బాబు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు | BJP Leader Somu Veerraju Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు

Published Fri, Oct 5 2018 7:13 PM | Last Updated on Fri, Oct 5 2018 7:13 PM

BJP Leader Somu Veerraju Comments On Chandrababu - Sakshi

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. బినామీలతో అక్రమ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అవినీతి సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుని పోతుందని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్‌తోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుతో చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అవినీతి కంపని విమర్శించారు. రూ.13వేల కోట్లు చెరువల్లో మట్టి తవ్వటానికి ఖర్చు పేరిట దోపిడీ చేశారని ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి అయిన ఖర్చు రూ.6500 కోట్లుగానే చూపుతున్నారని అన్నారు. సీవీపీతో విచారణ జరిగితే కొందరు మంత్రులు రాజీనామా చేయాల్సిందేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement