కాల్చుకుతిన్నాడు
సోంపేట: ఆదర్శాన్ని తగులబెట్టేశాడు. 13 ఏళ్ల ప్రేమ బంధాన్ని తెంచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కాల్చి చంపేశాడో కర్కోటకుడు. తీరిగ్గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించబోయాడు. సోంపేటలో జరిగిన ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. బంధువులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పల్లి వీధికి చెందిన లొట్ల క్రిష్టారావు అలియాస్ మధు(36), బాలమ్మలు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసుల సమక్షంలో 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. చివరికి బాలమ్మ కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించి, ఆదరించారు.
దాంతో నాలుగేళ్లపాటు వారింటి వద్దే ఉన్న ఈ దంపతులు, అనంతరం వేరు కాపురం పెట్టుకున్నారు. పాన్‌షాప్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు పవన్(11) ఆరో తరగతి, కూతురు కీర్తి(9) నాలుగో తరగతి చుదువుతున్నారు. కాలక్రమంలో క్రిష్ణారావు మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్యను కొట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. దాంతో కుటుంబం కలతలు రేగాయి. సుమారు ఈ 10 సార్లు స్దానిక పోలీస్టేషణ్‌లో బాలమ్మ పిర్యాదు చేసింది.గొడవలు పడుతూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. వీటిని తట్టుకోలేక బాలమ్మ సుమారు పదిసార్లు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో క్రిష్టారావు హడావుడి బ్యాగు పట్టుకొని వెళ్లిపోతుండటం, ఇంటి నుంచి పొగలు వస్తున్నట్లు కనిపించడంతో స్థానికులు అనుమానంతో బాలమ్మ తల్లి లక్ష్మికి సమాచారం పం పారు. ఆమె వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇళ్లంతా పొగతో నిండిపోయింది. బాలమ్మ తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉండి. గదిలోనూ, అరుగు మీద రక్తపు మరకలు కనిపించాయి. దాంతో స్థానికుల సాయంతో బాలమ్మను లక్ష్మి స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రికి చేరిన వెంటనే బాలమ్మ మృతి చెందింది. క్రిష్ణారావు బాలమ్మను తీవ్రంగా కొట్టి, కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ఇంటిలోని పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
ఆత్మహత్యగా చెప్పిన నిందితుడు
కాగా ఇంటి నుంచి హడావుడిగా వెళ్లిపోయిన క్రిష్టారావు నేరుగా సోంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు. అతని శరీరంపైన కూడా కాలిన గాయాలు ఉండటాన్ని పరిశీలించిన పోలీసులు, అదే విషయం ప్రశ్నించగా భార్యను రక్షించే ప్రయత్నంలో తనకు కూడా గాయాలయ్యాయని బుకాయించాడు. తాగిన మైకంలో తూలుతున్న అతన్ని వాలకాన్ని గమనించిన పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి పంపారు. సోం పేట ఎస్.ఐ శ్రీనువాసరావు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ దేవప్రసాద్ సంఘటన స్దలానికి చేరుకుని పరిశీలించారు.
అమ్మానాన్న రోజూ గొడవపడేవారు
అమ్మానాన్న రోజూ గోడవ పడేవారని వారి పిల్లలు పవన్, కీర్తి చెప్పారు. ప్రతి రోజు నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టి హింసించే వాడన్నారు. అతనే అమ్మను చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. బాలమ్మ తల్లి, సోదరులు కూడా ఇదే ఆరోపణ చేశా రు. నిత్యం బాలమ్మను వేధించేవాడని, ఇప్పుడు ఆమె ను శాశ్వతంగా దూరం చేశాడంటూ విలపించారు.