మాట్లాడుతున్న మజ్జి శ్రీనివాసరావు
బొబ్బిలి రూరల్ విజయనగరం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం సిద్ధిస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ, వ్యవహారాల ఇన్‌చార్జి మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) అన్నారు. మండలంలోని అలజంగిలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ తరఫున బొబ్బిలి నుంచి శంబంగే బరిలో ఉంటారని.. రాజుల్లో ఎవరు పోటీ చేస్తారో చెప్పాలన్నారు.
మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావా..? లేక ఆయన సోదరుడు బేబీనాయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.
ఆరోగ్యశ్రీ కాస్తా అనారోగ్యశ్రీ గా మారిందని ఎద్దేవా చేశారు. పూర్వం రాజులు మారువేషం వేసుకుని ప్రజాసమస్యలు తెలుసుకునేవారని.. కాన ?బొబ్బిలిరాజులు మారువేషంతో కబ్జాలు చేçస్తున్నారన్నారు. చెరుకు రైతులకు ఎన్‌సీఎస్ యాజమాన్యం బకాయిలు, జూట్ కార్మికుల సమస్యలు మంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయారో ప్రజలే ప్రశ్నించాలన్నారు. బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ, రాజులు గడిచిన 15 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారి మంత్రి పదవి పొందారని ఆరోపించారు. సమావేశంలో బొత్స కాశినాయుడు, విశ్రాంత ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, అంబళ్ల శ్రీరాములునాయుడు, ఇంటి గోపాలరావు, సావు కృష్ణమూర్తినాయుడు, శంబంగి వేణుగోపాలనాయుడు, పెద్దింటి రామారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ నాయకుడు పొట్నూరు లకు‡్ష్మనాయుడు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన అల్లు త్రినాథనాయుడు, పైల వెంకటరమణ, యాండ్రాపు వేణుగోపాల్, అలజంగి అప్పలాచారి, డేవిడ్, రేజేటి చైతన్య, తదితరులు పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment