![Villagers Protest Against Police On Ysrcp Social Media Activist Arrested](/styles/webp/s3/article_images/2024/11/7/Ysrcp-Social-Media-Activist.jpg.webp?itok=wzZaxSzt)
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త వీరబాత్తుల చంద్ర శేఖర్‌ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/04_12.jpg)
ఈ అక్రమ అరెస్ట్‌తో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు , గ్రామస్తులు పోలీసులుతో సంప్రదింపులు జరిపారు. అయితే చంద్రశేఖర్ గురించి తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కోపోద్రికులైన గ్రామ ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఏడీబీ రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలతో దిగివచ్చిన పోలీసులు చంద్రశేఖర్ గురించి విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/3_19.png)
Comments
Please login to add a commentAdd a comment