
కీర్తి పద్మావతి మృతదేహం
పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన పిళ్లా కీర్తి పద్మావతి(19)ని బక్కన్నపాలెం ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన మహేష్‌కు ఇచ్చి సుమారు 7 నెలల కిందట వివాహం చేశారు. ఆమె కడుపు నొప్పి, నడుము నొప్పితో దీర్ఘకాలంగా బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో వారందరూ దిగువ పోర్షన్‌లోని గదులలో నిద్రపోతుండగా పై అంతస్తులో నిర్మించిన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.