
సాక్షి, ఏలూరు: దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా బీసీల సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యయన కమిటీని వేసిందని ఆ పార్టీనేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ కులస్తుని స్థితిగతుల వివరాలను కమిటీ తీసుకుందని, ఈ వివరాలన్నీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అందచేసినట్లు ఆయన వెల్లడించారు.
ఏలూరులో నేడు వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన సభ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ హయాంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన గుర్తుచేశారు. బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య వంటి అంశాల్లో పైకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. బీసీల అభివృద్ధిపై వైఎస్ జగన్ అంకితభావంతో పనిచేస్తున్నారని మజ్జి శ్రినివాసరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment