మదనపల్లె/ బి.కొత్తకోట: కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఇచ్చినా చంద్రబాబు రాజ«దాని నిర్మించకపోగా, రైతులను నడిరోడ్డు మీద పడేశాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ, బి.కొత్తకోట మండలం అమరనారాయణపురంలో తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో జరిగిన సమావేశంలోనూ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆనాడు చంద్రబాబు అమరావతిలో సగం నిర్మాణాలు చేసి ఉన్నా ఈరోజు రాజధాని ప్రసక్తే ఉండేది కాదన్నారు. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి పెరిగిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రత్యేక అజెండాతోనే పార్టీ మారుతున్నారన్నారు.
జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, ఈ విషయాన్ని పవన్‌కళ్యాణ్ స్వయంగా ధృవీకరించారని తెలిపారు. కమ్యూనిస్టులు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వసూలు చేసే సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీలను ఓడించాలన్నారు.
పదివేల కోట్లు ఇచ్చినా బాబు రాజధాని కట్టలేదు
Published Sat, Feb 25 2023 4:36 AM | Last Updated on Sat, Feb 25 2023 4:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment