
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవసేవే మాధవసేవ అనేది బీజేపీ నేతలకు తెలియదా?. పేదలకు సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్టే అవుతుందని బీజేపీ నేతలు తెలుసుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, వెల్లంపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం బీజేపీ మానుకోవాలి. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూలిస్తే బీజేపీ ఏం చేశారు?. చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్మిర్తిస్తున్నాం. బీజేపీ మత రాజకీయాలు ఏపీలో చెల్లవు. శివాలయాల వద్ద బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మరు అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.