లీలావతి(ఫైల్)
కర్నూలు, వెల్దుర్తి: ఆడపిల్లలు పుట్టారని, పనిచేయడం చేతకాదని భర్త, అత్తమామ నిత్యం వేధిస్తుండడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం యాదరాళ్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వెల్దుర్తి ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల సమీపంలోని బిల్లలాపురానికి చెందిన లీలావతి(25)కి యాదరాళ్లకు చెం దిన బాలసుబ్రహ్మణ్యంతో 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు(కుమార్తెలు) ఉన్నారు. లీలావతి అమ్మా, నా న్నలు జయమ్మ, చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు. పెద్ద దిక్కులేని ఆమెకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన భర్త వేధింపుల పర్వం కొనసాగించాడు. అత్తమామలు కూడా అదే బాట పట్టారు.
సూటిపోటి మాటలను తాళలేని లీలావతి.. శుక్రవారం ఇంట్లోని బాత్‌రూంలోకి వెళ్లి గడియవేసుకుని పురుగులమందు తాగింది. ఎంతసేపటికీ రాకపోవడంతో తలుపు పగులగొట్టి చూశారు. అప్పటికే ఆమె మృతిచెందింది. లీలావతి పెదనాన్న గుర్రం చెన్నయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని డోన్‌కు ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భర్తతో పాటు అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment