Husband abuse
-
లావున్నావంటూ భర్త వేధించడంతో గృహిణి ఆత్మహత్య
ముంబై: భర్త తనను ‘లావున్నావని’ వేధించాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లాం కాండే, తెహ్మీనాలకు 2016లో పెళ్లి జరిగింది. ఇంటి పనుల విషయంలో తల్లిదండ్రులతో గొడవ అవుతుండటంతో అస్లాం భార్యను తీసుకొని వచ్చి బయట ఉంటున్నారు. అయితే.. కొన్ని రోజుల తరువాత భార్యాభర్తల మధ్యా గొడవలు ప్రారంభం అయ్యాయి. ఓసారి తెహ్మీనా పోలీసులకు పిర్యాదు చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే తనతో గొడవపడుతోందని పోలీసులకు చెప్పాడు. అంతే కాదు.. భార్యను బైకుల్లాలోని ఆమె తల్లి రజియా వసీం అన్సారీ ఇంటిలో దించేశాడు. ఫిబ్రవరి 14న తల్లి బయటికి వెళ్లిన సమయంలో తెహ్మీనా ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అస్లాంపై కేసు నమోదు చేశారు. ‘నువ్వు లావుగా ఉన్నావు, నీకు డ్రెస్‌సెన్స్ లేదు, నీకు పిల్లలు కావడం లేదు’ అంటూ అస్లాం తన కూతురును తరచూ వేధించేవాడని రజియా తెలిపింది. తనకు పిల్లలు పుట్టడం లేదని తన భర్త వేరే పెళ్లి చేసుకున్నాడని తెహ్మీనా తరచూ అనుమానించేదని, ఆ డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుందని రజియా పోలీసులకు వెల్లడించింది. రజియా ఫిర్యాదు మేరకు అస్లాంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను బాగా చూసుకుంటానన్నాడు.. కానీ ఆ భర్త.. చివరికి..
పీఎం పాలెం (భీమిలి): కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. అదనపు కట్నం కోసం భర్త పేట్టే హింసలకు తాళలేక ఉరి వేసుకుని తనువు చాలించిది. పీఎం పాలెం రెండో బస్టాపు లక్ష్మివానిపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన భారతి(35)కి పీఎం పాలెం లక్ష్మివానిపాలెంకు చెందిన నరవ రామారావుతో 2008లో వివాహం జరిగింది. వివాహ సమయంలో పుట్టింటి వారు అల్లుడికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ వివాహం జరిగిన కొన్నాళ్ల నుంచే రామారావు క్రూరత్వం బయటపడింది. చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం.. భార్య భారతిని అదనంగా కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అప్పట్లో పుట్టింటికి వెళ్లిపోయి తెర్లాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదుకావడంతో భార్యను బాగా చూసుకుంటానని రామారావు పెద్దల సమక్షంలో 2016 రాజీ పడ్డాడు. తర్వాత కూడా రామారావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ బాధలు భరించలేక శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు భారతి ఉరి వేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ విషయం బయటకు తెలియలేదు. భారతి ఉరి వేసుకున్న విషయం ఆమె కుమారుడు కౌసిక్ కుమార్ (12) నగరంలోని మాధవధారలో నివసిస్తున్న మేనమామ చిప్పాడ శ్రీనివాస్‌కు తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చిప్పాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భర్త బాధితులకు ‘దిశ’ భరోసా
పోలీసుల స్పందనతో నిలిచిన ప్రాణం.. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత అర్ధరాత్రి 1:59 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసు సాయం కోరింది. తన భర్త వేధింపుల కారణంగా తాను నిద్రమాత్రలు మింగినట్టు తెలిపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఐదు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, ఆమె భర్తను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని భర్త చెప్పడంతో వారి కాపురాన్ని పోలీసులు నిలబెట్టినట్లయింది. బెదిరించిన యువకుడి అరెస్ట్.. కర్నూలు జిల్లాలోని ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని ఒక యువతిని వేధించాడు. అందుకు అంగీకరించని ఆమె పెళ్లి చెడగొట్టేందుకు లెటర్ రాస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాలికను వేధించినందుకు కేసు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక (12)ను ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పొరుగింటి యువకుడు చొరబడి వేధించాడు. ఇది గమనించిన స్థానికులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి బాలికను కాపాడటంతోపాటు ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు... ఇలా భర్త చేతిలో దెబ్బలు తిని కాపాడమని కోరిన గృహిణులతోపాటు ఆకతాయిల వేధింపులకు గురైన విద్యార్థినులు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో అపరిచితుల అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన యువతులకు దిశ యాప్ వరంలా మారింది. సాక్షి, అమరావతి: భర్త బాధితులైన పలువురు గృహిణులు దిశ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. దిశ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కౌన్సెలింగ్ ద్వారా కాపురాలు చక్కదిద్దుతున్నారు. దిశ కాల్ సెంటర్‌కు వచ్చిన కాల్స్‌ను పోలీసులు విశ్లేషించగా.. భర్త బాధితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తెచ్చిన సంగతి తెల్సిందే. దిశ బిల్లులో భాగంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 8న దిశ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను దాదాపు 12 లక్షలమంది డౌన్లోడ్ చేసుకోగా, ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దిశ యాప్‌లో వస్తున్న ఫిర్యాదుల్లో భర్త బాధితలు సైతం ఉండటం గమనార్హం. అనేకమంది గృహిణులు ‘భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నాం కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. గడిచిన పదినెలల కాలంలో 675 మంది మహిళలు, బాలికలు దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. వీరిలో భర్త వేధింపులు తాళలేకపోతున్నామంటూ 267 మంది కాల్ చేశారు. ఈ ఘటనల్లో మద్యం తాగి వచ్చి భార్యను కొట్టిన ప్రబుద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు అధిక కట్నం కోసం వేధిస్తున్న వారున్నారు. రాత్రివేళ 10.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య ఈ తరహా వేధింపులు జరిగినట్టు దిశ కాల్స్‌లో రికార్డయ్యాయి. భర్త కొడుతున్న సమయంలో తమ మొబైల్స్‌లోని దిశ యాప్‌ను ఓపెన్ చేసి ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే అవకాశం లేకపోవడంతో తమ చేతిలోని సెల్ ఫోన్‌ను అటు ఇటు ఊపి (షెక్ చేయడం) ఆపదలో ఉన్నాం ఆదుకోండి.. అని సమాచారం అందించడం విశేషం. దిశ కాల్ సెంటర్‌కు సమాచారం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో భర్త బాధితులను కాపాడుతున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలు చక్కదిద్దుతున్నారు. పదినెలల్లో దిశ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు భర్త వేధింపులు: 267 బయటివారి వేధింపులు: 115 గుర్తుతెలియనివారి వేధింపులు: 69 పనిచోసేచోట వేధింపులు: 67 బంధువుల వేధింపులు: 68 తప్పుడు ఫిర్యాదులు: 22 అసభ్య ప్రవర్తన: 19 మహిళ అదృశ్యం: 13 బాలికలపై అకృత్యాలు: 9 సివిల్ వివాదాలు: 8 బాలికల అదృశ్యం: 8 ప్రమాదాలు: 6 పురుషుల అదృశ్యం: 3 వెంటపడి వేధింపులు: 1 మొత్తం: 675 తక్షణం స్పందిస్తున్నాం దిశ యాప్ ద్వారా కాల్ సెంటర్‌కు వస్తున్న సమాచారంపై తక్షణం స్పందించి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తున్నాం. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు 5 నుంచి 12 నిమిషాల్లోనే ఘటన ప్రాంతానికి చేరుకుని సహాయం అందిస్తున్నారు. చాలావరకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్‌లతో సరిపెడుతున్నాం. తీవ్రత ఉన్న వాటిపై గృహహింస, పోక్సో, నిర్భయ కేసులు నమోదు చేస్తున్నాం. భర్తల వేధింపులపై 267 మంది ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ అనంతరం అనేక కాపురాలు చక్కబడ్డాయి. అప్పటికీ మాటవినని 20 మంది పురుషులపై కేసులు నమోదు చేశాం. - దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
సంసారంలో సెల్‌ఫోన్ చిచ్చు
- భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య -తల్లి లేని వారైన నలుగురు పిల్లలు వీపనగండ్ల: భార్య సెల్ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించిన భర్త ఎవరితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగడం.. గతంలో కూడా ఇదే మాదిరిగా వేధించడాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆ మహిళ కాలి బూడిదై పోగా.. వారి నలుగురు పిల్లలు తల్లి లేని వారుగా మిగిలారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన వంక ఈదన్న వివాహం ఇదే గ్రామానికి చెందిన రామేశ్వరమ్మతో 11 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరు పూరిగుడిసెలో నివాసముంటూ కూలి పనిచేసుకుని జీవిస్తున్నారు. మంగళవారం ఆ గ్రామంలో బోనాల పండుగ, బుధవారం కర్రీ పండుగ జరుపుకొన్నారు. నిన్న ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి రామేశ్వరమ్మకు ఫోన్ రావడంతో ఆమె మాట్లాడుతుండగా అదే సమయంలో భర్త ఈదన్న ఇంటికి వచ్చాడు. ఆమె నుంచి ఫోన్ లాక్కుని అవతలి వ్యక్తి మాటలు విన్న ఈదన్న ఆయనతో అక్రమ సంబంధం నెపంతో అనుమానించాడు. గతంలో కూడా ఒకటి, రెండుసార్లు ఆమె సెల్ఫోన్లో మాట్లాడుతుండడం గమనించిన ఈదన్న.. తన భార్య రామేశ్వరమ్మపై అనుమానం వ్యక్తంచేస్తూ వేధించాడు. నిన్న కూడా ఇదే పునరావృతం కావడంతో మనస్తాపానికి గురైన ఆమె.. ఈదన్న బయటకు వెళ్లగానే పిల్లలకు రూ. 20 ఇచ్చి ఏమైనా కొనుక్కోవాలని వారిని పంపించింది. ఆ తర్వాత వారు నివసించే గుడిసెపైనే కాకుండా తన ఒంటిపై కూడా కిరోసిన్ చల్లుకుని గుడిసెకు గడియ వేసి నిప్పంటించుకుంది. గుడిసె తగలబడుతుం డడంతో భర్త వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. స్థానికులు కూడా వచ్చి నీళ్లు చల్లినా గుడిసెతోపాటు రామేశ్వరమ్మ కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయి బూడిదే మిగిలింది. ఈ విషయమై రామేశ్వరమ్మ తల్లి ఫిర్యాదు మేరకు వీపనగండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.