చెత్త కుప్పలో నవజాత శిశువు
Published Sat, Jun 4 2016 9:26 PM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM
ఉండి(పశ్చిమగోదావరి): మానవత్వాన్ని మరచిన మనుషులు అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్త కుప్పలో వదిలివెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాండువ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామంలోని క్రిస్టియన్ పేటలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును చెత్త కుప్పలో వదిలివెళ్లారు. చిన్నారి ఏడుపు వినిపిస్తుండటం గమనించిన స్థానికులు ఆ శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement