
బుజ్జి (ఫైల్)
ఖాజీపేట : అత్త ఆడబిడ్డ వేధింపులు తాళలేక ములపాక గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళ ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కమలాపురం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన బుజ్జిని ములపాక చెందిన రాంప్రసాద్ అనే యువకుడికి ఐదేళ్ల కిందట వివాహం చేశారు. ఇటీవలే ఆ అమ్మాయి పోలీసు వలంటీర్‌గా ఎంపికైంది. గత కొంతకాలంగా అత్త యశోదమ్మ తోపాటు ఆడబిడ్డ భర్తతో అనేక విభేదాలు కారణంగా తరచూ ఇంట్లో వేధింపులు జరిగేవి.
దీంతో మానసికంగా బుజ్జి తీవ్ర ఆవేదన చెంది బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న బుజ్జి తల్లితండ్రులు మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే తండ్రి పూజారి ఓబులేసు తన కూతురు అత్త, ఆడబిడ్డ భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతురాలి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.