
పెరవలి : మద్యం మత్తులో ఘర్షణ పడి కన్న కొడుకునే తండ్రి హతమార్చిన ఘటన పెరవలి మండలం అన్నవరప్పాడు సెంటర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. అన్నవరప్పాడు గ్రామానికి చెం దిన వసంతాడ కాశీ, చంద్రయ్య (35) తండ్రీకొడుకులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అన్నవరప్పాడు సెంటర్ నుంచి ఇంటికి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం తాగి ఉండటంతో ఘర్షణ పెరిగింది.
చంద్రయ్య తం డ్రి గొంతు పట్టుకోవడంతో కాశీ కొడవలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాశీ భుజంపై ఉన్న రుమాలు తీసుకుని చంద్రయ్య గొంతునులిమి హత్యచేశాడు. చంద్రయ్య శరీరంపై ఉన్న లుంగీ, చొక్కా తీసి మృతదేహంపై చెత్త వేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి సెంటరులోకి వచ్చి తన కొడుకుని తానే చంపానని చెప్పడంతో స్థానికులు భయపడ్డారు. పెరవలి పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహా లు ఉండటంతో వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కూలీ పనులు చేసుకునే కాశీకి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.