macha srinivas rao
-
త్వరలోనే ‘రాజన్న’ రాజ్యం
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: దివంగత రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన త్వరలోనే తిరిగి వస్తుందని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని శ్రీశ్రీసర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని వారు ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘‘మనం కన్న కలలు రానున్న సంవత్సరంలో నెరవేరబోతున్నాయి. పార్టీ శ్రేణులు ఈ నాలుగైదు నెలలు బాగా కష్టపడితే ‘రాజన్న’ రాజ్యం సాధించుకోవచ్చు’’ అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలను నేటి పాలకులు తుంగలో తొక్కారని విమర్శించారు. వీటిని కొనసాగించే సత్తా ఒక్క వైఎస్.జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, తండ్రి ఆశయాలను నెరవేర్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉందని గట్టిగా నమ్ముతున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు ప్రజల్లో విస్తృతంగా తిరగాలని, వారి కష్టనష్టాలను తమవిగా భావించి.. పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా మనమందరం ముందుకు సాగుదామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకటరావ్, యడవల్లి క్రిష్ణ, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, నంబూరి రామలింగేశ్వరరావు, డాక్టర్ మట్టా దయానంద్, రామసహాయం నరేష్‌రెడ్డి, బీసీవిభాగం జిల్లా కన్వీనర్ తోటరామారావు, ఉపాధ్యాయు విభాగం జిల్లా కన్వీనర్ గురుప్రసాద్, మూడు జిల్లాల యూత్ కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లాకన్వీనర్ కాంపల్లి బాలకృష్ణ, ఐఏఎస్ అధికారి సతీమణి సామాన్య, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అయిలూరి మహేష్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లాకన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు మార్కం లింగయ్య, సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దారేల్లి అశోక్, కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాగంటి రవీంద్రర్‌రెడ్డి, ప్రచార కమిటీ సభ్యుడు జక్కం సీతయ్య పాల్గొన్నారు. పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యా లెండర్‌ను ఈ సమావేశంలో నేతలు మచ్చా శ్రీని వాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. దీనిని పార్టీ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముద్రించారు. కుట్టు మిషన్ల పంపిణీ పొంగులేటి స్వరాజ్యం-రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలలో భాగంగా కుట్టు శిక్షణ కేంద్రాలకు మిషన్లను పార్టీ కార్యాలయం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. -
జగన్ సీఎం కావడం ఖాయం
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, వచ్చే పుట్టిన రోజు వేడుకలు సీఎం హోదాలోనే జరుపుకుంటారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. పొంగులేటి, మచ్చా కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం, వారు మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు పూర్తిస్థాయిలో అమలుజరగాలన్నా, తమ కష్టాలు తీరాలన్నా జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సిందేనని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అన్నదాతలు నేడు అనేక కష్టనష్టాలు అనుభవిస్తున్నారని, ఇటీవలి తుపానుతో వారు కోలుకోలేనంతగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవడంపైగానీ, పంట నష్ట పరిహారం ఇవ్వడంపైగానీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధాసక్తి చూపడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారిని గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే రైతాంగ సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. నేడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలేవీ సక్రమంగా అమలవడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. పేదలను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు మార్కం లింగయ్య గౌడ్, జిల్లా కన్వీనర్ తోట రామారావు, న్యాయవాదుల విభాగం జిల్లా కన్వీనర్ పాపారావు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు హెచ్.వెంకటేశ్వర్లు, వల్లూరి సత్యనారాయణ, ఆరెంపుల వీరభద్రం, మోర్తాల నాగార్జునరెడ్డి, జమలాపురం రామకృష్ణ, నాయకులు మందడపు వెంకటేశ్వరరావు, ఆకుల మూర్తి, ఎండి.ముస్తాఫా, కీసర పద్మజారెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి, కొంగర జ్యోతిర్మ యి, మైపా కృష్ణ, ఎస్కె.సఖీనా, పత్తి శ్రీను, షర్మిలాసంపత్, సింగు శ్రీను, పొదిల భిక్షం, అశోక్ రెడ్డి, వల్లూరి తిరుపతిరావు, ఫిరోజ్, సబిత, జాకఫ్ ప్రతాప్, నారుమళ్ల వెంకన్న, లత, ఎస్కె.హిమామ్‌బీ, దోసపాటి కిరణ్, తుమ్మా అప్పిరెడ్డి, ఎంఎ.సమద్, రఘునాధపాలెం మండల కన్వీనర్ దుంపటి నగేష్, విశ్రాంత డీపీఓ క్రిష్టఫర్, గ్రామ పంచాయతీ విశ్రాంత ఈఓ చక్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. -
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
కూసుమంచి, న్యూస్‌లైన్: కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఒక్కటేనంటూ పాలేరు నియోజకవర్గంలో మంత్రి రాంరెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ వస్తున్నందున వైఎస్సార్సీపీ.. కాంగ్రెస్‌లో కలుస్తుందని మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని వారు మానుకోవాలని మచ్చా శ్రీనివాసరావు హెచ్చరించారు. పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుపై శుక్రవారం ఆయన స్థానిక నాయకులతో కూసుమంచిలోని పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలను పలువురు నాయకులు ఈ సందర్భంగా మచ్చా దృష్టికి తీసుకురాగా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మంత్రి గారు మీరు పెద్ద వారు.. రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం చేస్తున్నారని తెలిసింది.. వైఎస్ వల్ల ఎంతో లబ్ధిపొందిన మీరు మా పార్టీ(వైఎస్సార్సీపీ)లోకి వస్తే మీ వయసుని గౌరవించి మీ నాయకత్వంలో పని చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు. రాష్ట్రం విడిపోయినా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ ఫలాలు పొందిన ప్రజలు ఆయన తనయుడు స్థాపించిన పార్టీకి అభిమానులుగా ఉంటారని అన్నారు. ప్రాంతాలు, కులాలు, మతాల కతీతంగా ప్రజల సంక్షేమానికి కృషి చేసిన మహానేత వారి హృదయాల్లో సుస్థిరంగా ఉన్నాడని, ప్రాంతాలు వేరు చేసినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి ఆయన్ను వేరు చేయలేరని అన్నారు. వైఎస్ దయతో జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులు పొందిన వారు మహానేత దూరమయ్యాక జగన్ మీద, ఆయన కుటుంబం మీద బురదజల్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి ఒక విధి విధానం ఉందని, రాష్ట్ర విభజన జరిగినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. కార్యకర్తల్లో ఆందోళన సృష్టించి వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఒక్కటయ్యే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మచ్చా శ్రీనివాసరావు హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందడపు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మార్కం లింగయ్యగౌడ్, జిల్లా నాయకులు అశోక్ రెడ్డి, మండల కన్వీనర్ బజ్జూరి వెంకటరెడ్డి, నాయకులు బయ్య లింగయ్యయాదవ్, బారి శ్రీను, వైవీడీరెడ్డి, డవెల్లి పుల్లారెడి, చాట్ల సత్యనారాయణ, ఎండి మజీద్, కొండా నర్సయ్య, రమేష్‌రెడ్డి, ఈగలపాటి నాగేశ్వరరావు, ఆడెపు వీరబాబు పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కనుమరుగే
ములకలపల్లి, న్యూస్‌లైన్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో మాదిరిగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కనుమరుగవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు విమర్శించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమకమడం లేదనే విషయం ఈ ఎన్నికల్లో తేటతెల్లమైందని అన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రజలపై భారం మోపిందని, ఫలితం అనుభవించిందని అన్నారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగానే మన రాష్ట్రం లోనూ వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా వైఎస్ఆర్ సీపీని ఆదరిస్తున్నారని, ఇక్కడ కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ పుష్పాల చందర్రావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి కొమరయ్య, జిల్లా నాయకులు తాండ్ర రాంబాబు, సున్నం వెంకటేశ్వర్లు, బత్తుల అంజి, మండల నాయకులు కీసరి జయరెడ్డి, కొండవీటి రాజారావు, జల్లారపు వెంకటేశ్వర్లు, దూడల రాము తదితరులు పాల్గొన్నారు. అసత్య ఆరోపణలే కాంగ్రెస్, టీడీపీ ఎజెండా దమ్మపేట: రాష్ట్రంలో పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన టీడీపీ కుమ్మక్కయి రాజకీయాలకు కొత్త అర్థం చెబుతున్నాయని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు విమర్శించారు. ఆయన బుధవారం ఇక్కడ పార్టీ జిల్లా నాయకుడు దారా యుగంధర్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్ఆర్ సీపీపై అసత్య రోపణలు చేయడమే వాటికి ప్రధాన ఎజెండాగా మారిందని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా.. 2014లో వైఎస్.జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేవని అన్నారు. నిర్మాణమే లేని మన జిల్లాలో వైఎస్ఆర్ సీపీ గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 200 గ్రామ పంచాయతీలకు పైగా గెలుచుకుందని, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జగన్ పార్టీకి ఓటు వేయాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డ్రామాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం అమలుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలన్న నిబంధన అమలవడం లేదన్నారు. ఇప్పటివరకు 43 రోజులు పనులు కల్పించలేదన్నారు. ఉపాధి కూలీకి రోజుకు 149 రూపాయలు ఇవ్వాలన్న నిబంధన అమలవడం లేదని విమర్శించారు. రోజంతా కష్టపడినా 20 నుంచి 30 రూపాయలు మాత్రమే గిట్టుబాటవుతోందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సోయం వీరభద్రం, సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు బండారు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, నాయకులు ఓంకార కృష్ణకుమార్, పాకనాటి శ్రీను, షాకీర్ పాషా, చవ్వా పోలారావు, దారా పాపారావు, బుర్రి సుబ్బారావు, ఎస్కె.షుకూర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌ను కలిసిన జిల్లా నేతలు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిని జగన్‌కు వివరించినట్లు మచ్చా, పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ చేసే ప్రతిపనికి తాము అండగా ఉంటామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో పినపాక, భద్రాచలం, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, నంబూరి రామలింగేశ్వరరావు, మట్టాదయానంద్, మధిర నియోజకవర్గ సీనియర్ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, యువజన విభాగం మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ భూక్యా దళ్‌సింగ్‌నాయక్, బీసీ సెల్ జిల్లా నాయకులు తోట రామారావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మార్కం లింగయ్యగౌడ్, కడియం రామాచారి, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, చంద్రశేఖర్, రైతుసంఘం జిల్లా కన్వీనర్ మందడపు సత్యనారాయణ, జిల్లా నాయకురాలు కీసర పద్మజారెడ్డి, జమలాపురపు రామకృష్ణ, మంత్రిప్రగడ నరసింహారావు, నగర మహిళా కన్వీనర్ కొత్తకుండ్ల శ్రీలక్ష్మి, రఘునాధపాలెం మండల కన్వీనర్ దుంపటి నగేష్, ఖమ్మం నగర ఉపాధ్యాయ విభాగం కన్వీనర్ షర్మిలా సంపత్, ముదిగొండ మండల కన్వీనర్ మర్రికంటి గురుమూర్తి, నాయకులు గంటా కృష్ణ,, కోయ రేణుక, నల్లా స్వరూపరాణి, అన్నపూర్ణ, మర్రికంటి భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు కిరణ్ తదితరులు ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి... టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షురాలు మరికంటి ఊర్మిలాగౌడ్ శుక్రవారం హైదారాబాద్‌లో జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.