
వెంకటలక్ష్మిమృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ భీమడోలు నాయక్
ద్వారకాతిరుమల: ఎలక్ట్రికల్ హీటర్‌తో వేడినీటిని కాస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని సీహెచ్.పోతేపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
గ్రామానికి చెందిన తుపాకుల వెంకటలక్ష్మి (39), భర్త వెంకన్నబాబు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇదిలా ఉంటే వెంకటలక్ష్మి రోజులానే ఇంట్లో ఎలక్ట్రికల్ హీటర్‌తో ఒక స్టీలు బిందెలో నీటిని కాస్తోంది.
అయితే ప్రమాదవశాత్తు ఆమె కాలు బిందెకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానిక వైద్యులతో పరీక్ష చేయించగా, ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
సంఘటనా స్థలాన్ని భీమడోలు సీఐ బి.నాగేశ్వర్‌నాయక్, దెందులూరు ఎస్సై శంకర్‌లు పరిశీలించారు. దీనిపై కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment