
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పసికందును పూడ్చిపెట్టడానికి ఒడిగట్టారు తల్లిదండ్రులు. తణుకు సాయి హాస్పిటల్‌లో 28వ తేదీ ఉదయం 10: 30ని.లకు సంధ్యా కుమారి అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తలలో ప్రాబ్లమ్ కారణంగా చనిపోయే అవకాశం ఉందని బావించిన తల్లిదండ్రులు.. ఆ శిశువును బతికుండగానే పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు.
బిడ్డను తాడేపల్లిగూడెం శ్మశానంలో పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా బిడ్డ అరుపులతో కాటికాపరి అలర్ట్ అయ్యాడు. దాంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు కాటికాపరి, బిడ్డను పూడ్చి పెట్టేందకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పారిపోగా, మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments
Please login to add a commentAdd a comment