ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: దివంగత రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన త్వరలోనే తిరిగి వస్తుందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని శ్రీశ్రీసర్కిల్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని వారు ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘‘మనం కన్న కలలు రానున్న సంవత్సరంలో నెరవేరబోతున్నాయి. పార్టీ శ్రేణులు ఈ నాలుగైదు నెలలు బాగా కష్టపడితే ‘రాజన్న’ రాజ్యం సాధించుకోవచ్చు’’ అని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలను నేటి పాలకులు తుంగలో తొక్కారని విమర్శించారు. వీటిని కొనసాగించే సత్తా ఒక్క వైఎస్.జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, తండ్రి ఆశయాలను నెరవేర్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉందని గట్టిగా నమ్ముతున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు ప్రజల్లో విస్తృతంగా తిరగాలని, వారి కష్టనష్టాలను తమవిగా భావించి.. పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా మనమందరం ముందుకు సాగుదామని అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకటరావ్, యడవల్లి క్రిష్ణ, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, నంబూరి రామలింగేశ్వరరావు, డాక్టర్ మట్టా దయానంద్, రామసహాయం నరేష్‌రెడ్డి, బీసీవిభాగం జిల్లా కన్వీనర్ తోటరామారావు, ఉపాధ్యాయు విభాగం జిల్లా కన్వీనర్ గురుప్రసాద్, మూడు జిల్లాల యూత్ కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లాకన్వీనర్ కాంపల్లి బాలకృష్ణ, ఐఏఎస్ అధికారి సతీమణి సామాన్య, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అయిలూరి మహేష్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లాకన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు మార్కం లింగయ్య, సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దారేల్లి అశోక్, కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాగంటి రవీంద్రర్‌రెడ్డి, ప్రచార కమిటీ సభ్యుడు జక్కం సీతయ్య పాల్గొన్నారు.
పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యా లెండర్‌ను ఈ సమావేశంలో నేతలు మచ్చా శ్రీని వాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. దీనిని పార్టీ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముద్రించారు.
కుట్టు మిషన్ల పంపిణీ
పొంగులేటి స్వరాజ్యం-రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలలో భాగంగా కుట్టు శిక్షణ కేంద్రాలకు మిషన్లను పార్టీ కార్యాలయం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.
త్వరలోనే ‘రాజన్న’ రాజ్యం
Published Mon, Dec 23 2013 2:53 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement