Majji Srinivasa Rao
-
డయేరియా మరణాలు.. పవన్ పై YSRCP నేత ఫైర్
-
మళ్లీ సీఎం జగన్ ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు : మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ తన ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేసిందే తప్ప, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నేత నారాలోకేశ్ యువగళమంతా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై అక్కసుతోపాటు వ్యక్తిగత దూషణలు చేయడానికే పరిమితమైందన్నారు. నాలుగున్నరేళ్లుగా అవినీతిరహితంగా పాలన సాగిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఒక్క ఆరోపణ చేయలేకపోయారన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై మాట్లాడలేదంటే వైఎస్సార్ సీపీ జనరంజక పాలన టీడీపీకి అర్థమై ఉంటుందన్నారు. యువగళంలో టీడీపీ నేతలు ఉచిత పథకాలకు అలవాటుపడొద్దని ప్రజలకు కళ్లబొల్లి కథలు చెప్పి ఆరు ఉచిత పథకాలను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయ నిరాశ్రయులకు పరిహారం మాటెత్తకుండా, టెండర్లు ఖరారు చేయకుండా ఎన్నికల ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపన చేసేశారన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలయ్యాక ప్రజలకు శఠగోపం పెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు బీసీలకు తామేదో ప్రాధాన్యం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని, టీడీపీ పాలనలో బీసీ మహిళకు ఇచ్చిన మంత్రి పదవిని తీసేసి, క్షత్రియ వర్గానికి కేటాయించిన విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ప్రజా సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే... టీడీపీ, ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ఆయనవెంట పలాస నియోజవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణరాజు, వేపాడ జెడ్పీటీసీ సభ్యులు సేనాపతి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: 'జగనన్నకు కొండపిని కానుకగా ఇస్తా!' : ఆదిమూలపు సురేష్ -
అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని, అందరికీ సమన్యాయం చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార వికేంద్రీకరణ తలపెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేవలం తన అనుయాయులను పెత్తందారులను చేయడానికే చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను చంద్రబాబు పక్కనబెట్టి నారాయణ, సుజనాచౌదరిల కమిటీ చెప్పిన అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి సొమ్ముతో తమ మందిమాగధులకు మేలు చేసేది రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి సహా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ అమరావతి రైతుల ముసుగులోని పెట్టుబడిదారులు మాత్రం ఉత్తరాంధ్ర నాశనం అయిపోవాలని దేవుడికి మొక్కడానికి అరసవల్లి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు పలకడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాల్సింది పోయి చంద్రబాబు ప్రయోజనాల కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. గతంలో మాదిరిగానే ప్రజలు అమాయకులని వెన్నుపోటు పొడుద్దామంటే కుదరదని హెచ్చరించారు. వికేంద్రీకరణపై టీడీపీ విషప్రచారాన్ని వారే తిప్పికొడతారని, కుట్రల్లో భాగమైన పాదయాత్రను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. జెడ్పీ చాంబర్లో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. టీడీపీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రకటనల వెనుకనున్న అసలు విషయాన్ని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... టీడీపీ ప్రచారం: భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినది మేమే. 400 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవ విషయం: విమానాశ్రయం కోసం గత టీడీపీ ప్రభుత్వం 2,750 ఎకరాలను జీఎంఆర్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ఆ భూసేకరణపై 150 వరకూ కేసులు హైకోర్టు విచారణలో ఉన్నా వాటిని పరిష్కరించకుండానే, ఓ ఒక్క నిర్వాసితుడికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే చంద్రబాబు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసేశారు. అశోక్ గజపతిరాజు అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా ఏ ఒక్క అనుమతీ తీసుకురాలేదు. రైతులతో మాట్లాడి ఆ కేసులన్నీ ఉపసంహరింపజేసినదీ, నిర్వాసితులకు న్యాయం చేసినదీ, కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చినదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుంది. విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదనే జీఎంఆర్ నుంచి 547 ఎకరాలను ప్రభుత్వం వెనక్కుతీసుకుంది. ఐదు గ్రామాల నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం ఇచ్చింది. అన్ని సౌకర్యాలతో కాలనీలు సిద్ధం చేసింది. టీడీపీ ప్రచారం: గిరిజన యూనివర్సిటీకి టీడీపీ హయాంలోనే భూమి సేకరించేశాం. రూ.10 కోట్ల ఖర్చుతో కాంపౌండ్ వాల్‌నూ కట్టేశాం. వాస్తవ విషయం: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలన్నీ గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ వాటి లక్ష్యాన్ని పక్కనబెట్టి టీడీపీ పాలనలో మైదాన ప్రాంతమైన కొత్తవలస మండలంలో స్థల సేకరణ చేశారు. సొంత కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రూ.10 కోట్లతో మంజూరు చేసిన చేసిన ప్రహరీ కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉండేలా సాలూరు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీపంలోనే రైలు, రోడ్డు, విమాన ప్రయాణ సదుపాయాలు ఉండేలా మెంటాడ మండలంలో సుమారు 500 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తే, కేంద్ర కమిటీ దానికి మొగ్గు చూపించింది. దీన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్‌మంత్రితో మాట్లాడి సాధించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఆ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ నియమించినదీ, తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అన్ని గిరిజన ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే ఆయన కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరుచేశారు. మరో మెడికల్ కాలేజీ త్వరలోనే పార్వతీపురం మన్యం జిల్లాకూ మంజూరు చేయనున్నారు. టీడీపీ ప్రచారం: అమరావతి రైతులకు మద్దతుగా అన్నివర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. పాదయాత్రకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టడం తప్ప ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. వాస్తవ విషయం: జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న అటు అశోక్‌కు తప్ప మిగతా టీడీపీ నాయకులెవ్వరికీ ఇక్కడ జరిగిన అభివృద్ధిపై అవగాహన లేదు. గణాంకాలు చూస్తే తెలుస్తుంది. టీడీపీ పాలనలో ఏమి జరిగిందో, వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేసింది వైఎస్సారే. కాలువ, మిగులు పనులకు ఇటీవలే రూ.125 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనికి అడ్డంకిగానున్న సారిపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి రూ.77 కోట్లను కేటాయించినది మా ప్రభుత్వమే. వీటన్నింటినీ విస్మరించి వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలపై విషప్రచారం చేయడానికి టీడీపీ నాయకులకు తగదు. విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధాని గాకుండా అడ్డుకోవడానికే జరుగుతున్న అమరావతి పాదయాత్రకు మద్దతు పలకడం సమంజసం కాదు. కాదని ఆ విధానానికే కట్టుబడి ఉంటే 2024 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజధాని వల్ల ఉత్తరాంధ్రకు ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలకు మేలు జరుగుతుంది. దాని కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. -
ఎన్నికల్లో ఓడారు.. ఎంతకైనా తెగిస్తున్నారు
ఓటమిని వారు భరించలేకపోతున్నారు. అధికారం కోల్పోవడంతో అసహనంతో ఊగిపోతున్నారు. ప్రతి చిన్న అంశాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అవకాశం దొరికిందే తడవుగా దాడులకు తెగబడుతున్నారు. ఉద్రేకంతో విచక్షణ కోల్పోతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకూ వెనుకాడటం లేదు. ఇదీ జిల్లాలో ఇటీవల తెలుగుతమ్ముళ్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమిని గెలుపునకు సోపానంగా మలచుకోవాలి. కానీ వారు సహనం కోల్పోయి విషసంస్కృతికి బీజం వేస్తున్నారు. ప్రశాంత జిల్లాలో లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు. సాక్షి, విజయనగరం: ఓటమిని గుణపాఠంగా మలచుకోలేని తెలుగుదేశం కార్యకర్తలు దిగజారిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఒక్క స్థానాన్నీ గెలవలేకపోయిన టీడీపీ, ప్రజల నమ్మకాన్ని కోల్పోయి ప్రతీకార చర్యలకు దిగుతోంది. ప్రజల మధ్య కులాలు, వర్గాల పేరుతో చిచ్చు పెడుతోంది. ఈ పరిణామాలు తాజాగా వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యకు దారితీశాయి. జిల్లాలో ఎన్నడూ లేని విష సంస్కృతికి ఈ హత్యతో బీజం పడింది. ఇది రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాచిపెంట మండలంలోని పి.కోనవలస, మోసూరు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. పి.కోనవలసలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబం దెబ్బలతో తప్పించుకున్నారు. మోసూరులో గండిపల్లి తవుడును టీడీపీ నాయకులు హతమార్చారని ఆరోపణలు ఉన్నాయి. పాచిపెంట మండలం మోసూరులో ఈ నెల 15వ తేదీన పశువుల కాపరి అయిన తవుడు సాయంత్రం ఆవులను కట్టిన తరువాత రాత్రి గ్రామంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. నిమజ్జనం అయిన తరువాత అందరూ ఇళ్లకు చేరినా తవుడు ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని స్థానిక శివాలయం సమీపంలో తవుడు మృత దేహాన్ని గుర్తించారు. మృతుడి కుడి చేయి విరిగి ఉండడం, మెడ నులిపిన ఆనవాళ్లు ఉండడంతో ఆయనను హత్య చేసినట్లుగా అనుమానించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. తవుడును గ్రామంలోని పలువురు టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి ఆరోపిస్తుండగా విచారణ చేపట్టిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నుంచే అఘాయిత్యాలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రతీకార దాడులకు దిగడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నికల సమయంలోనూ, పోలింగ్ రోజున, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చోటుచేసుకున్నాయి. పి.కోనవలస గ్రామంలో సొంత అన్నదమ్ముల్లో చివరివాడైన కరణం రాజు ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సమక్షంలో చేరారు. ఈ క్రమంలో జూన్ 16న స్థల సమస్యను సాకుగా చూపు తూ రాజు, ఆయన అత్త గౌరమ్మ, భార్య రమలపై రాజు అన్నదమ్ములు, వదినలు కర్రలతో దాడులకు పాల్ప డ్డారు. ఈ దాడిలో రాజు, గౌరమ్మకు తలలు పగిలాయి. రమ మెడలో పుస్తెల తాడు పోయింది. రాజు, గౌరమ్మలను సాలూరు సీహెచ్‌సీ నుంచి విజయనగరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వారి తలలపై కుట్లు పడ్డాయి. ఇప్పుడిప్పుడే వారు కోలుకుంటున్నారు. అన్నపైనే... తమ్ముడి తప్పుడు ఫిర్యాదు గంట్యాడ గ్రామంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొండపల్లి కొండలరావుపై ఆయన సోదరుడైన మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు తప్పుడు ఫిర్యాదులు చేశారు. జూలై 18న కొండలరావు తన తండ్రి వారసత్వంగా వచ్చిన గంట్యాడ రెవెన్యూ సర్వేనెంబర్ 12/1,12/2లో 16 ఎకరాలు మామిడితోటను ఆక్రమించుకున్నాడని అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించగా ఎటువంటి ఆక్రమణలు జరగలేదని తేలడంతో మాజీ ఎమ్మెల్యే దుర్భుద్ధి బయటపడింది. కుంతేస్‌లో మహిళపై దాడి కొమరాడ మండలం గిరిశిఖర గ్రామం అయిన కుంతేస్‌లో సుమారు 30 కుటుంబాలు ఉంటాయి. ఐదు కుటుంబాలు వైఎస్సార్సీపీకి చెందడంతో కొంత కాలంగా వారిని టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి చిన్న విషయానికీ రాద్ధాంతం చేస్తున్నారు. ఇటీవల బిడ్డక మంజుల అనే వైఎస్సార్సీపీ మహిళ కార్యకర్త మంచినీటి బావి వద్ద గిన్నెలు శుభ్రం చేస్తుండగా పాత కక్షలతో టీడీపీ కార్యకర్తలు బచ్చల గోపిచంద్, పశుపురెడ్డి రాజేష్, కొండగొర్రి సహదేవుడు, పసుపురెడ్డి మిన్నారావు ఆమెపై తెగపడ్డారు. మంచి నీటి బావి వద్దకు వస్తే రూ.2 వేలు జరిమానా కట్టాలని నానా ఇబ్బందులు పెట్టారని విలేకరులకు తెలిపారు. ఈ వివాదంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషసంస్కృతి గతంలో లేదు ఎన్నికల ముందు నుంచే టీడీపీ నేతల్లో అసహనం మొదలైంది. ఓటమి వారికి ముందే తెలిసిపోయింది. వైఎస్సార్సీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నించారు. అయినా మేము ఏనాడూ కుంగిపోలేదు. భయపడలేదు. ఈ విషయం అప్పట్లో అధికారంలో టీడీపీ నేతలందరికీ తెలు సు. మమ్మల్ని ఏమీ చేయలేక టీడీపీ వారు మరింత దిగజారిపోయారు. పార్వతీపురంలో తాగునీరు రావడం లేదని ఫిర్యాదు చేసిన ప్రజలపై ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ చేయిచేసుకున్నారు. ఎన్నికల రోజు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, వైసీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజుపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఏకంగా కార్యకర్తను హత్య చేసేంతగా పచ్చపార్టీ నేతలు బరితెగించారు. ఇలాంటి విష సంస్కృతి జిల్లాలో కొత్తగా చూస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదు. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త, విజయనగరం -
పుష్ప శ్రీవాణి దంపతులకు పరామర్శ
సాక్షి, విజయనగరం : కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి దంపతులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. పోలింగ్ రోజున టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి దంపతులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడటం దారుణమన్నారు. పోలీసులు తక్షణమే స్పందించడం వల్ల శ్రీవాణి దంపతులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు స్వస్థి పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. జిల్లాలోని 9 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను ఆయన కుమారుడు వైఎస్ జగన్ అందిస్తాడనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికలు సజావుగా జరిపించిన జిల్లా అధికారులకు వైస్సార్ సీపీ తరఫున శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కురుపాం విషయంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. -
విజయనగరం, బొబ్బిలి రాజులను నమ్మొద్దు
చీపురుపల్లి: విజయనగరం, బొబ్బిలి రాజులను నమ్మొద్దని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రజలను కోరారు. పట్టణంలోని జి.అగ్రహారంలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన అనంతరం ఆంజనేయ విగ్రహం, రావిచెట్టు వద్ద నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ ..పదవులు పొంది కోటల్లో, ఢిల్లీలో కూర్చుని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయనగరం ఎంపీగా 2014లో అశోక్‌గజపతిరాజును గెలిపిస్తే ఢిల్లీలో కూర్చుని జిల్లా ప్రజలను మరిచి పోయారన్నారు. టీడీపీ హయాంలోనే ఆర్ఈసీ ఎస్కి అవినీతి మరకలు అంటుకున్నాయని మండిపడ్డారు. 5 ఏళ్లలో 500 హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బాబుపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అత్యంత సామాన్యుడైన, అందరికీ అందుబాటులో ఉండే బెల్లాన చంద్రశేఖర్‌ను ఎంపీగా నిలబెట్టారని, నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన బొత్స సత్యనారాయణను ఎమ్మెల్యేగా నిలబెట్టారని, వీరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, కర్రోతు ప్రసాద్, కోసిరెడ్డి రమణ, కరణపు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
పదిసార్లు గెలిచిన తండ్రీ కొడుకులు
సాక్షి, అమరావతి : సరద్దయిన సోంపేట నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ తండ్రీ కొడుకు కలిసి పదిసార్లు గెలుపొందారు. సీనియర్ నాయకుడు గౌతు లచ్చన్న 1952 నుంచి వరుసగా నాలుగుసార్లు, 1978లో ఒకసారి విజయం సాధించగా, ఆయన కుమారుడు గౌతు శ్యామ సుందర శివాజీ 1985 నుంచి వరుసగా మరో ఐదుసార్లు గెలుపొందడంతో వీరిద్దరే దాదాపు 50 సంవత్సరాలు సోంపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే గౌతు కుటుంబం కాకుండా మజ్జి కుటుంబం మాత్రమే రెండు సార్లు గెలిచింది. గెలిచిన లచ్చన్న, తులసీదాస్, శివాజీలు ముగ్గురు మంత్రి పదవులు నిర్వహించిన వారిలో ఉన్నారు. లచ్చన్న గతంలో ప్రకాశం పంతులు క్యాబినెట్లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ప్రముఖులలో ఈయన కూడా ఒకరు. -
సైనికులమై సాగుదాం...
సాక్షి, వేపాడ: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు అంతా సైనికులమై సాగుదామని ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని ఆతవ గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు మెరపల సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం 600 హామీలను ఇచ్చి మోసపుచ్చిందన్నారు. ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమం పట్టని తెలుగుదేశం పాలకులకు ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ డ్వాక్రా సంఘాలకు పసుపు – కుంకుమ చెక్కుల పేరిట మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరయ్యాయని చెప్పారు. వర్షాధార ప్రాంతమైన నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదని గుర్తు చేశారు. ఆతవను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయానికి పాటుపడాలన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామన్నారు. గత 45ఏళ్లలో అభివృద్ధి కేవలం ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి చేస్తామని మీ అందరి సహాకారం కావాలని ఒక్కసారి జగనన్నకు అవకాశం కల్పించాలని కోరారు. ఎస్.కోట నియోజకవర్గ ఇన్చార్జి పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ నాయకులంతా ఐక్యత, సమన్వయంతో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 20రోజులు అవిశ్రాంతంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, ఇందుకూరు రఘురాజు. మాజీ జెడ్పీటీసీలు వేచలపు వెంకట చినరామునాయుడు, మూకల కస్తూరీ, తూర్పాటి వరలక్ష్మి, ఎంపీటీసీలు దొగ్గ సత్యవంతుడు, అడపా ఈశ్వర్రావు, సిహెచ్.పద్మావతి, దుల్ల వెంకటరమణ, గ్రామానికి చెందిన నాగిరెడ్డి నాయుడు, రొంగలి కృష్ణమూర్తి, గొంప అవతారం, గొంప నాయుడు, నెక్కల ఈశ్వర్రావు, కసిరెడ్డి సత్తిబాబు, బొడ్డు వెంకునాయుడు, మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
టీడీపీ వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది
సాక్షి, విజయనగరం : ప్రజాదారణ కోల్పోయిన టీడీపీ.. అక్రమార్గంలో గద్దెనెక్కాలనే ఉద్దేశంతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేదు కాబట్టే ఎదో కుట్ర చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ దారుణంగా ఓడిపోతుందన్న భయంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఓట్లను తొలగిస్తూనే.. తమ సానుభూతి ఓట్లే తొలగిస్తున్నారని టీడీపీ చెబుతుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెబుతున్న 7500 ఓట్లు ఎవరి సానుభూతిపరుల ఓట్లో ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధమన్నారు. మంత్రికి దమ్ముంటే బొబ్బిలిలోని ప్రతి గ్రామానికి వెళ్లి నిజాన్ని తెలుసుకోవడానికి రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వ దగ్గర ఉండాల్సిన పౌరుల సమాచారం ఓ ప్రైవేట్ కంపెనీ వద్దకు ఎలా వెళ్లిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు నెల క్రితం కొంత మంది వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతూ.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలను తెలుసుకొని వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి, డీజీపీలకు ఫిర్యాదు చేశామన్నారు. గత 26వ తేది నుంచి చీపురుపల్లి, మెరకముడిదాం మండలాలలో 2వేలకు పైగా ఫాం7 ధరఖాస్తులు నమోదయ్యాయని, 27వ తేదికి అవి 7 వేలకు చేరాయన్నారు. ఇలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25వేల వరకు ఫాం7 నమోదయ్యాయన్నారు. ఇవన్ని కుట్ర పూరితంగా చేసిన ఫిర్యాదులేనన్నారు. ఫాం7 ధరఖాస్తులో నూటికి నూరు శాతం వైఎస్సార్సీపీ నానుభూతిపరుల ఓట్లే ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల వేళ టీడీపీ నేతలు ఎదో కుట్ర రూపంలో వస్తారని అంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
'బాక్సైట్ అనుమతులన్నీ చంద్రబాబు ఇచ్చినవే'
సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీలోకి మారేటప్పుడు ఆ పార్టీని స్తుతిస్తూ మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బాక్సైట్ జీఓల విషయంలో అబద్ధాలు మాట్లాడారని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. గిరిజన సలహా మండలి ద్వారా గతంలో చంద్రబాబు లీజులు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టడంతో, తరువాత వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇచ్చిన జీఓను రద్దు చేశారని గుర్తు చేశారు. జీఓ నెంబర్ 97ను చంద్రబాబు ఇష్యూ చేస్తే వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తెచ్చినా పూర్తి స్థాయిలో రద్దు చేయనిది చంద్రబాబు ప్రభుత్వమేనని నిప్పులు చెరిగారు. బాక్సైట్ అనుమతులు, లీజులు అన్ని చంద్రబాబు ఇచ్చినవేనని తెలిపారు. అటవీ హక్కులపై చంద్రబాబు తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజనులు, వారి ప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు వినలేదని చెప్పారు. ఐదేళ్ల పాలన సమయం అయిపోవడంతో అభివృద్ధి చూసి ఓట్లేయమని అడగకుండా, కొత్త పథకాలు పెడుతూ, ఎన్నికల తాయిలాలు ఇస్తున్నారని తూర్పారబట్టారు. పసుపు కుంకుమ వంటి పథకాలు క్రింది స్థాయికి వెళ్ల లేదని తెలుసుకొని పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారన్నారు. బీజేపీతో కలసి ప్రయాణించినప్పుడు సాగించిన చంద్రబాబు చేతగాని పాలనను ప్రజలు మరచిపోలేదన్నారు. సాక్షి పత్రికను బహిష్కరించండి అంటూ సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజాస్వామ్యానికి మూలస్థంభం అయిన పత్రికా స్వేచ్చను హరించేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. వాస్తవాలు ప్రచారం చేస్తున్నాయనే భయంతో సాక్షిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పత్రికలను బహిష్కరించాలన్న ఒక్క పిలుపుతో చంద్రబాబుకు ఓటమిపై భయం పట్టుకుందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. -
దేశంలో తొలిసారి బీసీ అధ్యయన కమిటీ
సాక్షి, ఏలూరు: దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా బీసీల సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యయన కమిటీని వేసిందని ఆ పార్టీనేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ కులస్తుని స్థితిగతుల వివరాలను కమిటీ తీసుకుందని, ఈ వివరాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందచేసినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరులో నేడు వైఎస్సార్సీపీ బీసీ గర్జన సభ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ హయాంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన గుర్తుచేశారు. బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య వంటి అంశాల్లో పైకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. బీసీల అభివృద్ధిపై వైఎస్ జగన్ అంకితభావంతో పనిచేస్తున్నారని మజ్జి శ్రినివాసరావు పేర్కొన్నారు. -
‘అంత గోప్యత ఎందుకో’
విజయనగరం జిల్లా: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆగమేఘాల మీద భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన చేయడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తహతహలాడటం ఓట్ల కోసమేనని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. భోగాపురంలో రైతులు జిల్లా అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలా త్యాగాలు చేశారని అన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖా మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గతంలో భోగాపురం ఎయిర్‌పోర్టునకు నిర్మాణ సామర్థ్యం లేదని గతంలో చెప్పడం ప్రజలకు గుర్తుందని వ్యాక్యానించారు. ప్రాజెక్టులకు అంచనాలు(ఎస్టిమేషన్లు) వేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో కూడా తోటపల్లికి ఆఖరిలో రాయి వేసి వెళ్లిపోతే తర్వాత వచ్చిన వైఎస్సార్, బొత్స సత్యనారాయణలు దానిని 90 శాతం పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భోగాపురం విషయంలో అంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎనిమిది కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినా, టెక్నికల్ క్వాలిఫికేషన్ లేని వారికి బిడ్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ కంపెనీకి క్వాలిఫికేషన్ ఉందని శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారని అడిగారు. ఎన్నికల హామీలు 5 ఏళ్లలో నెరవేర్చి ఎన్నికల్లో ఓట్లేయాలని అడగాల్సిన మీరు, పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆఖరిలో డ్రామాలతో ఓట్లు అడగాలనుకోవడం దుష్ట సాంప్రదాయమన్నారు. అవాస్తవ ప్రక్రియ ద్వారా మీరు(చంద్రబాబు) ముందుకు వెళ్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ భోగాపురం రైతుల్లో భరోసా కల్పించారని అన్నారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సహకరిస్తే భోగాపురం రైతులపై కేసులు ఎత్తివేస్తామన్నారు..కానీ ఇంత వరకు ఎందుకు కేసులు ఎత్తివేయలేదని టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కొవ్వాడ తరహాలో రైతులకు జరిపిన చెల్లింపులను భోగాపురం రైతులకు కూడా చెల్లించాలని అడిగినా ఇంకా ఎందుకు చెల్లించలేదని సూటిగా ప్రశ్నించారు. రైతుల పట్ల కక్షాపూరితమైన చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. -
‘టీడీపీని మరోసారి నమ్మే ప్రసక్తేలేదు’
సాక్షి, విజయనగరం : చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాను అన్ని రంగాల్లో విస్మరించిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం కోసం రైతులు తమ విలువైన భూములను త్యాగం చేస్తే.. బడ్జెట్లో ఒక్క పైసా విమానాశ్రయానికి కేటాయించలేదని విమర్శించారు. నీటీ పారుదల ప్రాజెక్టుల విషయంల్లో ప్రచారమే తప్ప సాగునీటికి కేటాయింపుల్లేవన్నారు. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరితే పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కేంద్రమంతిగా నాలుగునన్నరేళ్లు ఉండి హోదా కోసం మాట్లాడని అశోక్ గజపతిరాజు.. టెంట్ల కిందకు వెళ్లి పోరాడుతున్నామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. టీడీపీ నాయకులని నమ్మి మరోసారి మోస పోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి పాల్పడి..రాష్ట్రాన్ని అంధకారం చేశారని ఆరోపించారు. జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన టీడీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. -
వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాస్ విడుదల
-
సర్వేను అడ్డుకున్నారనే నెపంతో కేసులు..
సాక్షి, విజయనగరం: దొంగ సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని సమాచారం ఇచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సర్వే సభ్యులను అడ్డుకున్నారనే నెపంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను దాదాపు 8 గంటల పాటు నిర్భంధించి విచారణ చేపట్టారు. మజ్జి శ్రీనివాస్ అక్రమ అరెస్ట్‌పై వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఆయనను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనే దానికి పోలీసులు సరైన కారణం చెప్పలేకపోతున్నారని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటనపై డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సర్వే చేసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా పీపుల్స్ రీసెర్చ్ అనే సంస్థ సర్వే చేస్తున్నట్టు తెలిపారు. సర్వేను అడ్డుకున్నవారిపై రెండు కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. జామి పీఎస్‌లో శ్రీనివాసరావును విచారించి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్టు తెలిపారు.(టీడీపీ వారి కత్తిరింపు సర్వే!) ఒక సర్వే సంస్థపై అనుమానం తలెత్తినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, దానిపై విచారణ చేపట్టకుండా.. సర్వేకు అడ్డుతగిలారనే నెపంతో వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగివుందనే ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఉత్తరాంధ్రకు మీరేం చేశారు?’
సాక్షి, విజయనగరం : టీడీపీ ఉత్తరాంధ్ర బీసీ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర బీసీ సమావేశంలో అశోక్ గజపతి రాజు మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న అశోక్ గజపతి రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభియోగాలు రుజువు కాకుండా ప్రతిపక్ష నాయకున్ని దొంగగాడు అనడం సరికాదన్నారు. ఇన్నాళ్లు కేంద్ర మంత్రిగా పని చేసిన అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పగలరా అంటూ శ్రీనివాస రావు ప్రశ్నించారు. బొబ్బిలిలో అధికంగా ఉన్న బీసీలకు కనీసం నామినేట్ పోస్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాలు సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు.. నేడు వాటిల్లోని కొన్ని పథకాలను దొంగిలించారని ఆరోపించారు. -
మరోసారి ప్రజలను మోసం చేయకండి : మజ్జి
సాక్షి, విజయనగరం : రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలిశామని చెప్పి మరోసారి ప్రజలను మోసం చేయకండని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటూ మీ అవసరాలు తీర్చుకుని, రాష్ట్ర ప్రయోజనాలు జిల్లా ప్రయోజనాల గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మీరు విడుదల చేసిస శ్వేత పత్రంలో ఇచ్చిన అంశాలు అన్నీ పూర్తిగా అవాస్తవమన్నారు. 'నిరుద్యోగులకు ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను వివరించడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 2015లో యువభేరి కార్యక్రమం నిర్వహించాము. యువభేరిలకు రవాణా సౌకర్యం కల్పించిన స్కూళ్లు, కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. పీడీ యాక్ట్‌లు అంటూ బెదిరించారు. మనం కేంద్ర ప్రభుత్వంతో పోరాడి, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి బీజేపీనీ దోషిగా నిల్చోపెడదాం అన్నాం. రాష్ట్ర హక్కుల కోసం రాజీనామా చేస్తే మన కోసం అడిగే వారు ఉండరని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఏం సాధించారు. ప్రత్యేక హోదా అవసరం లేదు అంటూ ప్యాకేజీ ఆహ్వానించారు. 2015, మార్చి10న మోదీని పొగుడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు శ్వేత పత్రం విడుదల చేశారు. ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీలను సమాయత్తం చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. బీజేపీ ఒక పక్క రాష్ట్రానికి అన్యాయం చేస్తే, పూర్తిగా అన్యాయం చేసిన ఘనత టీడీపీదే. మనం సఖ్యతతో అన్నీ సాధించుకోవాలి అంటూ మూడున్నర సంవత్సరాల పాటూ ఎన్డీఏలో ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు అశోక గజపతి రాజు రాష్ట్ర ప్రయోజనాలు కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని దోషిగా నిలుచోబెడతారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తాం అని ఎన్నికల ముందే చెప్పింది. కొత్తగా ఇప్పుడు చెప్పింది ఏమీలేదు' అంటూ మజ్జిశ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. -
ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
విజయనగరం, గుర్ల: తడిచిన ధాన్యాన్ని అంక్షలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పెథాయ్ తుఫాన్ వల్ల జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి పంట నీటిలో ఉండిపోవడంతో మండలంలోని గుర్ల, గుజ్జింగివలసలో నీటిలో మునిగిన వరి కుప్పలను ఆయన బుధవారంపరిశీలించారు. నీట మునిగిన వరి చేలును రైతులు కిలారి వెంకటప్పలనాయుడు, కిలారి అప్పారావు, మొయిద అప్పారావు, నిద్దాన గౌరినాయుడులు ఆయనకు చూపించి భోరుమన్నారు. తుఫాన్ వల్ల వరికుప్పలు నీటిలో ఉండిపోయాయని దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్టు అవేదన వ్యక్తం చేసారు. స్పందించిన మజ్జి శ్రీనివాసరావు అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని వారికి హమీ ఇచ్చారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ తడిచిన, రంగు వెలిసిన ధాన్యాన్ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా సోనామసూరి, కొనమసూరి రకాలకు చెందని వరి ధాన్యాన్ని కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేయడం లేదని దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్లే పెథాయ్ తుఫాన్‌కు ధాన్యం బస్తాలు తడిచిపోయాయని తడిచిన ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహరం అందించాలని డిమాండ్ చేశారు. చలికి తట్టుకోలేక జిల్లాలో 990 మూగజీవాలు మరణించాయని వాటికి నష్టపరిహరం అందించి రైతులు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. గత ఏడాది మొక్కజొన్న పంటకు రాయితీ పరిహరం రూ.200 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు రైతులకు అందించక పోవడం దారుణమన్నారు. రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట నాఫెడ్ డైరెక్టర్ కె.వి.సూర్యనారాయణ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ శిరువురి వెంకటరమణరాజు, ఆ పార్టీ మండలాధ్యక్షుడు శీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, వరదా ఈశ్వరరావు, రవిబాబు, బోళ్ల మణి, బెల్లాన బంగారునాయుడు, తోట తిరుపతిరావు, కెంగువ మధుసూదనరావు, జమ్ము అప్పలనాయుడు, వెంపడాపు సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
మాజీ ఎమ్మెల్యే పొట్నూరు మృతి
గుర్ల విజయనగరం : మాజీ శాసనసభ్యుడు పొట్నూరు సూర్యనారాయణ(76) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో పది రోజుల కిందట చికిత్స నిమిత్తం చేరి బుధవారం మరణించారు. కడుపునొప్పి తీవ్రంగా రావడంతో బీపీ తగ్గి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య పొట్నూరు కనకమ్మ, కుమారుడు సన్యాసినాయుడు, కుమార్తెలు వరహలమ్మ, ఆదెమ్మ, జ్యోతి ఉన్నారు. వరహలమ్మ ఇటీవలె మరణించడంతో అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రముఖల నివాళి పొట్నూరు సూర్యనారాయణ పార్ధీవ దేహన్ని వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనువాసరావు, పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామి నాయుడు, కొండపల్లి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బోత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, భంజదేవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ శిరువురి వెంకటరమణరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ చనమల్లు వెంకటరమణతో పలు మండలాలకు చెందిన ఆయన అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియలలో పాల్గొన్న మజ్జి పొట్నూరు సూర్యనారాయణ అంత్యక్రియలకు వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనువాసరావు పాల్గొని పూర్తయ్యే వరకు ఉన్నారు. అంత్యక్రియల్లో పొట్నూరు పార్ధీవ దేహం వెంట నడిచారు. శ్మశాన వాటికలోని పొట్నూరు పార్ధీవ దేహనికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఆనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు... పొట్నూరు సూర్యనారాయణ వ్యవసాయ కూలీ అయిన పొట్నూరు సన్యాసినాయుడు, ఆదెమ్మలకు 1942లో జన్మించాడు. అంచలంచెలుగా ఎదిగి 1962 గూడేం సోసైటీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం పాలవలస గ్రామ సర్పంచ్‌గా 22 ఏళ్లు పాటు కొనసాగారు. 1989లో మొదటిసారిగా సతివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఆయనను పోటికి దించింది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్ధి పెనుమత్స సాంబశివరాజు చేతిలో ఓడిపోయారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 1994లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. అనంతరం రాజకీయ సమీకరణాలు మారడంతో ఆయన బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
జగన్‌తోనే రాజన్న రాజ్యం..
బొబ్బిలి రూరల్ విజయనగరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం సిద్ధిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ, వ్యవహారాల ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) అన్నారు. మండలంలోని అలజంగిలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ తరఫున బొబ్బిలి నుంచి శంబంగే బరిలో ఉంటారని.. రాజుల్లో ఎవరు పోటీ చేస్తారో చెప్పాలన్నారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావా..? లేక ఆయన సోదరుడు బేబీనాయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కాస్తా అనారోగ్యశ్రీ గా మారిందని ఎద్దేవా చేశారు. పూర్వం రాజులు మారువేషం వేసుకుని ప్రజాసమస్యలు తెలుసుకునేవారని.. కాన ?బొబ్బిలిరాజులు మారువేషంతో కబ్జాలు చేçస్తున్నారన్నారు. చెరుకు రైతులకు ఎన్సీఎస్ యాజమాన్యం బకాయిలు, జూట్ కార్మికుల సమస్యలు మంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయారో ప్రజలే ప్రశ్నించాలన్నారు. బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జి శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ, రాజులు గడిచిన 15 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారి మంత్రి పదవి పొందారని ఆరోపించారు. సమావేశంలో బొత్స కాశినాయుడు, విశ్రాంత ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, అంబళ్ల శ్రీరాములునాయుడు, ఇంటి గోపాలరావు, సావు కృష్ణమూర్తినాయుడు, శంబంగి వేణుగోపాలనాయుడు, పెద్దింటి రామారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ నాయకుడు పొట్నూరు లకు‡్ష్మనాయుడు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన అల్లు త్రినాథనాయుడు, పైల వెంకటరమణ, యాండ్రాపు వేణుగోపాల్, అలజంగి అప్పలాచారి, డేవిడ్, రేజేటి చైతన్య, తదితరులు పార్టీలో చేరారు. -
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
విజయనగరం మున్సిపాలిటీ : విభజనతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం హక్కు అని, ఎవరో ఇచ్చే భిక్ష కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ధేశించే హోదా కోసం ప్రాణాలకు సైతం తెగించి అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నేరవేరుస్తామన్నారు. సత్య కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు హోదా సాధనలో భాగంగా ప్రతిపక్షం చేపట్టిన ఏపీ బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు తన మోసకారి బుద్దితో ఐదు కోట్ల మంది ఆంధ్రులను నయవంచనకు గురి చేసి ప్యాకే జీ మంజూరు చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సన్మానం చేయగా.... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అసెం బ్లీ సాక్షిగా ధన్యవాదాలు తీర్మానం చేసిన విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరిచిపోరన్నారు. తాజాగా రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఆయన నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు ఆశించిన ప్యాకేజీ నాటకాన్ని బహిర్గతం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మొదటి సారిగా అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రాంతీయ పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అధికార పార్టీ చేస్తే ఒప్పు... ప్రతిపక్షం చేస్తే తప్పా...? రాష్ట్ర ప్రభుత్వం కుటిల బుద్దిని జిల్లా ప్రజలు గమనించాలని మజ్జి శ్రీనివాసరావు కోరారు. ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కలెక్టర్ పాల్గొనవచ్చని కానీ... ప్రతిపక్షం ఆధ్వర్యంలో బంద్ చేపట్టడం తప్పా అంటూ నిలదీశారు. ఇదేనే హోదా సాధనలో చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అంటూ ప్రశ్నించారు. హోదా కోసం పోరాడుతున్న వారిని అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సుజయ్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. పార్టీ ఫిరాయించి నమ్మిన ప్రజలను వెన్నుపోటు పొడిచే మీ లాంటి ఆలోచనలు వైఎస్సార్ సీపీకి లేవని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ జిల్లా నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, కనకల రఘురామారావు, గంటా సతీష్, సంచాన శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జగన్‌తో సంక్షేమ రాజ్యం సాధ్యం
బొబ్బిలి రూరల్ విజయనగరం : రాజన్న సంక్షేమ రాజ్యం వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు(చిన్న శ్రీను) అన్నారు. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన ముందుగా గ్రామంలోని వైఎ స్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. సంక్షేమ ఫలాలు రాజశేఖర్‌రెడ్డి అందరికీ అందించారని, పింఛన్లు, ఇళ్లు పార్టీలకు అతీతంగా పంపిణీ చేశారని, అదే చంద్రబాబునాయుడు అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, జగన్ అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రంలో చికిత్సచేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా పథకం అమలు చేస్తారన్నారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచి తమ ఆస్తులు కాపాడుకునేందుకు, పదవి కోసం పార్టీమారారని విమర్శించారు. ఆయన రెండేళ్ల పదవీకాలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చెరకు రైతుల బకాయిలపై ఎన్సీఎస్ యాజమాన్యాన్ని నిలదీశారా....? మూడు వేలమంది కార్మికులను రోడ్డున పడేసిన జ్యూట్ మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించి కార్మికులను కాపాడారా...? అని ప్రశ్నించారు. తాము పీఏలు లేని నాయకులమని, 24గంటలూ అందుబాటులో ఉంటామని, అపాయింట్మెంట్ లేకుండా కలవొచ్చన్నారు. ఎంపీ అశోక్‌ను ఎవరైనా చూసారా...? ఆయన మనకు కనిపించని నాయకుడని, బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరూ భయపడొద్దని, వైఎస్సార్సీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాట్లాడుతూ తాము గతంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, మంత్రిగా సుజయ్‌కృష్ణ రంగారావు ఏమి చేశారని ప్రశ్నించారు. ఆయన సోదరుడు బేబీనాయన యువతకు మద్యం, డబ్బులు ఇచ్చి పాడుచేస్తున్నారని, రాజకీయాలు భ్రష్టుపట్టించారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తినాయుడు, పెద్దింటి రామారావు, బోను అప్పలనాయుడు, తెంటు సత్యంనాయుడు, శంబంగి వేణుగోపాలనాయుడు, అల్లాడ నగేష్, పువ్వల నరసింహులునాయుడు, అడబాల కృష్ణారావు, రేజేటి విసు, డమ్మా అప్పాజీ, పాలవలస ఉమాశంకరరావు, ఇంటిగోవిందరావు, దిబ్బగోపి తదితరులు పాల్గొన్నారు. -
నిరాడంబర ప్రజా సేవకుడు సూరిబాబు
విజయనగరం మున్సిపాలిటీ : నిరాడంబర ప్రజా సేవకుడు మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత అవనాపు సూరిబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. దివంగత సూరిబాబు 68వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్ సోదరుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. ముందుగా సూరిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవనాపు సూరిబాబు తన రాజకీయ జీవితంలో పేదల సంక్షేమం కోసం పరితపించారని, మున్సిపల్ చైర్మన్‌గా పట్టణ ప్రజలకు ఎన్నో సేవలందించారన్నారు. సూరిబాబు ఆశయ సాధనకు కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనయులుగా విజయ్, విక్రమ్‌లు ఎదగాలని ఆకాంక్షించారు. తండ్రి ఆశయాలను సజీవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అవనాపు సోదరులకు గుర్తింపును తెస్తాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్ సోదరులు మాట్లాడుతూ దానగుణం, పరోపకారం, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి బాధ్యతలు తాము తమ తండ్రి నుంచి అలవర్చుకున్నామని, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రంధి వినోద్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు పుస్తకాలు, అట్టలను వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అవనాపు సొదరులు పంపిణీ చేయగా... కాళ్ల నాయుడు మందిరం వద్ద 101 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, కాళ్ల గౌరీశంకర్, కౌన్సిలర్లు గాడు అప్పారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ లెంక వరలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు గదుల సత్యలత, మంచాల శివాని, దక్కు లక్ష్మి, ఎర్రంశెట్టి సునీత, పార్టీ నాయకులు ఉప్పు ప్రకాష్, డోలా మన్మధకుమార్, ఒమ్మి శ్రీను, చందక రమణ, మల్లు త్రినాధ్, పిలకా శ్రీను, గంటా సూర్యనారాయణ, తోట మధు, పతివాడ వెంకటరెడ్డి, రౌతు చంటి, అన్వర్ పాల్గొన్నారు. -
టైం దగ్గర పడింది.. త్వరలోనే చరమగీతం
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కడప ఉక్కు కోసం సంతకాల సేకరణ చేపట్టిన గజపతి రాజు, విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తామని చెప్పి మోసగించారని, యూనివర్సిటీ గిరజనుల హక్కు అని, వాటిపై పోరాడాలని అనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విభజన సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ అమలు కాలేదని ఈ విషయంపై అశోక్ గజపతి రాజు ఎందుకు పోరాటం చేయడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉందని, కేంద్రంలో భాగస్వామిగా ఉండి పదవులు అనుభవించిన ఎంపీ సంతకాల సేకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జిల్లాకు లబ్ధి చేకూర్చే అంశాలను విస్మరించిన ఎంపీకి కడప ఉక్కు పరిశ్రమకై పోరాడే అర్హత లేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానని చెప్పినట్లు, ఓటు వేసి గెలిపించిన జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని అశోక్ గజపతి రాజు.. కడప ఉక్కు పరిశ్రమ కోస పోరాడటం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసరావు తెలిన్నారు. టీడీపీ పాలనకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో గజపతి రాజుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.