తణుకు రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో మోటారు సైకిళ్లు
తణుకు: సార్.. నేను షాపింగ్‌మాల్‌కు వెళ్లి వచ్చేసరికి నా బైక్ మాయమైంది.. పార్కింగ్ ప్రాంతంలో ఉంచిన మోటారుసైకిల్ లోనికి వెళ్లి వచ్చేంతలోనే కనపడకుండా పోయింది.. బ్యాంకులోకి అలా వెళ్లి వచ్చేసరికి ఎవరో నా మోటారుసైకిల్ ఎత్తుకెళ్లారు.. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఆయా పోలీస్‌స్టేషన్లలో పెరిగిపోయాయి. తణుకు సర్కిల్ పరిధి లో నెలకు 10 నుంచి 15 మోటారు సైకిళ్లు చోరీకు గురవుతున్నట్టు అంచనా. పోలీసు సిబ్బంది సైతం వాహనాల చోరీ ఉదంతాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. దీం తో మోటారుసైకిళ్లు చోరీ చేసే అగంతకులు రెచ్చిపోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో వాహనాలను అగంతకులు దొంగిలించుకుపోతున్నారు.
అసలేమవుతున్నాయ్..?
తణుకు సర్కిల్ పరిధిలో అపహరణకు గురవుతున్న వాహనాల్లో 30 శాతం వ రకు పోలీసులు రికవరీ చేస్తున్నారు. మో టారు సైకిళ్లను అపహరించే వ్యక్తులు వా టిని లభించిన ధరకు తెగనమ్మేస్తున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలు స్తోంది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలను పట్టణంలోని కొందరు సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేస్తున్న వారు కొనుగోలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి జిల్లాలు దాటిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని వాహనాలను పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తులు కొనుగోలు చేసి ఆయా భాగాలను విడదీసి మరమ్మతులు చేసే షాపుల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం.
పార్కింగ్ ప్రదేశాల్లో రక్షణ ఏదీ..?
కార్యాలయాలకు, షాపింగ్‌కు వచ్చే వినియోగదారులే తమ వాహనాలపై నిఘా ఉంచాల్సిన పరిస్థితి. పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో రుసుం తీసుకుని వాహనాలకు భద్రత కల్పిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో అం టే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక మా ర్కెట్, హోటళ్లు వంటి ప్రాంతాల్లో ఇలాం టి ఏర్పాట్లు లేవు. ముఖ్యంగా కల్యాణ మండపాలు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ఇక్కడ మోటారుసైకిళ్లు తరచూ చోరీకు గురవుతున్నాయి.
అపార్టుమెం ట్లలో కార్యాలయాల నుంచి రూ.వేలు ని ర్వహణ ఖర్చులను వసూలు చేస్తున్నారు. అయినా కాపలా సిబ్బందిని మాత్రం అన్నిచోట్ల నియమించడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన వాహనాలు చోరీకు గురికావడం, వాటి యాజమానులు పో లీసులకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యా పారాలు చేసే కొన్ని మద్యం దుకాణాలు, బార్లు ముందు వాహనాల రక్షణకు సిబ్బందిని నియమించకపోవడంతో తర చూ వాహనాల చోరీ ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. చాలా సందర్భాల్లో కేసులు నమోదు చేయడానికి నిరాకరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు.
ఇలా చేయాలి..
అనివార్య పరిస్థితుల్లో ఆరుబయట, రోడ్ల వెంబడి, వ్యాపార ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనానికి అందించే తాళాలు కొన్నాళ్లకు అరిగిపోతాయి. ఆటో మొబైల్ షాపుల్లో రూ.150 నుంచి రూ.300 వెచ్చిస్తే వెనుక చక్రానికి తాళం వేయడానికి వీలుగా ప్రత్యేక తాళం ఇస్తారని, వీటిని వేస్తే కొంత మేర భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఇళ్ల బయట పార్కింగ్ చేసేవారు కిటికీలకు గట్టి ఇనుప గొలుసుతో వాహనానికి లాక్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. వాహనాలకు బీమా ఉండటం వల్ల ఫిర్యాదు చేసిన మూడు నెలల వరకు వాహనం దొరక్కపోతే ఆయా సం స్థల నుంచి బీమాను పొందవచ్చని, ఇందుకు సంబంధిత పోలీసుస్టేషన్ల నుంచి చివరి నివేదిక తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
నిఘా ఉంచాం
ఇటీవల కాలంలో మోటారుసైకిళ్లు చోరీకు గురవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాం. వాహనదారులు సైతం వాహనంతోపాటు వచ్చే తాళంతోపాటు మరొకటి కూ డా బైకులకు తప్పకుండా వేసుకో వాలి. అపార్టుమెంట్ నిర్వాహకులు విధిగా కాపలా సిబ్బందిని నియమించుకోవాలి. వాహనదారులు సైతం స్వయంగా ప్రత్యేక నిఘా ఉంచుకోవాలి.
– కేఏ స్వామి, సీఐ తణుకు
Comments
Please login to add a commentAdd a comment