
అద్దె భవనాలతో అవస్థలు
సోంపేట :
పీహెచ్‌సీలకు అనుబంధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన సబ్ సెంటర్లు అద్దె కొంపల్లో నిర్వహిస్తుండడంతో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు.
సొంత భవనాలకు నోచుకోవడం లేదు. సోంపేట మండలంలో 12 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఆరోగ్య ఉప కేంద్రానికి కూడా సొంత భవనానికి నోచుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో సరైన అద్దె భవనాలు కూడా దొరక్క పోవడంలో ఆరోగ్య సిబ్బంది విధులున ఇర్విహ ంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోంపేట- 1, సోంపేట-2, జింకిభద్ర, కొర్లాం, పాలవలస, కొరంజిభద్ర, మాఖన్నపురం, బారువ-1, బారువ-2, బట్టిగళ్లూరు, మామిడిపల్లి, తాళభద్ర గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో కొన్ని చోట్ల అద్దె భవనాల్లో, మరికొన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు వైద్య సేవలు, విషజ్వరాలు, డయేరియా వంటి అత్యవసర సమయాల్లో రోగులు సోంపేట, బారువ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. భవనాలు నిర్మిస్తే అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. అద్దె భవనాలు లేని గ్రామాల్లో కనీసం ఆరోగ్య సిబ్బంది మందులు ఉంచుకునే అవకాశం కూడా సాధ్యం కావ డం లేదు. ప్రభుత్వం వేలాది రూపాయల మందులు సరఫరా చేస్తున్న సొంత భవనాలు లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వివిధ గ్రామాల్లో గర్బిణులు, బాలింతలకు టీకాలు వేసేం దుకు అంగన్‌వాడీ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోనే వైద్య సేవలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని పలు గ్రామాలప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.