
రోజ్ అలీ మృతదేహం
కొత్తకోట : మండల పరిధిలోని కానాయపల్లి సమీపంలో గల శంకరసముద్రం చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీటమునిగి మృతి చెందాడు. వివరాలిలా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్‌రాంపూర్ జిల్లా దులిరియా గ్రామానికి చెందిన రోజ్ హుస్సేన్‌గత 20 సంవత్సరాలుగా కొత్తకోటలో నివాసం ఉంటూ వీధి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. హుస్సేన్‌రాజ్ కుమారుడు రోజ్ అలీ (23) పట్టణంలో ఓ బైక్ మెకానిక్ షాపులో పని చేస్తుండేవాడు. గురువారం నాడు తన స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొడదామని కానాయపల్లి శంకరసముద్రం చెరువుకు వెళ్లాడు.
చెరువు కట్ట మరమ్మతు కోసం చెరువులో గుంతలు తీశారు. అది గమనించని వీరు చెరువులో దూకడంతో ఈత రాని రోజ్ అలీ బురరదలో ఇరుక్కుని మునిగిపోయాడు. కాసేపటి తర్వాత గమనించిన స్నేహితులు వెంటనే పక్క పొలాల్లోని రైతులకు తీసుకుని చెరువులో గాలించారు. అయినా మృతదేహం లభించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి మార్చూరికి తరలించినట్టు హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment