
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ శరవేగంగా దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ జోరుకు టీడీపీ కొట్టుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు, ఈవీఎంల లెక్కింపులో మొదటి దశలో విజయం దిశగా పయనిస్తోంది.
రాష్ట్రంలో శ్రీకాకుళం, కడప, విజయనగరం, వైజాగ్ తదితర జిల్లాల్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బోణీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం, పాలకొల్లు చింతలపూడి తదితర 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం తదితర 10 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయ బావుటా ఎగురవేసేందుకు సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment