భారతి (ఫైల్)
పీఎం పాలెం (భీమిలి): కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. అదనపు కట్నం కోసం భర్త పేట్టే హింసలకు తాళలేక ఉరి వేసుకుని తనువు చాలించిది. పీఎం పాలెం రెండో బస్టాపు లక్ష్మివానిపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన భారతి(35)కి పీఎం పాలెం లక్ష్మివానిపాలెంకు చెందిన నరవ రామారావుతో 2008లో వివాహం జరిగింది. వివాహ సమయంలో పుట్టింటి వారు అల్లుడికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ వివాహం జరిగిన కొన్నాళ్ల నుంచే రామారావు క్రూరత్వం బయటపడింది.
చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం..
భార్య భారతిని అదనంగా కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అప్పట్లో పుట్టింటికి వెళ్లిపోయి తెర్లాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదుకావడంతో భార్యను బాగా చూసుకుంటానని రామారావు పెద్దల సమక్షంలో 2016 రాజీ పడ్డాడు. తర్వాత కూడా రామారావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ బాధలు భరించలేక శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు భారతి ఉరి వేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ విషయం బయటకు తెలియలేదు.
భారతి ఉరి వేసుకున్న విషయం ఆమె కుమారుడు కౌసిక్ కుమార్ (12) నగరంలోని మాధవధారలో నివసిస్తున్న మేనమామ చిప్పాడ శ్రీనివాస్‌కు తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చిప్పాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment