అన్నను కాపాడి ... తమ్ముడు మృతి | Gopal saved to mallesh but mallesh died | Sakshi
Sakshi News home page

అన్నను కాపాడి ... తమ్ముడు మృతి

Published Fri, Oct 2 2015 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

Gopal saved to mallesh but mallesh died

మహబూబ్నగర్ : బావిలో పడిన అన్నయ్యను రక్షించి ఓ తమ్ముడు మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది.   వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివసిస్తున్న మల్లేష్ (15), గోపాల్ (18)  అన్నదమ్ములు, గొర్రెల కాపరులుగా జీవనం సాగిస్తున్నారు.

అయితే ఈ రోజు గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నారు. ఆ క్రమంలో గోపాలుకు తీవ్ర దాహం వేసింది. సమీపంలోని బావిలోకి మెట్ల ద్వారా దిగాడు. నీళ్లు తాగుతుండగా... కాలు జారీ నీళ్లలో పడ్డాడు. బావి లోతుగా ఉండటంతో గోపాలు నీట మునిగాడు. ఆ విషయాన్ని గమనించిన తమ్ముడు మల్లేష్ బావిలోకి దిగి.. అన్నయ్య గోపాల్ను రక్షించి మెట్ల మీదకు చేర్చాడు. కానీ మల్లేష్ మాత్రం నీట మునిగి మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement