శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన వివాహిత పడ్డ దీప (28) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరి సింగుపురం గ్రామానికి చెందిన దీపతో ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పడ్డ గోవిందరావుతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. దీపకు కడుపు నొప్పి రావడంతో బాధ భరించలేక సంక్రాంతి నాడు ఇంటి వద్ద ఉన్న పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీపకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఎస్సై వై.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment