
భర్త వెంకటేష్‌తో పద్మావతి, కుమార్తె నిహస్వి (ఫైల్)
ఓడీ చెరువు (సత్యసాయి): పుట్టింటికి పంపలేదనే మనస్తాపంతో బిడ్డతో సహా బావిలోకి దూకిన వివాహిత కథ విషాదాంతమైంది. శుక్రవారమే చిన్నారి మృతదేహం లభ్యం కాగా, శనివారం తల్లి శవం బయటపడింది. వివరాలు.. అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్ భార్య పద్మావతి (26) రెండు రోజుల క్రితం తన మూడేళ్ల కుమార్తె నిహస్వి (3)తో కలిసి గ్రామ సమీపంలో ఉన్న బావిలో పడిన విషయం తెలిసిందే.
నీటిపై తేలాడుతున్న చిన్నారి మృతదేహాన్ని అదే రోజు బయటకు తీశారు. పద్మావతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మండల ఎస్‌ఐ రమణ, ఏఎస్‌ఐ కిషోర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులు రాత్రంతా బావిలోని నీటిని మోటారుతో తోడించారు. శనివారం ఉదయం తల్లి శవం బయటపడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చదవండి: (‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?)
Comments
Please login to add a commentAdd a comment