వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్‌గా ఉన్నందునే మాధవరావు తండ్రి మల్లేష్ పై దాడి
4 రోజులుగా విశాఖ కేజీహెచ్‌లో మృత్యువుతో పోరాటం
ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యే: ఎమ్మెల్సీ దువ్వాడ
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్‌గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు.
అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్‌లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్‌పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ తరఫున బూత్ ఏజెంట్‌గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు.
మల్లేష్ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్‌తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment