ఉత్తరప్రదేశ్‌లో మహిళల్లో చైతన్యం తక్కువగా ఉందని, అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువన్నారు. తెలంగాణలో మహిళలు ఆర్థికంగా మంచి ఎదుగుదల సాధించారని, ప్రతి నెల పొదుపు చేసుకుని వాటిని క్రమపద్ధతిలో అప్పులు ఇస్తూ తిరిగి బ్యాంకులకు చెల్లించడం బాగుందన్నారు. అనంతరం భీమా ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్‌ను వీరు తిరుమలాయ్యపల్లి వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో కొత్తకోట సర్పంచ్ బీసం చెన్నకేశవరెడ్డి, జెడ్పీటీసీ పీజే బాబు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.
మహిళాసంఘాల పనితీరు భేష్!
Published Wed, Jul 27 2016 12:42 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM
కొత్తకోట : తెలంగాణలోని మహిళా సంఘాల పనితీరు బాగుంది.. ఆర్థిక లావాదేవీలు.. రుణాలతో ఉపాధి పొందుతూ సకాలంలో చెల్లించడం.. పొదుపు మంత్రం బాగుందని యూపీ అధికారుల బందం ఖితాబిచ్చింది. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో పర్యటించిన యూపీ అధికారులు మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వికలాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించింది. ఉత్తరప్రదేశ్ గ్రామీణ అభివద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బలరాంవర్మ, డిప్యూటీ కమిషనర్లు బాలగోవింద్ సుక్లా, బాలచందర్ త్రివేదీ, కరుణాపతీ మిశ్రా, ప్రేమ్‌చందర్‌లు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement