well drown
-
Sri Sathya Sai: పద్మావతి కథ విషాదాంతం
ఓడీ చెరువు (సత్యసాయి): పుట్టింటికి పంపలేదనే మనస్తాపంతో బిడ్డతో సహా బావిలోకి దూకిన వివాహిత కథ విషాదాంతమైంది. శుక్రవారమే చిన్నారి మృతదేహం లభ్యం కాగా, శనివారం తల్లి శవం బయటపడింది. వివరాలు.. అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్ భార్య పద్మావతి (26) రెండు రోజుల క్రితం తన మూడేళ్ల కుమార్తె నిహస్వి (3)తో కలిసి గ్రామ సమీపంలో ఉన్న బావిలో పడిన విషయం తెలిసిందే. నీటిపై తేలాడుతున్న చిన్నారి మృతదేహాన్ని అదే రోజు బయటకు తీశారు. పద్మావతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మండల ఎస్ఐ రమణ, ఏఎస్ఐ కిషోర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులు రాత్రంతా బావిలోని నీటిని మోటారుతో తోడించారు. శనివారం ఉదయం తల్లి శవం బయటపడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: (‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?) -
బావిలో పడిపోయిన క్రేన్
సాక్షి, హుస్నాబాద్: పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన యత్నం వారి ప్రాణాలనే హరించింది. బావిలో పనిచేస్తుండగా క్రేన్ మీద పడటంతో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. లావుడ్య దేవోజీ, ఇస్లావత్ దుర్గా బావ, బావమరుదులు. ఇద్దరికీ కలిపి పక్కపక్కనే మూడున్నర ఎకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇటీవల పెరిగిన ఎండలకు బావిలో నీరు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు నీటి కోసం బావిని మరింత లోతుగా తవ్వేందుకు క్రేన్‌ను కిరాయికి తెచ్చుకున్నారు. కూలీలను పెట్టుకునే స్తోమత లేకపోవడంతో దేవోజీ భార్య చాంది (45), కుమారుడు సాయికుమార్, తన సోదరుడు లావుడ్య బీమా (50), బంధువులు ఇస్లావత్ ఎంక్యా, లావుడ్య సరోజనను సాయంగా రప్పించుకున్నారు. 15 రోజుల నుంచి బావిలో బండరాళ్లను తొలిచే పనులు చేస్తున్నారు. గురువారం రాళ్లను తవ్వేందుకు దేవోజీ, బీమా, ఎంక్యా బావిలోకి దిగారు. పైన క్రేన్ ఆపరేటర్‌కు సాయంగా దుర్గా, చాంది, సాయికుమార్, సరోజన ఉన్నారు. క్రేన్ డబ్బాలో పెద్ద బండరాయి వేసి బయటకుతీసే యత్నంలో పైభాగంలో క్రేన్‌పై అందరూ నిలుచొని బరువును సరిచూశారు. అనంతరం బండరాయిని క్రేన్ ద్వారా పైకి తెచ్చిన తర్వాత దాన్ని పక్కకుతోసే సమయంలో క్రేన్‌పై నిలబడిన చాంది కిందికి దిగింది. దీంతో బరువు అంచనా తప్పి క్రేన్ మొత్తం బావిలో పడిపోయింది. చాంది క్రేన్‌తో సహా బావిలోపడి ప్రాణాలు కోల్పోయింది. బావిలో పనిచేస్తున్న వారిపై ఒక్కసారిగా క్రేన్ పడటంతో బీమా అక్కడికక్కడే మరణించగా ఎంక్యాకు తీవ్ర గాయాలయ్యాయి. బావిపైన ఉన్న వారు కేకలు వేయడంతో తండా నుంచి స్థానికులు వచ్చారు. తాళ్ల సాయంతో బావిలో ఉన్న వారిని బయటకు తీసి 108 వాహనం ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఇస్లావత్ ఎంక్యను వరంగల్ ఎంజీఎంకు తరలించగా, లావుడ్య సరోజనను కరీంనగర్ ఆస్పతికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో.. దేవుడా ఎంత ఘోరం!
‘అయ్యో.. దేవుడా! ఇంత ఘోరమా.. ముక్కుపచ్చలారని మా పిల్లలు ఐదుగురిని ఒకేసారి తీసుకునిపోతివా..’ అంటూ బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలచివేసింది. మల్దకల్మండలం నాగర్‌దొడ్డికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు చిన్నారులు సోమవారం సాయంత్రం ఆడుకుంటూ శివారులోని రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడి బావి గుంతలో పడి మృత్యువాత పడటంతో విషాదం అలుముకుంది. ఉదయం ఎంచక్కా స్కూలుకు వెళ్లొచ్చారు. సాయంత్రం కాసేపు రిజర్వాయర్ నీటిలో ఆడుకుందామని ఆవుతోపాటు వెళ్లడమే.. ఆ చిన్నారుల జీవితాలకు నిండునూరేళ్లు నిండేలా చేసింది. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్త బాబూ.. అంటూ చెప్పే తల్లిదండ్రులు ఊహించలేదు ఆ చిన్నారులకు కానరాని లోకాలు వెళ్తారని... మృత్యువు ఎప్పుడు ఏ విధంగా వెంటాడుతుందో చిన్నారులు పసిగట్టలేకపోయారు. అందరూ చిన్నపిల్లలు కావడంతో.. అప్రమత్తం కాలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరిని వరుసగా ఐదుగురిని నీటిగుంట మింగేసింది. ఈ దుర్ఘటన మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామాన్ని విషాదంలోకి నెట్టేసింది. బాధిత కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. మల్దకల్ (గద్వాల) : మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలోని బావి గుంతలో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృత్యువాత పడ్డారు. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన బాలికలు కాగా, మరో ఇద్దరు బాలికలు ఇతర కుటుంబాలకు చెందిన వారు. నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప, మాణిక్యమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో యుమున(12), చిన్నారి(11), వెంకటేశ్వరి (10) మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో చిన్నారి (8) మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన చిన్న కుర్వ వెంకటేష్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కవిత(11) మృతిచెందిన వారిలో ఉన్నారు. సరదానే ప్రాణాలమీదికొచ్చింది.. చిన్నారులంతా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఒంటిపూట బడులు కావడం, చిన్నారులంతా ఆటల్లో మునిగి తేలారు. ఈ క్రమంలో సాయంకాలం కావడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆవును దగ్గరలో ఉన్న పొలాల వద్ద మేపేందుకు తీసుకెళ్లారు. ఈ సంతోషమే వారిని మృత్యు ఒడిలోకి చేర్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంకాలం సుమారు 4.30గంటల ప్రాంతంలో ఆవుతో పాటు ఐదుగురు చిన్నారులు వెళ్లారు. చివరగా గంటన్నర వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులంతా కూడా దినసరి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకోగానే పిడుగులాంటి వార్త విని నిశ్చేష్టులయ్యారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చిన్నారులను పాఠశాలకు పంపించేవారు ఆ తల్లిదండ్రులు. నిరక్షరాస్యులైన కుటుంబాలకు అక్షర జ్యోతులను వెలిగిద్దామని బుడి బుడి అడుగులు వేసిన బాల్యానికి బావిగుంత మృత్యుపాశమవగా.. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. తాము ఇంటికి వెళ్లగానే ఏం తెచ్చావనే ప్రశ్నించే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో గుండెలు బాదుకొని రోదించారు. ఆ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఇక తోటి స్నేహితులు సైతం తమ స్నేహితులు లేరని తెలుసుకొని దీనస్థితికి చేరుకున్నారు. ప్రముఖుల పరామర్శ ఐదుగురు చిన్నారులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, ఎస్పీ లక్ష్మీనాయక్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, సర్పంచ్ బండ్ల జ్యోతి, డీఎస్పీ షాకీర్‌హుసేన్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబాలను ఆదుకుంటామని చిన్నారుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సంఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మల్దకల్ ఎస్ఐ కృష్ణ ఓబుల్‌రెడ్డి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆవుతోక పట్టుకొని వెళ్లి.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూలానే సోమవారం గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు వెళ్లారు. అందరూ కూడా ఇంచుమించు ఒకే వయస్సు గల చిన్నారులు కావడంతో కలిసి మెలిసి ఆడుకునేవారు. సాయంత్రం 5గంటల సమయంలో గ్రామ సమీపంలోని రిజర్వాయర్‌లోని ఆడుకునేందుకు బయల్దేరారు. అరకొర నీటిలో ఆడుకుంటూ ముందుకు సాగారు. అయితే కుమ్మరి ఎల్లప్పకు చెందిన ఆవును కూడా వారితో పాటే తీసుకెళ్లారు. అక్కడ లోతుగా ఉన్న పెద్ద గుంత ఉంది. అది గమనించని చిన్నారులు అలాగే ఆవుతో పాటు నీటిలో నడుస్తూ వెళ్లారు. ప్రమాదవశాత్తు ఐదుగురు చిన్నారులు పెద్ద గుంతలో పడిపోయారు. పడిన వెంటనే పెద్ద ఎత్తున కేకలు వేసినా చుట్టు ప్రక్కల ఎవరూ లేకపోవడంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు. చిన్నారులకు ఈత రాకపోవడం, నీటిలో ఊపిరాడక మృతి చెందారు. తెలిసిందిలా.. ఇదిలాఉండగా, మృతిచెందిన చిన్నారి యమున తండ్రి ఫోన్ ఇంట్లో ఉండడంతో ఫోన్ కూడా తనతో పాటే తీసుకెళ్లింది. ఈ ఫోన్ ప్రమాదం జరిగిన నీటి గుంత ఒడ్డుపైనే ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రైతు కుమ్మరి ఎల్లప్పకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికీ ఎత్తకపోవడంతో ఆ రైతు ఇంటివద్దకు వెళ్లి ఫోన్ ఎత్తడం లేదని ప్రశ్నించాడు. ఫోన్ తన వద్ద లేదని వివరించాడు. అయితే మీ ఆవు వ్యవసాయ పొలం వద్ద ఉందని, మీ పిల్లలు ఎక్కడున్నారనే మాట కలిపాడు. దీంతో హుటాహుటిన ఆవుతో పాటే పిల్లలు వెళ్లారని గ్రహించి అక్కడికి చేరుకున్నారు. ఫోన్ ఒడ్డుపైనే ఉండటం చూసి ఖంగుతిన్నారు. అటూ ఇటూ వెతకసాగారు. ఒకవేళ గుంతలో పడ్డారేమోనన్న అనుమానంతో గుంతలోకి దిగి వెతకగా చిన్నారుల మృతదేహాలు ఒక్కొక్కటికి బయట పడ్డాయి. అయితే కవిత మృతదేహం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇక మరోసారి స్థానికుల సాయంతో వెతకగా రాత్రి 8గంటల ప్రాంతంలో కవిత మృతదేహం లభ్యమైంది. -
ప్రాణం తీసిన బావి
ధర్మపురి: పొలానికి నీరందించేందుకు వెళ్లిన దొనకంటి రాజశేఖర్(23) ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి చనిపోయాడు. ఈ ఘటన ధర్మపురి మండలం నక్కలపేటలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నక్కలపేటకు చెందిన దొన కంటి రాజశేఖర్ డిగ్రీ చదివాడు. ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. సోమవారం జరిగిన సర్పంచు ఎన్నికల్లో తొలిసారి ఓటువేశాడు. మంగళవారం ఉదయం తండ్రి లస్మయ్యతో కలిసి గ్రామ సమీపంలోని తమ పొలానికి నీరందించేందుకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి విద్యుత్‌సరఫరా లేకపోవడంతో తండ్రి లస్మయ్య ఇంటికి వెళ్లాడు. రాజశేఖర్ అక్కడే ఉన్నాడు. కాసేపటికి విద్యుత్ వచ్చిందో.. రాలేదో చూద్దామని వ్యవసాయమోటారు స్టార్టర్ వద్దకు వెళ్లాడు. పరిశీలిస్తుండగా కాలుజారి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. కాసేపటికి సమీప బంధువైన రాకేశ్ అక్కడికి చేరుకున్నాడు. బావిలోకి చూడగా రాజశేఖర్ చెప్పులు తేలియాడుతూ కనిపించాయి. అనుమానం వచ్చి ఇంటికి ఫోన్ చేశాడు. పొలం వద్దకు వెళ్లాడని మృతుడి తల్లిదండ్రులు చెప్పడంతో రాకేశ్ చుట్టుపక్కలా వెతికాడు. ఎక్కడా కానరాకపోవడంతో స్నేహితుల సాయంతో వ్యవసాయబావిలో వెతికారు. అప్పటికే రాజశేఖర్ నీళ్లుమింగి చనిపోయాడు. మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. రాజశేఖర్ తల్లిదండ్రులు బావివద్దకు చేరుకుని కొడుకు మృతదేహం వద్ద బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తండ్రి లస్మయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
అమరచింత (కొత్తకోట) : వేసవి తాపాన్ని భరించకలేక ఉపశమనం కోసం వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మూర్చరోగం రావడంతో మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని నాగల్కడ్మూల్లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందమ్మ కుమారుడు మాదాసి కుర్వ రాజు(18) శనివారం మధ్యాహ్నం గ్రామంలోని జోగు శంకర్‌కు చెందిన వ్యవసాయ బావిలో స్నానం చేయడానికి బయల్దేరాడు. బావిలో ఈతపడి బావినుంచి బయటికి వస్తున్న సమయంలో మూర్చరోగం రావడంతో తిరిగి బావిలోనే జారిపడ్డాడు. సమీపంలో ఉన్న వారు ఈ విషయాన్ని గమనించి కాపాడే ప్రయత్నం చేసేలోపే బావిలో మునిగిపోయాడు. ఈ విషయమై అమరచింత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బావిలోంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శుభకార్యానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
బత్తలపల్లి : రోడ్డుపక్కనున్న బావిలో ఈతకొట్టేందుకు పైనుంచి దూకిన టైల్స్‌వర్కర్ కడుపుభాగంలో బలమైన దెబ్బతగిలి నీటమునిగి మృతిచెందాడు. ఈదులముష్టూరులో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులతోపాటు ఎస్ఐ హారున్‌బాషా తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డుకు చెందిన టైల్స్‌వర్కర్ బలిజ వన్నూరుస్వామి (25) తన స్నేహితులు రాము, అనిల్, శేఖర్‌తో కలిసి బంధువుల గృహప్రవేశం కోసం శుక్రవారం ఆటోలో ధర్మవరం వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగుపయనమయ్యారు. బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలోని వ్యవసాయ బావి వద్ద కొందరు చిన్నారులు ఈత కొడుతుండడం గమనించారు. ఎండలకు ఉక్కపోతగా ఉండటంతో ఆటోను పక్కన ఆపి ఈతకొట్టేందుకు వెళ్లారు. బావిలో నీరు బాగా ఉండటంతో వన్నూరుస్వామి రెండుసార్లు పై భాగం నుంచి నీళ్లలోకి దూకాడు. మూడోసారి నీటిలోకి దూకినపుడు కడుపుభాగంలో దెబ్బతగిలింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు నీటి అడుగుభాగంలో గాలించి అతడిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఊపిరాడక వన్నూరుస్వామి మృతిచెందాడు. తహసీల్దార్ సురేష్‌బాబు, ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అన్నను కాపాడి ... తమ్ముడు మృతి
మహబూబ్‌నగర్ : బావిలో పడిన అన్నయ్యను రక్షించి ఓ తమ్ముడు మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివసిస్తున్న మల్లేష్ (15), గోపాల్ (18) అన్నదమ్ములు, గొర్రెల కాపరులుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ రోజు గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నారు. ఆ క్రమంలో గోపాలుకు తీవ్ర దాహం వేసింది. సమీపంలోని బావిలోకి మెట్ల ద్వారా దిగాడు. నీళ్లు తాగుతుండగా... కాలు జారీ నీళ్లలో పడ్డాడు. బావి లోతుగా ఉండటంతో గోపాలు నీట మునిగాడు. ఆ విషయాన్ని గమనించిన తమ్ముడు మల్లేష్ బావిలోకి దిగి.. అన్నయ్య గోపాల్‌ను రక్షించి మెట్ల మీదకు చేర్చాడు. కానీ మల్లేష్ మాత్రం నీట మునిగి మరణించాడు.