ప్రాణం తీసిన ఈత సరదా | Students Drown To Death In Kothakota | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Published Sun, May 6 2018 7:17 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Students Drown To Death In Kothakota - Sakshi

రాజు మృతదేహం

అమరచింత (కొత్తకోట) : వేసవి తాపాన్ని భరించకలేక ఉపశమనం కోసం వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మూర్చరోగం రావడంతో మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని నాగల్‌కడ్మూల్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందమ్మ కుమారుడు మాదాసి కుర్వ రాజు(18)  శనివారం మధ్యాహ్నం గ్రామంలోని జోగు శంకర్‌కు చెందిన వ్యవసాయ బావిలో స్నానం చేయడానికి బయల్దేరాడు.

బావిలో ఈతపడి బావినుంచి బయటికి వస్తున్న సమయంలో మూర్చరోగం రావడంతో తిరిగి బావిలోనే జారిపడ్డాడు. సమీపంలో ఉన్న వారు ఈ విషయాన్ని గమనించి కాపాడే ప్రయత్నం చేసేలోపే బావిలో మునిగిపోయాడు. ఈ విషయమై అమరచింత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బావిలోంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement