బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి
Published Thu, Mar 23 2017 10:16 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కుక్కునూరు: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం కమ్మరిగూడెం సమీపంలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కమ్మరిగూడెం (ముంపుగ్రామం) వద్ద బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్ నడుపుతున్న కొత్తగూడెం వాసి అక్కడికక్కడే మృతిచెందగా.. వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement