ఉరి తాడుగా మారిన ఉయ్యాల | Kid Deceased In Home West Godavari | Sakshi
Sakshi News home page

ఉరి తాడుగా మారిన ఉయ్యాల

Apr 21 2021 10:45 AM | Updated on Apr 21 2021 2:08 PM

Kid Deceased In  Home West Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అశ్వరావుపేట: అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ, తమ్ముడిని నవ్విస్తూ ఉన్న ఆ చిన్నారి.. తల్లి కాసేపు ఇంట్లోకి వెళ్లొచ్చేసరికే ఉయ్యాల చీర మెడకు చుట్టుకుని ఊపిరాడక మృత్యువాతకు గురైన విషాదకర సంఘటన అశ్వారావుపేటలో మంగళవారం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన రవికుమార్‌ కొంతకాలంగా అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక వీధిలో నివాసం ఉంటూ, స్థానిక యూనియన్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇతడికి భార్య నందిని, ఇద్దరు మగ సంతానం ఉన్నారు.

మంగళవారం మధ్యాహ్నం తల్లి నందిని చిన్నారులకు అన్నం తినిపిస్తుండగా, అదే సమయంలో పెద్ద కుమారుడు సాహెత్‌ (6) చీరతో కట్టిన ఉయ్యాలతో ఆడుకుంటున్నాడు. మంచినీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్లిన సమయంలో ఆడుకుంటున్న సాహెత్‌ మెడకు చీర బిగుసుకుపోయి ఊపిరి ఆడలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చే సరికి కొన ఊపిరితో వేలాడుతున్న సాహెత్‌ను చూసి మెడకు బిగుసుకుపోయిన చీరను తొలగించి, స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అంతసేపు ఆడుకుంటున్న బిడ్డ అంతలోనే కన్నుమూశాడనే చేదు నిజాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

( చదవండి: ఉద్యోగం పోతుందనే భయంతో..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement