రాట్నాలమ్మ సన్నిధిలో సింధు | PV sindhu in ratnalamma temple in west godavari | Sakshi
Sakshi News home page

రాట్నాలమ్మ సన్నిధిలో సింధు

Published Mon, Oct 2 2017 2:47 PM | Last Updated on Mon, Oct 2 2017 2:47 PM

PV sindhu in ratnalamma temple in west godavari

సింధును సత్కరిస్తున్న అర్చకులు

పశ్చిమగోదావరి , పెదవేగి రూరల్‌:  రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మను బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సింధుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థాన చైర్మన్‌ రాయల విజయభాస్కరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సింధును సత్కరించారు.  అనంతరం సింధు మాట్లాడుతూ రాట్నాలమ్మ దయ వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీధర్‌ సుబ్రహ్మణ్యం, పి.వి.సింధు తండ్రి రమణ, ఆమె కుటుంబ సభ్యులు, కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement