
సాక్షి, అమరావతి : సరద్దయిన సోంపేట నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ తండ్రీ కొడుకు కలిసి పదిసార్లు గెలుపొందారు. సీనియర్ నాయకుడు గౌతు లచ్చన్న 1952 నుంచి వరుసగా నాలుగుసార్లు, 1978లో ఒకసారి విజయం సాధించగా, ఆయన కుమారుడు గౌతు శ్యామ సుందర శివాజీ 1985 నుంచి వరుసగా మరో ఐదుసార్లు గెలుపొందడంతో వీరిద్దరే దాదాపు 50 సంవత్సరాలు సోంపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే గౌతు కుటుంబం కాకుండా మజ్జి కుటుంబం మాత్రమే రెండు సార్లు గెలిచింది. గెలిచిన లచ్చన్న, తులసీదాస్, శివాజీలు ముగ్గురు మంత్రి పదవులు నిర్వహించిన వారిలో ఉన్నారు. లచ్చన్న గతంలో ప్రకాశం పంతులు క్యాబినెట్‌లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ప్రముఖులలో ఈయన కూడా ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment