Rajanna rajyam
-
వరంగల్ : రాజన్న రాజ్యం షర్మిలతోనే సాధ్యం
హన్మకొండ/వరంగల్ : దివంగత మహానేత రాజన్న రాజ్యం వైఎస్.షర్మిలతోనే సాధ్యమని వైఎస్సార్ అభిమానుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. హన్మకొండ సుబేదారిలోని ఓ హోటల్లో వైఎస్సార్ అభిమానుల ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల స్థాపించనున్న రాజకీయ పార్టీకి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం శాంతికుమార్ మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే షర్మిలకు అండగా నిలవాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సమావేశంలో అప్పం కిషన్, రాములు నాయక్, కాందడి బుచ్చిరెడ్డి, దేవానాయక్, సంగాల ఈర్మియా, బీంరెడ్డి స్వప్న, రజనీకాంత్, విల్సన్ రాబర్ట్, పసునూరి ప్రభాకర్, డి.సంపత్, రాంజీ, రవికుమార్, కె.గణేశ్, బొర్ర సుదర్శన్ కాశీం పాషా, బొచ్చు రవి, వీరబ్రహ్మం, కాయిత రాజ్‌కుమార్, రవితేజరెడ్డి, గుండ్ల రాజేశ్‌రెడ్డి, కట్టయ్య, ప్రశాంత్, ఎం.డీ.ఖాన్, వీరారెడ్డి, రఘోత్తం, వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీరాం పాల్గొన్నారు. చదవండి : (రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నా: వైఎస్ షర్మిల) (మీతోడు ఉంటే అది సాధ్యమని నమ్ముతున్నా: వైఎస్ షర్మిల) -
జగన్‌తోనే రాజన్న రాజ్యం..
బొబ్బిలి రూరల్ విజయనగరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం సిద్ధిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ, వ్యవహారాల ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) అన్నారు. మండలంలోని అలజంగిలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ తరఫున బొబ్బిలి నుంచి శంబంగే బరిలో ఉంటారని.. రాజుల్లో ఎవరు పోటీ చేస్తారో చెప్పాలన్నారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావా..? లేక ఆయన సోదరుడు బేబీనాయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కాస్తా అనారోగ్యశ్రీ గా మారిందని ఎద్దేవా చేశారు. పూర్వం రాజులు మారువేషం వేసుకుని ప్రజాసమస్యలు తెలుసుకునేవారని.. కాన ?బొబ్బిలిరాజులు మారువేషంతో కబ్జాలు చేçస్తున్నారన్నారు. చెరుకు రైతులకు ఎన్సీఎస్ యాజమాన్యం బకాయిలు, జూట్ కార్మికుల సమస్యలు మంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయారో ప్రజలే ప్రశ్నించాలన్నారు. బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జి శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ, రాజులు గడిచిన 15 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారి మంత్రి పదవి పొందారని ఆరోపించారు. సమావేశంలో బొత్స కాశినాయుడు, విశ్రాంత ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, అంబళ్ల శ్రీరాములునాయుడు, ఇంటి గోపాలరావు, సావు కృష్ణమూర్తినాయుడు, శంబంగి వేణుగోపాలనాయుడు, పెద్దింటి రామారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ నాయకుడు పొట్నూరు లకు‡్ష్మనాయుడు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన అల్లు త్రినాథనాయుడు, పైల వెంకటరమణ, యాండ్రాపు వేణుగోపాల్, అలజంగి అప్పలాచారి, డేవిడ్, రేజేటి చైతన్య, తదితరులు పార్టీలో చేరారు. -
'రాజన్న రాజ్యం ఒక్క జగన్ వల్లే సాధ్యం'
-
త్వరలోనే రాజన్న రాజ్యం
గజపతినగరం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ము ఖ్యమంత్రిని చేయూలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శని వారం దత్తిరాజేరు మండలం దాసరిపేట సర్పంచ్, టీ డీపీ నాయకుడు పోరుపురెడ్డి తిరుపతితో పాటు వంద కుటుంబాలు కడుబండి నివాస గృహంలో వైఎస్సార్ సీపీలో చేరారుు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేదలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థారుులో అందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తమ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాల రద్దు, బెల్టు షాపుల ఎత్తివేత, తదితర పథకాల వల్ల పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన స ర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ హరి బంగారునాయు డు, వార్డు మెంబర్లు శనపతి కృష్ణ, బంకురు పార్వతి, దాసరి పద్మ, గంట తిరుపతి, దాసరి రా మకృష్ణ, గంట శ్రీనివాసరావు, తదితరులకు ఆయన కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మానాపురం, వింద్యవాసి సర్పంచ్ చుక్క సన్యాసినాయుడు, కోళ్ల వెంకట సత్య శేష సాయి,గుడివాడ శ్రీనివాసరావు, పెద్దింటి మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యం కోసం కృషి చేద్దాం
రేగిడి, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు, రాజన్న రాజ్యం కోసం అందరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నారు. గురువారం మండల పరిధిలోని పుర్లిపేట, రేగిడి, చిన్నశిర్లాం, కె.వెంకటాపురం, సంకిలి, ఆడవరం, కొమెర, పెద్దపుర్లి, కొర్లవలస, నాయిరాలవలస తదితర గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి పాలవలస రాజశేఖరం పార్టీ కండువాలువేసి సాదరంగా ఆహ్వానించారు. రేగిడిలో... మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు సోదరుడు కిమిడి నీలంనాయుడు, ఆయన తనయుడు కిమిడి నరేంద్రనాయుడులు, బొండపల్లి రామన్నదొర, కొరపాన శ్రీను, జలుమూరు సూర్యనారాయణ పార్టీలో చేరారు. చిన్నశిర్లాంలో సర్పంచ్ టంకాల అచ్చెన్నాయుడు, మాజీ సర్పంచులు బంకి నారన్నాయుడు, పాలవలస జగదీష్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వావిలపల్లి వెంకటనాయుడు, మజ్జి అప్పలనాయుడు, ఉపసర్పంచ్ కొప్పిశెట్టి శ్రీను, టంకాల రామచంద్రినాయుడు చేరారు. పుర్లిలో.. మాజీ సర్పంచ్ కురిటి శ్రీరామ్మూర్తి, పట్టా మురళి, కురిటి శ్రీహరినాయుడు, కురిటి లక్షున్నాయుడు, మాజీ సర్పంచ్ మజ్జి రామ్మూర్తినాయుడు, సంకిలి మాజీ సర్పంచ్ ఎస్.తవిటినాయుడు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త పాల వలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ కన్వీన ర్ కంబాల జోగులు, పార్టీ కేంద్ర నిర్వాహక కమిటీ సభ్యుడు పీఎంజే బాబు, జాతీయ ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మామిడి శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు పి.పాపినాయుడు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో బడివానిపేట సర్పంచ్ చేరిక ఎచ్చెర్ల క్యాంపస్ మండలంలోని బడివానిపేట సర్పంచ్ వారధి ఎర్రయ్య, ఉపసర్పంచ్ మూస అప్పన్న తదితరులు వైఎస్సార్పీపీలో చేరారు. గురువారం నిర్వహించిన బహిరంగ సభలో వారితో పాటు నాయకులు దోనెల హరికృష్ణ, బడి తోటయ్య, కొమర సోమయ్య (సమరం), పంచాయతీ సభ్యులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పీ బల్లాడ జనార్దన రెడ్డి, మాడుగుల మురళీధర్ బాబా,టి.పూర్ణారావు పాల్గొన్నారు. లావేరులో... లావేరు : శిగురుకొత్తపల్లి గ్రామానికిచెందిన కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు గురువారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన మీసాల చిన్నసూర్యనారాయణ, పొన్నాడ మల్లేశ్వరరావు, మీసాల పెద్దసూర్యనారాయణ, పొన్నాడ చిన్నారావు, తిరుమరెడ్డి లక్ష్మణరావు, పొన్నాడ రాంబాబు, ఇలకల అబ్రహం, ఆర్.అప్పన్న, ఇలకల మోహనరావు, కప్పరాపు శివ, ఎ.రమేష్, మాజీ వార్డు మెంబరు రేగాన సన్యాసితో పాటు సుమారు 150 మంది పార్టీలో చేరారు. వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లావేరు మండల కన్వీనర్ వట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు బాడిత వెంకటరావు, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ సిరిపురపు పున్నారావు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యం
-
త్వరలోనే ‘రాజన్న’ రాజ్యం
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: దివంగత రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన త్వరలోనే తిరిగి వస్తుందని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని శ్రీశ్రీసర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని వారు ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘‘మనం కన్న కలలు రానున్న సంవత్సరంలో నెరవేరబోతున్నాయి. పార్టీ శ్రేణులు ఈ నాలుగైదు నెలలు బాగా కష్టపడితే ‘రాజన్న’ రాజ్యం సాధించుకోవచ్చు’’ అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలను నేటి పాలకులు తుంగలో తొక్కారని విమర్శించారు. వీటిని కొనసాగించే సత్తా ఒక్క వైఎస్.జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, తండ్రి ఆశయాలను నెరవేర్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉందని గట్టిగా నమ్ముతున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు ప్రజల్లో విస్తృతంగా తిరగాలని, వారి కష్టనష్టాలను తమవిగా భావించి.. పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా మనమందరం ముందుకు సాగుదామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకటరావ్, యడవల్లి క్రిష్ణ, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, నంబూరి రామలింగేశ్వరరావు, డాక్టర్ మట్టా దయానంద్, రామసహాయం నరేష్‌రెడ్డి, బీసీవిభాగం జిల్లా కన్వీనర్ తోటరామారావు, ఉపాధ్యాయు విభాగం జిల్లా కన్వీనర్ గురుప్రసాద్, మూడు జిల్లాల యూత్ కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లాకన్వీనర్ కాంపల్లి బాలకృష్ణ, ఐఏఎస్ అధికారి సతీమణి సామాన్య, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అయిలూరి మహేష్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లాకన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు మార్కం లింగయ్య, సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దారేల్లి అశోక్, కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాగంటి రవీంద్రర్‌రెడ్డి, ప్రచార కమిటీ సభ్యుడు జక్కం సీతయ్య పాల్గొన్నారు. పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యా లెండర్‌ను ఈ సమావేశంలో నేతలు మచ్చా శ్రీని వాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. దీనిని పార్టీ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముద్రించారు. కుట్టు మిషన్ల పంపిణీ పొంగులేటి స్వరాజ్యం-రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలలో భాగంగా కుట్టు శిక్షణ కేంద్రాలకు మిషన్లను పార్టీ కార్యాలయం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.