాంతి 3 రోజులు కోడిపందేలు జరిగి తీరతాయని నిర్వాహకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆస్తుల తనఖాకూ సిద్ధం కోడిపందేల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆస్తులను వడ్డీ వ్యాపారులకు తనఖా పెడుతుంటారు. గత ఏడాది యలమంచిలి మండలంలో ఒక వ్యక్తి రూ.లక్షల్లో పందేలు కాసి చివరకు చేతులు కాల్చుకుని తనకున్న ఎకరం పొలాన్ని అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించాడు. డెల్టాప్రాంతంలో కోడిపందేల రాయుళ్ల ఆస్తులు తనఖాలు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. భీమవరం కేంద్రంగా ఈ దందా నడుస్తోందనేది బహిరంగ రహస్యం. కాగా, కోడి పందేల ముసుగులో దొంగనోట్ల చలామణీ కూడా విచ్చలవిడిగా సాగుతుంది. -
దర్శనానికి వెళ్తున్నామని.. అదృశ్యమయ్యారు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. మూడురోజులుగా ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకులో 9వ తరగతి, ఇంటర్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ద్వారకా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు.. బంధువులు, స్నేహితులను విచారించారు. ఎక్కడా వారి జాడ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయిలు ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లారా లేక ఎవరైనా వారిని ట్రాప్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
దర్శనానికి వెళ్తున్నామని.. అదృశ్యమయ్యారు
-
సీసీ కెమెరాకు చిక్కిన ఇంజక్షన్ సైకో
ఏలూరు : ఉభయగోదావరి జిల్లాల పోలీసులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇంజక్షన్ సైకో కేసులో పురోగతి కనిపిస్తోంది. తమ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇంజక్షన్ సైకోను గుర్తించామని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అంటున్నారు. బాధితులు పేర్కొన్న వివరాలను పోలిన ఓ వ్యక్తిని సీసీ కెమెరాలో గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ సహాయంతో ఇంజక్షన్ సైకో కోసం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంజక్షన్ సైకోను పట్టుకోవడం కోసం 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. 49 చెక్ పోస్టుల వద్ద గట్టి భద్రత ఏర్పాటుచేశారు. 400 మంది పోలీసులు సైకో జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇంజక్షన్ సైకో బ్లాక్ క్యాప్ ధరించి, బ్లాక్ హోండో షైన్ బైక్‌పై తిరుగుతున్నాడని జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. జిల్లాలోని భీమవరంలో పల్సర్ బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం నాడు వెంబడించి ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదిలాఉండగా, ఇంజక్షన్ సైకో తెలంగాణలోని హైదరాబాద్, నల్లగొండ జిల్లా కోదాడలలో కూడా సంచరిస్తున్నట్లు పలు కథనాలు వచ్చిన విషయం విదితమే. -
పశ్చిమగోదావరిలో వైఎస్ఆర్కు ఘన నివాళి
-
ఇందిరా ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళన
-
పశ్చిమగోదావరి వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కొత్తపల్లి
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తపల్లి సుబ్బారాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం పార్టీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన ఆళ్లనానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడిగా నియమించారు.