ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని, వచ్చే పుట్టిన రోజు వేడుకలు సీఎం హోదాలోనే జరుపుకుంటారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. పొంగులేటి, మచ్చా కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం, వారు మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు పూర్తిస్థాయిలో అమలుజరగాలన్నా, తమ కష్టాలు తీరాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సిందేనని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అన్నదాతలు నేడు అనేక కష్టనష్టాలు అనుభవిస్తున్నారని, ఇటీవలి తుపానుతో వారు కోలుకోలేనంతగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవడంపైగానీ, పంట నష్ట పరిహారం ఇవ్వడంపైగానీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధాసక్తి చూపడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారిని గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే రైతాంగ సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. నేడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలేవీ సక్రమంగా అమలవడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. పేదలను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు మార్కం లింగయ్య గౌడ్, జిల్లా కన్వీనర్ తోట రామారావు, న్యాయవాదుల విభాగం జిల్లా కన్వీనర్ పాపారావు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు హెచ్.వెంకటేశ్వర్లు, వల్లూరి సత్యనారాయణ, ఆరెంపుల వీరభద్రం, మోర్తాల నాగార్జునరెడ్డి, జమలాపురం రామకృష్ణ, నాయకులు మందడపు వెంకటేశ్వరరావు, ఆకుల మూర్తి, ఎండి.ముస్తాఫా, కీసర పద్మజారెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి, కొంగర జ్యోతిర్మ యి, మైపా కృష్ణ, ఎస్‌కె.సఖీనా, పత్తి శ్రీను, షర్మిలాసంపత్, సింగు శ్రీను, పొదిల భిక్షం, అశోక్ రెడ్డి, వల్లూరి తిరుపతిరావు, ఫిరోజ్, సబిత, జాకఫ్ ప్రతాప్, నారుమళ్ల వెంకన్న, లత, ఎస్‌కె.హిమామ్‌బీ, దోసపాటి కిరణ్, తుమ్మా అప్పిరెడ్డి, ఎంఎ.సమద్, రఘునాధపాలెం మండల కన్వీనర్ దుంపటి నగేష్, విశ్రాంత డీపీఓ క్రిష్టఫర్, గ్రామ పంచాయతీ విశ్రాంత ఈఓ చక్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
జగన్ సీఎం కావడం ఖాయం
Published Sun, Dec 22 2013 11:10 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement