ములకలపల్లి, న్యూస్‌లైన్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో మాదిరిగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కనుమరుగవుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు విమర్శించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమకమడం లేదనే విషయం ఈ ఎన్నికల్లో తేటతెల్లమైందని అన్నారు.
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రజలపై భారం మోపిందని, ఫలితం అనుభవించిందని అన్నారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగానే మన రాష్ట్రం లోనూ వైఎస్‌ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా వైఎస్‌ఆర్ సీపీని ఆదరిస్తున్నారని, ఇక్కడ కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ పుష్పాల చందర్రావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి కొమరయ్య, జిల్లా నాయకులు తాండ్ర రాంబాబు, సున్నం వెంకటేశ్వర్లు, బత్తుల అంజి, మండల నాయకులు కీసరి జయరెడ్డి, కొండవీటి రాజారావు, జల్లారపు వెంకటేశ్వర్లు, దూడల రాము తదితరులు పాల్గొన్నారు.
అసత్య ఆరోపణలే కాంగ్రెస్, టీడీపీ ఎజెండా
దమ్మపేట: రాష్ట్రంలో పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన టీడీపీ కుమ్మక్కయి రాజకీయాలకు కొత్త అర్థం చెబుతున్నాయని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు విమర్శించారు. ఆయన బుధవారం ఇక్కడ పార్టీ జిల్లా నాయకుడు దారా యుగంధర్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్‌ఆర్ సీపీపై అసత్య రోపణలు చేయడమే వాటికి ప్రధాన ఎజెండాగా మారిందని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా.. 2014లో వైఎస్.జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేవని అన్నారు. నిర్మాణమే లేని మన జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 200 గ్రామ పంచాయతీలకు పైగా గెలుచుకుందని, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జగన్ పార్టీకి ఓటు వేయాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డ్రామాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం అమలుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.
సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలన్న నిబంధన అమలవడం లేదన్నారు. ఇప్పటివరకు 43 రోజులు పనులు కల్పించలేదన్నారు. ఉపాధి కూలీకి రోజుకు 149 రూపాయలు ఇవ్వాలన్న నిబంధన అమలవడం లేదని విమర్శించారు. రోజంతా కష్టపడినా 20 నుంచి 30 రూపాయలు మాత్రమే గిట్టుబాటవుతోందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సోయం వీరభద్రం, సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు బండారు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, నాయకులు ఓంకార కృష్ణకుమార్, పాకనాటి శ్రీను, షాకీర్ పాషా, చవ్వా పోలారావు, దారా పాపారావు, బుర్రి సుబ్బారావు, ఎస్‌కె.షుకూర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కనుమరుగే
Published Thu, Dec 12 2013 3:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement