మూడు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి | THREE ROAD ACCIDENTS.. THREE PERSONS DEAD | Sakshi
Sakshi News home page

మూడు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

Published Wed, Dec 7 2016 12:35 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

THREE ROAD ACCIDENTS.. THREE PERSONS DEAD

నరసాపురం :  పట్టణంలోని పీచుపాలెం రోడ్డులో జరిగిన  ప్రమాదంలో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామానికి చెందిన పాల వ్యాపారి చిమిలి సూర్యనారాయణ(45) మృతి చెందాడు.  టౌ¯ŒS ఎస్సై కె.చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. సూర్యనారాయణ ప్రతిరోజూ పాలను పట్టణానికి తీసుకొచ్చి అమ్ముతాడు. మంగళవారం తెల్లవారు జామునే పట్టణానికి వచ్చిన ఆయన, పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై పాల క్యాన్లు కట్టుకుని పంజాసెంటర్‌వైపు వెళ్తుండగా, చర్చి దాటగానే  వెనుక నుంచి మేకల లోడుతో వచ్చిన వ్యా¯ŒS ఢీకొట్టింది. కిందపడిపోయిన సూర్యనారాయణ, తలమీద నుంచి వ్యా¯ŒS వెనుక చక్రం ఎక్కేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. సీఐ పి.రామచంద్రరావు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు.  వ్యా¯ŒS డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుని బంధువులు కొద్దిసేపు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. వ్యా¯ŒS డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని,  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సూర్యనారాయణ మృతితో వారు దిక్కులేనివారయ్యారు. 
 
దూబచర్ల వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌..
ఏలూరు అర్బ¯ŒS : దూబచర్ల వద్ద మంగళవారం జరిగిన  రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించాడు. గోపాలపురం మండలం చెరుకుమిల్లి గ్రామానికి చెందిన పి.కృష్ణ (40) వృత్తిరీత్యా ట్రాక్టర్‌ డ్రైవర్‌. భార్యాపిల్ల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను మంగళవారం గ్రామం నుంచి ట్రాక్టర్‌లో చెరుకు లోడు వేసుకుని భీమడోలు వెళ్తుండగా, దూబచర్ల సమీపంలో టైర్‌ పంక్చర్‌ కావడంతో కృష్ణ ట్రాక్టర్‌ దిగి చక్రాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ సమయంలో అటుగా వచ్చిన లారీ అతడిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు.  108 సిబ్బ ంది బాధితుని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. పరీక్షించిన వైద్యులు కృష్ణ అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు.
 
దొంగరావిపాలెం వద్ద మరొకరు.. 
దొంగరావిపాలెం(పెనుగొండ): దొంగరావిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందాడు. పెనుగొండ ఎస్సై బీవై కిరణ్‌ కుమార్‌ కథనం ప్రకారం  దొంగరావిపాలెం శివారున జాతీయ రహదారిలో సోమవారం రాత్రి మోటార్‌ సైకిల్‌  ప్రక్కనే కొనఊపిరితో పడిఉన్న కోన శ్రీనివాస్‌(42)ను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచాడు.  మోటా ర్‌సైకిల్‌ దెబ్బతినకపోవడం, మరో వాహ నం ఢీకొన్న ఆనవాలు లేకపోవడంతో, మృతుడు బైక్‌పై నుంచి జారి పడి గాయపడి మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement