Kottakota
-
తల్లిలా శిక్షణ.. తండ్రిలా రక్షణ!
సాక్షి, బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): విద్య నేర్పిన గురువును శిష్యులు సేవించి తరించడం చూశాం.. విద్యార్థులకు శ్రద్ధగా విద్యా బుద్ధులు నేర్పిన గురువులనూ చూశాం.. కానీ, విద్యార్థులకు సొంత తండ్రిలా వారి ఆలనాపాలనా చేస్తున్న ఈ ప్రిన్సిపాల్ మాత్రం అందరికీ భిన్నం. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట సమీపంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ జీవీకే నాయుడు.. పాఠశాలలోని విద్యార్థుల్లో కొంతమందికి తరచూ ఈ ఫొటోలో ఉన్నట్లుగా తన స్వహస్తాలతో స్నానం చేయిస్తుంటారు. బయట వారికి ఇది కొత్తగా అనిపించినా ఇక్కడి పిల్లలకు మాత్రం ఇది మామూలే. తమ ఆలనాపాలన ఆయన దగ్గరుండి ఎంతో శ్రద్ధగా చూసుకుంటారని విద్యార్థులు చెబుతున్నారు. చదువుపట్ల పిల్లలు మరింత శ్రద్ధ కనబరిచేందుకే ఆయన వారితో మమేకమై ఇలా చేస్తుంటారని.. విద్యార్థులతో కలిసి నిద్రిస్తుంటారని సహోపాధ్యాయులు చెబుతున్నారు. అన్నట్టు.. ఈ ప్రిన్సిపాల్ సేవా భావాన్ని గుర్తించిన ప్రభుత్వం కూడా పలుమార్లు పురస్కారాలు అందించింది. తల్లిలా శిక్షణ.. తండ్రిలా రక్షణ అంటే ఇదే కదూ! -
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
సాక్షి, మహబూబ్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చి.. గుర్తుపట్టడానికి రాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కనిమెట్ట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గురువారం స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కనిమెట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన గల ఓ బ్రిడ్జి కింద దాదాపు 35 సంవత్సరాల వయ స్సు గల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారు. అనంతరం ఆనవాళ్లు దొరకుండా ఉండేందుకు శవం పై, వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పంటించా రు. అక్కడికి చేరుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం పక్కనే పడి ఉన్న టిఫిన్ బాక్సుపై నిందితుల వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలించగా.. కొంతదూరం వెళ్లి అక్కడే ఆగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఎస్పీ వెంట స్థానిక సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ రవికాంత్‌రావు, ట్రైనింగ్ ఎస్ఐ హరీష్, ఏఎస్ఐ రోశన్న హెడ్‌కానిస్టేబుల్ వేమారెడ్డి, కానిస్టేబుళ్లు మహేష్, వెంకట్‌రెడ్డి, యుగంధర్‌గౌడ్ తదితరులున్నారు. -
కానాయపల్లిలో..
కొత్తకోట : మండల పరిధిలోని కానాయపల్లి సమీపంలో గల శంకరసముద్రం చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీటమునిగి మృతి చెందాడు. వివరాలిలా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్రాంపూర్ జిల్లా దులిరియా గ్రామానికి చెందిన రోజ్ హుస్సేన్గత 20 సంవత్సరాలుగా కొత్తకోటలో నివాసం ఉంటూ వీధి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. హుస్సేన్రాజ్ కుమారుడు రోజ్ అలీ (23) పట్టణంలో ఓ బైక్ మెకానిక్ షాపులో పని చేస్తుండేవాడు. గురువారం నాడు తన స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొడదామని కానాయపల్లి శంకరసముద్రం చెరువుకు వెళ్లాడు. చెరువు కట్ట మరమ్మతు కోసం చెరువులో గుంతలు తీశారు. అది గమనించని వీరు చెరువులో దూకడంతో ఈత రాని రోజ్ అలీ బురరదలో ఇరుక్కుని మునిగిపోయాడు. కాసేపటి తర్వాత గమనించిన స్నేహితులు వెంటనే పక్క పొలాల్లోని రైతులకు తీసుకుని చెరువులో గాలించారు. అయినా మృతదేహం లభించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి మార్చూరికి తరలించినట్టు హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
కొత్తకోట : పెళ్లి నిశ్చయమైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కొత్తకోటలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తకోటకు చెందిన చంద్రయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె కృష్ణవేణి(20) స్థానికంగా ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. కాగా వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు (కృష్ణవేణి మేనమామ)తో ఈ నెల 10 వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కాని కృష్ణవేణి ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం గమనించిన కుటుంబీకులు కృష్ణవేణిని కిందకి దించి పరిశీలించగా అప్పటికే మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రవికాంత్‌రావు తెలిపారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
అమరచింత (కొత్తకోట) : వేసవి తాపాన్ని భరించకలేక ఉపశమనం కోసం వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మూర్చరోగం రావడంతో మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని నాగల్కడ్మూల్లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందమ్మ కుమారుడు మాదాసి కుర్వ రాజు(18) శనివారం మధ్యాహ్నం గ్రామంలోని జోగు శంకర్‌కు చెందిన వ్యవసాయ బావిలో స్నానం చేయడానికి బయల్దేరాడు. బావిలో ఈతపడి బావినుంచి బయటికి వస్తున్న సమయంలో మూర్చరోగం రావడంతో తిరిగి బావిలోనే జారిపడ్డాడు. సమీపంలో ఉన్న వారు ఈ విషయాన్ని గమనించి కాపాడే ప్రయత్నం చేసేలోపే బావిలో మునిగిపోయాడు. ఈ విషయమై అమరచింత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బావిలోంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళాసంఘాల పనితీరు భేష్!
కొత్తకోట : తెలంగాణలోని మహిళా సంఘాల పనితీరు బాగుంది.. ఆర్థిక లావాదేవీలు.. రుణాలతో ఉపాధి పొందుతూ సకాలంలో చెల్లించడం.. పొదుపు మంత్రం బాగుందని యూపీ అధికారుల బందం ఖితాబిచ్చింది. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో పర్యటించిన యూపీ అధికారులు మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వికలాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించింది. ఉత్తరప్రదేశ్ గ్రామీణ అభివద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బలరాంవర్మ, డిప్యూటీ కమిషనర్లు బాలగోవింద్ సుక్లా, బాలచందర్ త్రివేదీ, కరుణాపతీ మిశ్రా, ప్రేమ్చందర్లు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళల్లో చైతన్యం తక్కువగా ఉందని, అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువన్నారు. తెలంగాణలో మహిళలు ఆర్థికంగా మంచి ఎదుగుదల సాధించారని, ప్రతి నెల పొదుపు చేసుకుని వాటిని క్రమపద్ధతిలో అప్పులు ఇస్తూ తిరిగి బ్యాంకులకు చెల్లించడం బాగుందన్నారు. అనంతరం భీమా ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్‌ను వీరు తిరుమలాయ్యపల్లి వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో కొత్తకోట సర్పంచ్ బీసం చెన్నకేశవరెడ్డి, జెడ్పీటీసీ పీజే బాబు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. -
మహిళాసంఘాల పనితీరు భేష్!
కొత్తకోట : తెలంగాణలోని మహిళా సంఘాల పనితీరు బాగుంది.. ఆర్థిక లావాదేవీలు.. రుణాలతో ఉపాధి పొందుతూ సకాలంలో చెల్లించడం.. పొదుపు మంత్రం బాగుందని యూపీ అధికారుల బందం ఖితాబిచ్చింది. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో పర్యటించిన యూపీ అధికారులు మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వికలాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించింది. ఉత్తరప్రదేశ్ గ్రామీణ అభివద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బలరాంవర్మ, డిప్యూటీ కమిషనర్లు బాలగోవింద్ సుక్లా, బాలచందర్ త్రివేదీ, కరుణాపతీ మిశ్రా, ప్రేమ్చందర్లు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళల్లో చైతన్యం తక్కువగా ఉందని, అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువన్నారు. తెలంగాణలో మహిళలు ఆర్థికంగా మంచి ఎదుగుదల సాధించారని, ప్రతి నెల పొదుపు చేసుకుని వాటిని క్రమపద్ధతిలో అప్పులు ఇస్తూ తిరిగి బ్యాంకులకు చెల్లించడం బాగుందన్నారు. అనంతరం భీమా ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్‌ను వీరు తిరుమలాయ్యపల్లి వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో కొత్తకోట సర్పంచ్ బీసం చెన్నకేశవరెడ్డి, జెడ్పీటీసీ పీజే బాబు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి
కొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలోజరిగిన ప్రమాదంలో ఒకరు చని పోయారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొని వెంకన్న(30)అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
హైదరాబాద్ : తెలంగాణలోని రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం పెద్ద కల్వల వద్ద కారు ఢీకొని రాజమ్మ అనే మహిళ మృతి చెందింది. ఇక పెద్దపల్లి మండలం మూలాకాల గ్రామంలో కుటుంబ కలహాలతో వెంకటేశ్ అనే కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఆర్టీసీకి రూ.400 కోట్ల నష్టం
=రూ.100 కోట్లతో తిరుపతి బస్టాండ్ అభివృద్ధి =మౌలిక వసతుల కోసం ప్రయాణికులపై రూ.1 సెస్సు =2016 తర్వాతే కొత్త్తడిపోల ప్రారంభం =శబరిమలకు 354 ప్రత్యేక బస్సులు =నెల్లూరు జోన్ ఆర్టీసీ ఈడీ సూర్యప్రకాష్‌రావు వెల్లడి బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఇటీవల నెల్లూరు ఆర్టీసీజోన్ పరిధిలో రూ.400 కోట్ల మేర నష్టాలను భరించాల్సివచ్చిందని ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ సీ.సూర్యప్రకాష్‌రావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన బి.కొత్తకోటలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నెల్లూరుజోన్ పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని బస్సుల నిర్వహణ వల్ల రూ.100 కోట్ల మేర నష్టం, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో బస్సులు నడపకపోవడం వల్ల రూ.300 కోట్ల నష్టం వచ్చినట్టు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ప్రయాణికులపై రూ.1 సెస్సును విధించినట్టు చెప్పారు. ఇది పల్లెవెలుగు, సీటీ బస్సులకు మినహాయింపునిచ్చినట్టు ఆయన గుర్తుచేశారు. తమ పరిధిలో ఈ సెస్సుద్వారా నెలకు రూ.80 లక్షలు వసూలవుతోందని, ఈ మొత్తం ఏడాదికి రూ.8కోట్లవుతుం దని తెలిపారు. ఈ నిధులతో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యం కోసం నీటివసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, బల్లలను విస్తరించడం, అప్రోచ్‌రోడ్ల నిర్మాణంలాంటి చర్యలు చేపడతామన్నారు. 2014-15, 16 ఆర్థిక సంవత్సరాల్లో బస్టాండ్లకు మహర్దశకలగనుందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని మంగళం డిపో ప్రారంభమైందని, కొత్తగా చంద్రగిరి, కృష్ణపట్నం, ముత్తుకూరు, ఇంకోల్లు, ఒంగోలు-2, మన్నవరం డిపోలకు ప్రతిపాదనలు పంపామని తెలి పారు. ఇవి 2016లో మంజూరవుతాయని చెప్పారు. తిరుపతి బస్టాండ్‌ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేశామన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద జోన్‌కు కొత్తబస్సులొచ్చాయన్నారు. ఇందులో తిరుపతికి 120, చిత్తూరుకు 40, నెల్లూరుకు 50, ఒంగోలుకు 50 బస్సులు వచ్చినట్టు ఆయన వివరించారు. ఇవికాకుండా మరో 70 బస్సులు వచ్చాయని, ఇంకా 40 బస్సులు రావాల్సివుందని తెలిపారు. శబరిమల యాత్రకు 354 బస్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. తిరుపతి నుంచి 294, నెల్లూరు నుంచి 50, ఒంగోలు నుంచి 10 బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ మూడు జిల్లాల నుంచి కర్ణాటక, తమిళనాడుకు అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిపారు. తమిళనాడుతో సమావేశం జరగాల్సి ఉందన్నారు. 40 బస్సులు కర్ణాటకకు నడిపేందుకు అంగీకారం కుదిరిందని, చిత్తూరు నుంచి తమిళనాడుకు 100 బస్సులు నడిపేందుకు ఒప్పందం జరగాల్సివుందని చెప్పారు. ఆయన వెంట ఈఈ వెంకటరమణ, మదనపల్లె-1 డీఎం ప్రభాకర్ ఉన్నారు. -
ప్రాణాంతకంగా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం
వెంటాడుతున్న మృత్యువు =నగరం లోపల, వెలుపల ‘సిటీ’జన్లకు ప్రమాదాలు =ఆగి ఉన్న వాహనాలతో పొంచి ఉన్న పెనుముప్పు =ప్రాణాంతకంగా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం =పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమర్థంగా లేకే దుస్థితి బుధవారం... తెల్లవారుతూనే విషాద వార్తను మోసుకొచ్చింది. మంగళవారం ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆరుగురు మృత్యువాత పడిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ‘కొత్తకోట’ విషాదం తెలిసి నగరం ఉలిక్కిపడింది. ఆప్తులు, సన్నిహితుల సమాచారం కోసం సిటీజనులు ట్రావెల్ ఆఫీసు వద్దకు పరుగులు తీశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. సాక్షి, సిటీబ్యూరో : నగరవాసుల్ని గత కొన్నాళ్లుగా మృత్యువు వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా సైబరాబాద్, హైదరాబాద్‌ల్లోనే నమోదవుతున్నాయి. నగరవాసులు సిటీ లోపలా, వెలుపల రోడ్డు దుర్ఘటనల్లోనే అధికంగా మృత్యువాత పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలోనూ నగరానికి చెందిన వారు ఎక్కువగానే ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం సమర్థంగా లేకపోవడంతో ప్రజలు ప్రయాణాలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరం బయట జరుగుతున్న ప్రమాదాల్లో 90 శాతం వరకు ఒకే ప్రమాదంలో ఒకటి కంటే ఎక్కువగానే మృతులు, క్షతగాత్రులు అవుతున్నారు. సాధారణంగా సిటీ దాటి వెళ్లేవారు శుభకార్యానికో, దైవదర్శనానికో వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒంటరిగా కాకుండా కుటుంబంతోనో, బంధువులు, మిత్రులతో కలిసో వెళ్తుంటారు. సుదూర ప్రాంతాలైతే నిత్యం వెళ్లి, వచ్చే వాళ్లు అనేక మంది ఉంటారు. వీరికి అనువైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉండకపోవడంతో చాలావరకు ప్రైవేట్ ట్రావెల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా అంతా కలిసి ప్రయాణిస్తున్న సమయంలో అపశ్రుతులు చోటు చేసుకుంటే మృతులు, క్షతగాత్రులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నారు. కారణాలనేకం.. ఈ ప్రమాదాలకు ప్రధానంగా డ్రైవర్ల అవగాహ న లేమి, అలసటల్నే కారణంగా చెప్పుకోవచ్చు. వాహనచోదకులు సాధారణంగా నిత్యం సంచరించే ప్రాంతాల్లోని రహదారులపై అవగాహన ఏర్పరుచుకుంటారు. అక్కడి రోడ్డు స్థితిగతులు, మలుపులు, ప్రమాదకర ప్రాంతాలు తదితర భౌగోళిక అంశాలపై వీరికి అవగాహన ఉంటుంది. అయితే బయట ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ రహదారులు సైతం వీరికి పూర్తి కొత్త. ఈ నేపథ్యంలోనే మలుపుల్లో అదుపు తప్పడం, చెట్లను ఢీ కొట్టడం జరుగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు నిత్యం అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు. వీరికి అవసరమైన స్థాయిలో రెస్ట్ లేకపోవడం, తొందరగా గమ్యం చేరాలనే ఆత్రుత తదితరాలు సైతం ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ప్రయాణాలన్నీ ఎక్కువగా జాతీయ రహదారులపై సాగుతాయి. ఆయా ప్రాంతాల్లో ఆగి ఉంటున్న లారీలు ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. సుదీర్ఘ ప్ర యాణం నేపథ్యంలో బ్రేక్ డౌన్ అయిన వాహనాలు ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. వీటిని రోడ్డు పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేసుకోవడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు అలసిపోయిన డ్రైవర్లు ధాబాలు, రెస్ట్హౌస్ల సమీపంలో వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. వీటిని గమనించకుండా అతి వేగంగా వస్తున్న ప్రయాణికుల వాహనాలు, ఇతర లారీలు వెనుక, ముందు నుంచి ఢీ కొడుతున్నాయి. ఈ ఉదంతాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువగానే ఉంటోం ది. ఓవర్ టేకింగ్ సైతం ఇంకో ప్రమాద హేతువుగా ఉంది. నిబంధనలు బేఖాతర్ చేసి, రోడ్డు స్థితిగతులు పట్టించుకోకుండా దూసుకుపోతూ.. ముందున్న వాహనాల్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ.. ఎదురుగా వస్తున్న వాటిని ఢీ కొట్టిన సందర్భాలూ ఉంటున్నాయి. మచ్చుకు కొన్ని... తేదీ: 5.2.13 ప్రమాద ప్రాంతం: మెదక్ జిల్లా ఒంటి మామిడి ప్రయాణ కారణం: స్వస్థలానికి వెళ్లి వస్తూ.. ప్రమాద కారకం: పొగమంచు వల్ల లారీ ఢీ మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/ఒకరు ఎక్కడి వారు: ఖైరతాబాద్ తేదీ: 3.3.13 ప్రమాద ప్రాంతం: నిజామాబాద్ జిల్లా జక్కాన్పల్లి ప్రయాణ కారణం: విహార యాత్ర ప్రమాద కారకం: అదుపు తప్పి బోల్తా మృతులు/క్షతగాత్రులు: ఇద్దరు/ఒకరు ఎక్కడి వారు: ఎర్రగడ్డ తేదీ: 29.3.13 ప్రమాద ప్రాంతం: దేవరకద్ర ప్రయాణ కారణం: స్నేహితుల్ని కలిసి రావడం ప్రమాద కారకం: ఎదురుగా వస్తున్న లారీ ఢీ మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/0 ఎక్కడి వారు: శివరామ్‌పల్లి భవానీకాలనీ తేదీ: 1.5.13 ప్రమాద ప్రాంతం: మహారాష్ట్రలోని తుల్జాపూర్ ప్రయాణ కారణం: షిర్డీ వెళ్లి వస్తుండగా.. ప్రమాద కారకం: అదుపు తప్పి చెట్టుకు ఢీ మృతులు/క్షతగాత్రులు: ఇద్దరు/11 మంది ఎక్కడి వారు: కూకట్పల్లి ప్రకాష్‌నగర్ తేదీ: 2.5.13 ప్రమాద ప్రాంతం: నల్లగొండ జిల్లా ఇనుపాముల ప్రయాణ కారణం: సొంత ఇంటికి శంకుస్థాపన ప్రమాద కారకం: ఓవర్ టేక్ సమయంలో డివైడర్ ఢీ మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/నలుగురు ఎక్కడి వారు: నగరంలో స్థిరపడ్డారు తేదీ: 18.8.13 ప్రమాద ప్రాంతం: నందిగామ (కృష్ణా) ప్రయాణ కారణం: దైవదర్శనం ప్రమాద కారకం: ఓవర్ టేక్ చేస్తూ మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/ఇద్దరు ఎక్కడి వారు: అంబర్పేట్ -
వెళ్లొస్తాం.. అమ్మానాన్నల చివరి మాటలు
గుంటూరు : అమ్మా వెళ్లొస్తామంటూ.. తమ కుమార్తెకు ఆప్యాయంగా చెప్పిన ఆ మాటలే వారికి చివరి పలుకులయ్యాయి. హైదరాబాద్‌లో బస్సు దిగాక తల్లీతండ్రుల నుంచి క్షేమ సమాచారంతో మళ్లీ ఫోన్ వస్తుందని ఆ కూతురు ఎంతగానో ఎదురు చూసింది. అయితే ఫోన్ వచ్చిందికానీ.. అది మోసుకొచ్చింది.. క్షేమ సమాచారాన్ని కాదు. కన్నవారి మరణ వార్తను. మహబూబ్ నగర్ బస్సు దగ్ధం ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సజీవ దహనమయిన ఘటన అందరి హృదయాలనూ ద్రవింపచేస్తోంది. గాలి బాలసుందర్ రాజు, మేరీవిజయలక్ష్మి దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమార్తె సౌమ్య బెంగళూరులోని రామయ్య ఐఐటీలో ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. సౌమ్య మొదట్లో కళాశాల హాస్టల్ ఉండి చదువుకునేది. అయితే హాస్టల్ భోజనం పడకపోవటంతో బాలసుందర్ రాజు దంపతులు నుంచి వెళ్లి సంవత్సర కాలంగా కుమార్తె దగ్గరే బెంగళూరులో ఉంటున్నారు. కాగా బాలసుందర్ రాజు చాలాకాలంగా షుగర్ తో బాధపడుతున్నాడు. ప్రతి మూడు నెలలకోసారి హైదరాబాద్ వెళ్లి అక్కడే చెకప్ చేయించుకుని మందులు తెచ్చుకుంటున్నాడు. అలాగే ఈసారి కూడా భార్య మేరీ విజయలక్ష్మిని వెంటపట్టుకుని బెంగళూరులో రాత్రి పది గంటల సమయంలో బస్సు ఎక్కాడు. అయితే ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావటంతో దంపతులిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు తోటి ప్రయాణీకులతోపాటు వీరిని కూడా ఆహుతి చేసేశాయి. ఈ ఘటనతో బాలసుందర్ రాజు స్వస్థలమైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరులో విషాదం నెలకొంది. కనీసం శవాలను కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడటంతో వారి కుటుంబ సభ్యులు భోరుమంటున్నారు. కనీసం చివరిచూపు కూడా చూడలేకపోయామంటూ రోదిస్తున్నారు. -
మహబూబ్‌నగర్ ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ట్రావెల్స్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. -
మహబూబ్ నగర్ బస్సు ప్రమాదంలో 45 మంది మృతి - 10 ప్రధానాంశాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 1. మహబూబ్‌నగర్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 9494600100, 08542-245927/08542-245930/08542-245932 2. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ట్రావెల్స్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారి వివరాలు చెప్పాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు పోలీసులు జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు 3. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 4. ప్రమాద వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్‌గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు....జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. 2010 అక్టోబర్ 6న రిజిస్ట్రర్ అయ్యింది. 5. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యంతెలిపారు. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు వారు బుధవారమికర్కడ పేర్కొన్నారు. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని... టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు. 6. కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రయివేట్ వోల్వో బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ....ముఖ్యమంత్రి ఫోన్‌తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో 42మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు డీఐజీ వెల్లడించారు. 7. ప్రమాదానికి గురైన జబ్బర్ ట్రావెల్స్ బెంగుళూరు కార్యాలయం యజమాని షకీల్ పరారీలో ఉన్నాడు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న షకీల్ ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకపోవటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, మిగతా కార్యాలయాల వద్ద బెంగళూరు సివిల్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బస్సు ప్రయాణికుల వివరాలను బెంగళూరు పోలీసులు సేకరిస్తున్నారు. రెండు బస్సుల ప్రయాణికులను ఒకే బస్సులో తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు రిజిస్ట్రేషన్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. 8. బుధవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగినా..ప్రభుత్వం, అధికారులు స్పందిచలేదని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలకు చెందిన మంత్రి డీకే అరుణ, రవాణశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జేసీ దివాకరరెడ్డిలపై మండిపడ్డారు. 9. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద ఈ రోజు తెల్లవారుజామున వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోర్టు ఆంక్షల కారణంగా ప్రమాద ఘటన స్థలానికి వెళ్లలేకపోతున్నాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లాల్సిందిగా వైఎస్ జగన్ పార్టీనేతలను ఆదేశించారు. 10. మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎమ్ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి), యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్ ) .... వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. -
గంజాయిపై ఉక్కుపాదం
కొత్తకోట(రావికమతం,) న్యూస్‌లైన్: జిల్లాలో గంజాయిపై గురువారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. వేర్వేరుచోట్ల దాడులు, తనిఖీల్లో 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 9మందిని అరెస్టు చేశారు. కోత్తకోటలో అక్రమంగా తరలిస్తున్న రూ.6లక్షల విలువైన 60 కిలోల గంజాయిని రాత్రి గస్తీలో భాగంగా పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఆటోలో ముగ్గురు వ్యక్తులు గంజాయితో వస్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. అందు లో ఇద్దరు పారిపోయారు. ఆ ఆటోలో ఉన్న చెట్టుపల్లి గ్రామానికి చెందిన రాయికోటేశ్వరరావును పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ తిరుమలరావు తెలిపారు. తనిఖీల్లో కొత్తకోట, రావికమతం ఎస్ఐలు అశోక్‌కుమార్, విశ్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ముగురు అరెస్టు పాడేరురూరల్: ముందస్తు సమాచారం మేరకు మాటువేసి రూ.లక్ష విలువైన 30 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు పెదబయలు నుంచి పాడేరు వైపు ఆటోలో గంజాయి తరలిస్తుండగా గంపరాయి గ్రామం వద్ద పట్టుకున్నామన్నారు. గంజాయి తరలిస్తున్న పెదబయలు మండలం బొండపల్లి గ్రామానికి చెందిన జంపరంగి శంకరరావు, పాడేరుకు చెందిన గొర్లె రాజేశ్వరరావు, విశాఖపట్నానికి చెందిన కసంగి సుఖ్దేవ్మన్బహుదుర్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. ఆటోను సీజ్ చేశామన్నారు. దాడుల్లో ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్(మొబైల్) ఎల్.ఉపేంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 110 కిలోల గంజాయి స్వాధీనం జి.మాడుగుల: ఎన్.కొత్తూరు నుంచి గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని సీఐ కె.కృష్ణ తెలిపారు. 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్.కొత్తూరు గ్రామానికి చెందిన దేవినాయుడు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి గంజాయి తరలిస్తుండగా మత్స్యపురం జంక్షన్ వద్ద మాటువేసి పట్టుకున్నామన్నారు. బీరం గ్రామానికి చెందిన కె.సింహాచలం, వి.కృష్ణ, మత్స్యపురం గ్రామానికి చెందిన ఎం.సింహాచలంను అరెస్టు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సన్యాసినాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 90 కిలోలు స్వాధీనం నర్సీపట్నం రూరల్: అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.3లక్షల విలువ గల 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ ఖలీమ్ గురువారం విలేకరులకు తెలిపారు. కమాండర్ జీపులో గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు గొలుగొండ మండలం పోలవరం గ్రామ సమీపంలో మాటు వేసి పట్టుకున్నామన్నారు. జి.మాడుగుల మండలానికి చెందిన ఎం.అప్పారావు, వై.నారాయణను అదుపులోకి తీసుకోగా బుచ్చింపేట మండలానికి చెందిన ఉరబాల రాజు పరారయ్యాడన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని తెలిపారు. సత్యవరంలో గంజాయి పట్టివేత మాడుగుల: ముందస్తు సమాచారంతో విశాఖ ఎన్ఫోర్స్మెంట్ సీఐ జైభీమ్, మాడుగుల ఎక్సైజ్ సీఐ ఇ.శ్రీనివాస్, సిబ్బంది కలిసి గురువారం గంజాయిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.లక్ష విలువైన 60 కిలోల సీలావతి రకానికి చెందిన గంజాయిని పట్టుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే నిందితుల ఆచూకీ తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.